ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్ | IndiGo Sells Tickets From Rs 868 In New Offer | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్

Published Mon, Nov 7 2016 2:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్

ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్

బడ్జెట్ క్యారియర్ ఇండిగో కొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. రూ.868కే(అన్నీ చార్జీలను కలుపుకుని) విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. నవంబర్ 8 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎంపికచేసిన దేశీయ మార్గాలలో ఈ ఆఫర్ 2017 జనవరి 11 నుంచి 2017 ఏప్రిల్ 11వరకు వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంచుతుందో కంపెనీ స్పష్టంచేయలేదు. ఇండిగో వెబ్సైట్ను చెక్ చేసిన వాళ్లకి రూ.868 ఆఫర్ కనిపిస్తోంది. భారత్లో ఎయిర్ ట్రావెల్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా విమానయాన సంస్థలు పోటీపడి మరీ ప్రమోషనల్ ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నారు.
 
ఇటీవలే లోకాస్ట్ ఎయిర్ ట్రావెల్గా పేరొందిన గోఎయిర్ తన 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.611కే టిక్కెట్ను విక్రయించనున్నట్టు తెలిపింది. భారత్ ఏవియేషన్ పరిశ్రమ ప్రపంచ ఏవియేషన్ మార్కెట్లో అత్యంత వేగవంతమైన మార్కెట్గా పేరొందుతోంది. ఏవియేషన్ రెగ్యులేటరీ తాజా డేటా ప్రకారం గత నెలలో  స్థానిక క్యారియర్లు 82.3 లక్షలు పెరిగినట్టు తెలిసింది. అదేవిధంగా దేశీయ ఎయిర్ ప్యాసెంజర్ల ట్రాఫిక్ వృద్ది గతేళ్లతో పోలిస్తే 20 శాతం కంటే అధికంగా ఉందని తెలిపాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement