
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్.. ఏజీఎం సమావేశంలో 'జియో ఫోన్ కాల్ ఏఐ' (JioPhonecall AI) ఆవిష్కరించింది. రిలయన్స్ జియో ఛైర్మన్ 'ఆకాష్ అంబానీ'.. కంపెనీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కాల్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్‌క్రైబ్ ఫీచర్‌ను ప్రకటించారు.
జియో ఫోన్ కాల్ ఏఐ ప్రతి కాల్‌లో ఏను ఉపయోగించడానికి ముమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
జియో ఫోన్ కాల్ ఏఐతో.. వినియోగదారులు జియో క్లౌడ్‌లో ఎటువంటి ఫోన్ కాల్‌నైనా రికార్డ్ చేసుకోవచ్చు. మాట్లాడే పదాలను కూడా ఏఐ ఆటోమాటిక్‌గా టెక్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది వివిధ భాషలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా భాషాపరమైన అవరోధాలతో సంబంధం లేకుండా కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.

'జియో ఫోన్ కాల్ ఏఐ' ఎలా ఉపయోగించాలి
జియో ఫోన్ కాల్ ఏఐను ఉపయోగించడం చాలా సులభం. దీనికోసం ఓ ప్రత్యేకమైన నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఒకవ్యక్తికి కాల్ చేసినప్పుడు.. ఏఐ కాల్ నెంబర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ సెటప్ మాదిరిగా డయల్ చేయాల్సి ఉంటుంది.
👉జియో ఫోన్ కాల్ ఏఐ నెంబర్ 1-800-1732673కు డయల్ చేయాలి.
👉నెంబర్ కనెక్ట్ అయిన తరువాత రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత రికార్డింగ్ ప్రారంభమవుతుంది.
👉మీరు ఏ సమయంలో అయిన ట్రాన్స్‌క్రిప్షన్‌ను పాజ్ చేయవలసి వస్తే 2 క్లిక్ చేయాలి. ఆ తరువాత ఏఐ మీకు ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేసినట్లు చెబుతుంది.
👉మళ్ళీ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి, సెషన్ ముగించడానికి 3 క్లిక్ చేయాలి.