ఇండిగో స్పెషల్‌ ఆఫర్స్‌ | IndiGo Offers Tickets Starting Rs. 1,174. Details Here | Sakshi
Sakshi News home page

ఇండిగో స్పెషల్‌ ఆఫర్స్‌

Published Thu, Sep 14 2017 12:00 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

ఇండిగో స్పెషల్‌ ఆఫర్స్‌

ఇండిగో స్పెషల్‌ ఆఫర్స్‌

సాక్షి, ముంబై:  ప్రముఖవిమానయాన సం‍స్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌  తక్కువ ధరలో  విమాన టెకెట్లను ఆఫర్‌ చేస్తోంది.  దేశీయ మార్కెట్‌లో  ఎంపిక చేసిన మార్గాల్లో వన్-వే విమానాల్లో రూ.1174 ( అన్నీ చార్జీలు కలుపుకొని)  ప్రారంభ ధరలను ఆఫర్‌ చేస్తోంది.


విమానయానంలో నెలకొన్న బలమైన పోటీని క్యాష్‌ చేసుకునే  యోచనలో ఇండిగో ఈ డిస్కౌంట్‌  ధరలను  ప్రకటించింది.  ఇండిగో వెబ్‌సైట్‌ ప్రకారం    చెన్నై-బెంగళూరు మార్గంలో  టికెట్‌ ధర్‌ రూ.1,174గాను, ఢిల్లీ నుండి జైపూర్ కు రూ.1,178 రూ. జమ్మూ- శ్రీనగర్‌ రూ. 1,220గా ఉంది.  శ్రీనగర్-జమ్మూ రూ.1583,  రూ. చండీగడ్‌-ఢిల్లీ రూ.1,592, రూ. లక్నో-ఢిల్లీ రూ. 1,597 ధరల్లో టికెట్ లుఅందుబాటులో ఉండనున్నాయి.  ఇండిగో బుకింగ్స్ పోర్టల్ లో అక్టోబర్ ,  నవంబర్ ​కాలానికి  చెన్నై - బెంగళూరు మధ్య బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు  ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. దీనికి అదననంగా  నాన్‌ రిఫండబుల్‌ ఫీజు రూ. 200 ను రద్దు  చేయనుంది. అయితే దీనికి  ఇంటర్‌ నెట్‌  బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డులు / డెబిట్ ద్వారా  చేసే అన్ని ఆన్‌లైన్‌ చెల్లింపులకు  ఈ తగ్గింపు వర్తిస్తుంది.
అలాగే ఎయిర్‌ పోర్టుకు అనుకున్న సమయం కంటే ముందుగా చేరుకున‍్న ప్రయాణీకులకు రూ.1000 అదనపు తగ్గింపును ప్రకటించింది.  తమ ప్రయాణాన్ని కనీసం నాలుగు గంటలకు ముందుకు జరుపుకున్న వారికి  ఇండిగో ఎర్లీ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే టికెట్‌ బుకింగ్‌ సమయంలోఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి  వుంటుంది. దేశీయ రూట్లలో డిమాండ్‌ను పెంచడానికి  ఈనిర్ణయం తీసుకున్నట్టు  ఇండిగో తెలిపింది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement