![Mukesh Ambani Congratulates PM Narendra Modi](/styles/webp/s3/article_images/2024/08/29/ambani-agm.jpg.webp?itok=IAntFMFS)
గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి మోదీ నిదర్శనమని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి గెలిచినా దూరదృష్టి గల ప్రధాని మోదీని హృదయపూర్వకంగా అభినందిద్దాం అని అన్నారు.
నేటి ప్రపంచం ఆశ & ఆందోళన రెండింటినీ తెస్తుంది
ప్రస్తుత గ్లోబల్ డైనమిక్స్‌ను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. మనం అపారమైన ఆశ, ఆందోళన రెండింటి కాలంలో జీవిస్తున్నామని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో.. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్, రోబోటిక్స్, లైఫ్ సైన్సెస్ వంటివి భవిష్యత్తును రూపొందిస్తున్నాయి.
వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అంత నష్టాలను కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశం నిరంతర వృద్ధి పెరుగుదలపై అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment