Reliance AGM Meeting
-
'ఆశ, ఆందోళన కాలంలో ఉన్నాము': ముకేశ్ అంబానీ
గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి మోదీ నిదర్శనమని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి గెలిచినా దూరదృష్టి గల ప్రధాని మోదీని హృదయపూర్వకంగా అభినందిద్దాం అని అన్నారు.నేటి ప్రపంచం ఆశ & ఆందోళన రెండింటినీ తెస్తుందిప్రస్తుత గ్లోబల్ డైనమిక్స్‌ను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. మనం అపారమైన ఆశ, ఆందోళన రెండింటి కాలంలో జీవిస్తున్నామని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో.. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్, రోబోటిక్స్, లైఫ్ సైన్సెస్ వంటివి భవిష్యత్తును రూపొందిస్తున్నాయి.వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అంత నష్టాలను కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశం నిరంతర వృద్ధి పెరుగుదలపై అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. -
'జియో ఫోన్ కాల్ ఏఐ' లాంచ్: ఇదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్.. ఏజీఎం సమావేశంలో 'జియో ఫోన్ కాల్ ఏఐ' (JioPhonecall AI) ఆవిష్కరించింది. రిలయన్స్ జియో ఛైర్మన్ 'ఆకాష్ అంబానీ'.. కంపెనీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కాల్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రైబ్ ఫీచర్‌ను ప్రకటించారు.జియో ఫోన్ కాల్ ఏఐ ప్రతి కాల్లో ఏను ఉపయోగించడానికి ముమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.జియో ఫోన్ కాల్ ఏఐతో.. వినియోగదారులు జియో క్లౌడ్‌లో ఎటువంటి ఫోన్ కాల్నైనా రికార్డ్ చేసుకోవచ్చు. మాట్లాడే పదాలను కూడా ఏఐ ఆటోమాటిక్‌గా టెక్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది వివిధ భాషలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా భాషాపరమైన అవరోధాలతో సంబంధం లేకుండా కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.'జియో ఫోన్ కాల్ ఏఐ' ఎలా ఉపయోగించాలిజియో ఫోన్ కాల్ ఏఐను ఉపయోగించడం చాలా సులభం. దీనికోసం ఓ ప్రత్యేకమైన నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఒకవ్యక్తికి కాల్ చేసినప్పుడు.. ఏఐ కాల్ నెంబర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ సెటప్ మాదిరిగా డయల్ చేయాల్సి ఉంటుంది.👉జియో ఫోన్ కాల్ ఏఐ నెంబర్ 1-800-1732673కు డయల్ చేయాలి.👉నెంబర్ కనెక్ట్ అయిన తరువాత రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత రికార్డింగ్ ప్రారంభమవుతుంది.👉మీరు ఏ సమయంలో అయిన ట్రాన్స్క్రిప్షన్ను పాజ్ చేయవలసి వస్తే 2 క్లిక్ చేయాలి. ఆ తరువాత ఏఐ మీకు ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేసినట్లు చెబుతుంది.👉మళ్ళీ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి, సెషన్ ముగించడానికి 3 క్లిక్ చేయాలి. -
జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్
'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. ఇందులో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ గురించి కూడా ప్రస్తావించారు.100 జీబీ ఫ్రీ47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్హోల్డర్లను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని ఆయన ప్రకటించారు.ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి & యాక్సెస్ చేయడానికి జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. వచ్చే దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Addressing the shareholders during the 47th Annual General Meeting, Reliance Industries Chairman Mukesh Ambani says, "I am thrilled to announce the Jio AI-Cloud Welcome offer. Today, I am announcing that Jio users will get up to 100 GB of free cloud storage, to securely… pic.twitter.com/80RnNxePI7— ANI (@ANI) August 29, 20241:1 బోనస్ ఇష్యూసెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన ఆమోదించబడితే.. పెట్టుబడిదారుడు ప్రతి షేరుకు అదనపు వాటాను పొందే అవకాశం ఉంటుంది.డైరెక్టర్ల బోర్డు 1:1 బోనస్ ఇష్యూను ప్రతిపాదిస్తే.. కంపెనీ నిల్వలను క్యాపిటలైజ్ చేయడం ద్వారా నిధులు సమకూరుస్తాయి. 1:1 బోనస్ ఇష్యూ అనేది ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు కలిగి ఉన్న షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా రివార్డ్ చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వారి షేర్లను సమర్థవంతంగా రెట్టింపు చేస్తుంది. బోనస్ ఇష్యూలు కంపెనీ తన భవిష్యత్తు అవకాశాలపై మరియు బలమైన ఆర్థిక స్థితిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.