ఐఆర్‌సీటీసీ టికెట్ ధరలలో వ్యత్యాసాల గురించి శివసేన (యుబిటి) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఐఆర్‌సీటీసీ టికెట్ ధరలలో వ్యత్యాసం ఉండటానికి కారణం ఏమిటనే విషయాలు ఇక్కడ చూసేద్దాం..
ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు.. సౌలభ్య రుసుము, లావాదేవీ ఛార్జీల కారణంగా రైల్వే కౌంటర్లలో భౌతికంగా కొనుగోలు చేసే వారి కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆన్‌లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్‌సీటీసీ గణనీయమైన ఖర్చును భరిస్తుంది. అయితే టికెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, అప్‌గ్రేడేషన్ వంటి వాటికి అయ్యే ఖర్చును తగ్గించడానికి.. సౌకర్య రుసుమును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా.. కస్టమర్లు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు.
ఐఆర్‌సీటీసీ అందించే ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అనేది ప్రయాణీకులకు చాలా ఉపయోగకరం. ప్రస్తుతం చాలా మంది ముందుగా రిజర్వ్ చేసుకోవాలనుకునే వారిలో 80 శాతానికి పైగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారని వైష్ణవ్ అన్నారు.
ఇదీ చదవండి: IRCTC సూపర్ యాప్: అన్నీ సేవలు ఒకేచోట
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందించిన తరువాత.. టికెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని నిరోదించింది. తద్వారా వారికి రవాణా కౌంటర్లకు వెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రమే కాకుండా సమయం కూడా తగ్గిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ విషయాలను రౌత్ తప్పకుండా తెలుసుకోవాలనుకున్నారు.
హైడ్రోజన్ రైళ్లు
హైడ్రోజన్ రైళ్లను నిర్మించడానికి సంబంధించిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేయడానికి రైల్వేస్ అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టాయని, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన.. అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment