
తిరుమల/తిరుపతి రూరల్: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు మే నెల కోటాను మంగళవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ టికెట్లు పొందిన భక్తులు ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, అటువంటి వారికి మాత్రమే టికెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఇక 21వ తేదీన ఆర్జిత సేవ, 22న అంగప్రదక్షిణం టోకెట్లు, శ్రీవాణి టికెన్ల ఆన్‌లైన్ కోటా, వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మే నెల తిరుమల, తిరుపతిలో గదుల కోటాను 24న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. భక్తులు ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్ కోసం https:/ ttddeva sthanams. ap.gov.in వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచించారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ తదితరులు దర్శించుకున్నారు. కాగా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ‘ఉపమాక’ ఆలయ అభివృద్ధికి సహకరించండి అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని హోం మంత్రి అనిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచి్చన మంత్రి దర్శనానంతరం టీటీడీ చైర్మన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.
అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల విరాళం
శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌కు సోమవారం రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసిద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్‌కు చెందిన తుషార్ కుమార్ అనే భక్తుడు విరాళాన్ని తిరుమలలో టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. అలాగే ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన భక్తుడు రూ.10 లక్షలు, తిరుపతి చెందిన పృథ్వీ రూ.10 లక్షలు డీడీలను అదనపు ఈవోకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment