ఇండిగో స్పెషల్‌​ ఆఫర్‌ | IndiGo Offers Tickets From Rs. 970, Delhi-Mumbai Below Rs. 2,000 | Sakshi
Sakshi News home page

ఇండిగో స్పెషల్‌​ ఆఫర్‌

Published Mon, Aug 14 2017 2:11 PM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

ఇండిగో స్పెషల్‌​ ఆఫర్‌

ఇండిగో స్పెషల్‌​ ఆఫర్‌

ముంబై:  ప్రైవేట్ క్యారియర్ ఇండిగో  స్పెషల్‌ ప్రమోషనల్‌ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది.   ఈ  ఆఫర్‌ లో భాగంగా  రూ.970లకే విమాన టికెట్‌ను అందిస్తోంది.   ఆగస్టు 16 వరకు  ఈ ఇండిగో ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా  ఆగస్టు 26 నుంచి  మార్చి 24, 2018 మధ్యకాలంలో ప్రయాణించవచ్చు.

ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ గోఇండిగో.ఇన్‌.ప్రకారం  రూ.ఢిల్లీ-జైపూర్ మార్గంలో రూ.970 ఆఫర్ వర్తిస్తుంది. అలాగే అహ్మదాబాద్, అమృత్‌సర్‌, బాగ్డోగ్ర, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, మదురై, మంగళూరు, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, శ్రీనగర్, తిరువనంతపురం, ఉదయపూర్, వడోదర తదితర  ఎంపిక చేసిన మార్గాల్లో నాన్‌స్టాప్‌ విమానాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణానికి 15 రోజులకు ముందు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్ క్రింద లభించే సీట్ల సంఖ్యను  ఇండిగో వెల్లడించలేదు. ఈ ఆఫర్ సీట్ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇండిగోకు చెందిన అన్ని  బుకింగ్ ఛానల్స్‌ ఈ ఆఫర్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.  వెబ్‌సైట్‌  లో అందుబాటులో ఉన్నసమాచారం  ప్రకారం ఢిల్లీ-ముంబయి టికెట్‌ ధర రూ. 1,941; ఢిల్లీ-నాగపూర్ రూ. 1,578, ఢిల్లీ-పూణే రూ. 2,049, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ. 1,418, ఢిల్లీ-బెంగళూరు రూ. 2,479గాను ఉన్నాయి.

కాగా ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌  కూడా 20-30శాతం తగ్గింపు ధరలో విమాన టికెట్లను ఆఫర్‌ చేసింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు భారతదేశంలో విమాన ప్రయాణంలో బలమైన అభివృద్ధిని పెంచాయి. 2017 జనవరి-జూన్ కాలంలో  18 శాతం వృద్ధితో దేశీయ విమాన  ప్రయాణికులు 561.55 లక్షలుగా ఉన్నారు. గత ఏడాది ఇదే కాలంలో 475.79 లక్షలు నమోదయ్యారiరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement