Reliance AGM
-
'ఆశ, ఆందోళన కాలంలో ఉన్నాము': ముకేశ్ అంబానీ
గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి మోదీ నిదర్శనమని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి గెలిచినా దూరదృష్టి గల ప్రధాని మోదీని హృదయపూర్వకంగా అభినందిద్దాం అని అన్నారు.నేటి ప్రపంచం ఆశ & ఆందోళన రెండింటినీ తెస్తుందిప్రస్తుత గ్లోబల్ డైనమిక్స్‌ను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. మనం అపారమైన ఆశ, ఆందోళన రెండింటి కాలంలో జీవిస్తున్నామని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో.. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్, రోబోటిక్స్, లైఫ్ సైన్సెస్ వంటివి భవిష్యత్తును రూపొందిస్తున్నాయి.వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అంత నష్టాలను కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశం నిరంతర వృద్ధి పెరుగుదలపై అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. -
29న రిలయన్స్ ఏజీఎం.. అంచనాలన్నీ వీటిపైనే!
భారతీయ పారిశ్రామికవేత్త, అత్యంత సంపన్నుడు అయిన 'ముకేశ్ అంబానీ' ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏట కూడా 'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.ఆగష్టు 29న జరగనున్న 47వ వార్షిక సర్వసభ్య సమావేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంబానీ తీసుకునే నిర్ణయాలు ఏకంగా 35 లక్షల మందిని ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే లాభాల బాటలో దూసుకెళ్తున్న రిలయన్స్ కంపెనీ ఆగష్టు 29 తరువాత మరింత వృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2017లో కేవలం 1500 రూపాయలకే రీఫండబుల్ డిపాజిట్‌తో జియో ఫోన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 2018లో 2999 రూపాయలకు జియో ఫోన్2, 2019లో సౌదీ ఆరామ్కో పెట్టుబడులతో పాటు జియో ఫైబర్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2020లో గూగుల్ కంపెనీలో పెట్టుబడి, 2021లో రూ. 75000 కోట్ల పెట్టుబడితో కొత్త ఎనర్జీ బ్లూప్రింట్, 2022లో 5జీ కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయింపు.. ఇలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఏడాది జరగబోయే సమావేశంలో.. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంతే కాకుండా వారసత్వ ప్రణాళికలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్న వ్యాపారాలలో ఎవరికి ఏది అప్పగిస్తారో.. గురువారం జరిగే సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.రిలయన్స్ కంపెనీ ఆయిల్ అండ్ కెమికల్, న్యూఎనర్జీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ సిద్ధమవుతోంది. కాబట్టి జరగబోయే సమావేశంలో గిగా ఫ్యాక్టరీలు, ఎనర్జీ స్టోరేజీలు, ఎలక్ట్రోలైసర్లు, ప్యూయల్ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్‌స్క్రైబర్ బేస్‌లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్2కెమికల్ విభాగానికి డిమాండ్ పెరిగిందన్నారు. -
‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్.. పనితీరు, ధర ఎంతంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న వైర్లెస్ ఇంట్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభించనుంది. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించేలా పోర్ట్‌బుల్ వైర్లెస్ ఇంట్నెట్ 1.5 జీబీపీఎస్ వేగంతో పనిచేస్తుంది. తద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలు వీక్షించడం, ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకోవచ్చని రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. సెప్టెంబర్ 19 వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానున్న ఈ జియో ఎయిర్‌ఫైబర్‌ను తల్లిదండ్రులు నియంత్రించొచ్చు. వైఫై 6కి సపోర్ట్ చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏమిటి జియో ఎయిర్‌ఫైబర్ అనేది జియో నుండి వచ్చిన కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీని ఉపయోగిస్తుంది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్లతో పోలిస్తే దీని స్పీడ్ ఎక్కువ. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం చాలా సులభమని జియో పేర్కొంది. దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో వైఫై హాట్ స్పాట్, 5జీతో అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. జియో ఎయిర్‌ఫైబర్‌తో ఇల్లు లేదా ఆఫీస్‌లో గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్కు త్వరగా కనెక్ట్ చేయడం సులభం’ అని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. జియో ఎయిర్‌ఫైబర్ వర్సెస్ జియో ఫైబర్ టెక్నాలజీ: జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఉపయోగిస్తుంది. అయితే జియో ఎయిర్‌ఫైబర్ మాత్రం పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్లెస్ ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. తద్వారా ఫైబర్ కేబుల్స్ వల్ల తలెత్తే ఇబ్బందుల గట్టెక్కొచ్చు. స్పీడ్: జియో ఎయిర్‌ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది జియో ఫైబర్ 1జీబీపీఎస్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే, జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ స్థానికంగా ఉండే టవర్ల ఆధారంగా మారుతుందని గమనించాలి. కవరేజ్: జియో ఫైబర్, విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. జియో ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ టెక్నాలజీ సాయంతో విస్తృతమైన కవరేజీని అందింస్తుంది. ఇన్స్టాలేషన్: జియో ఎయిర్‌ఫైబర్ ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించబడింది.యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్‌కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ అవసరం. ధర: జియో ఎయిర్‌ఫైబర్ ధర దాదాపు రూ. 6,000. జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే ఖరీదైంది. ఎందుకంటే ఇందులో పోర్టబుల్ డివైజ్ ఉంటుంది. చదవండి👉🏻 గూగుల్‌కు బిగ్ షాక్ -
తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!
Isha Ambani at Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారం, పెట్టుబడులు.. ఇలా అన్ని అంశాల్లోనూ దూసుకెళ్తోంది. ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ నాయకత్వంలో రిటైల్ బిజినెస్ పరుగులు పెడుతోంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ ప్రగతిని ఇషా అంబానీ వివరించారు. రిలయన్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 42 శాతం పెరిగింది. సంస్థ రిజిస్టర్డ్ కస్టమర్ బేస్ 249 మిలియన్లకు చేరుకుంది. 3,300 కొత్త స్టోర్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 65.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 18,040 స్టోర్లకు రిటైల్ విస్తరణ చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వివరించారు. ల్యాండ్‌మార్క్ ఇయర్ కంపెనీ డిజిటల్ కామర్స్, ఇతర కొత్త వ్యాపారాలు దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయాన్ని అందించాయి. అంటే మొత్తం రెవెన్యూలో ఇది ఐదో వంతు. "మేము గత రెండు సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.82 వేల కోట్లు)కుపైగా పెట్టుబడి పెట్టాం. సమ్మిళిత వృద్ధి, అంతర్గత బ్రాండ్లను పెంచుకోవడం, సప్లయి చైన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడుతున్నాం" అని ఇషా అంబానీ చెప్పారు. రిటైల్ వ్యాపారానికి 2023 ఆర్థిక సంవత్సరాన్ని ఒక మైలురాయి సంవత్సరంగా ఆమె అభివర్ణించారు. ఇదీ చదవండి: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. “మేము గత సంవత్సరం 3,300 కొత్త స్టోర్లను ప్రారంభించాం. మొత్తం స్టోర్లు 18,040లకు చేరుకున్నాయి. 6.56 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కవర్ చేశాం. ఈ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి" అని ఇషా అంబానీ పేర్కొన్నారు. తమ బ్యాకెండ్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులలో కూడా కంపెనీ పెట్టుబడి పెడుతోంది. రిలయన్స్ రిటైల్ బలమైన వృద్ధి భారతదేశంలో ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. కంపెనీ తన ఫిజికల్ స్టోర్ నెట్‌వర్క్‌ను టైర్ 2, టైర్3 మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది. భారతదేశంలోని 30 శాతానికి పైగా జనాభాకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఇషా అంబానీ చెప్పారు. ఇవన్నీ రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్-10 రిటైలర్లలో ఒకటిగా నిలిపాయని వివరించారు. నాలుగు ‘సీ’ల సూత్రంపైనే.. రిటైల్ వ్యాపారం కొలాబరేషన్, కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్, క్రియేటివిటీ, కేర్ అనే 4 సీ(C)ల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను 90 శాతానికి పైగా తీర్చేలా ఉత్పత్తులను అందిస్తోంది. కిరాణా వ్యాపారంలో ఈ సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల కిరాణా సామగ్రిని విక్రయించాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లో సంవత్సరంలో దాదాపు 5 లక్షల ల్యాప్‌టాప్‌లు, 23 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించాం. ఇక ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ వ్యాపారంలో ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 కోట్ల వస్త్రాలను విక్రయించినట్లు ఇషా అంబానీ చెప్పారు. కంపెనీ ఇటీవల యువత లక్ష్యంగా ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఇది యువతకు సరసమైన ధరలలో ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం.. అయినా తగ్గేదేలే.. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
Reliance AGM 2021 : రిలయన్స్ మీటింగ్‌లో స్పెషల్ ఇదే
ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నడు ముఖేష్ అంబానీ ఆస్తులకు వారసుడిని వాటాదారులకు రిలయన్స్ డైరెక్టర్ నీతా అంబానీ పరిచయం చేశారు. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపార గ్రూపు రిలయన్స్ ఇండస్ట్రీస్, జూన్ 24న జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో గ్రీన్ ఎనర్జీ, చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్, 5జీ టెక్నాలజీ వంటి ఎన్నో కొత్త అప్డేట్స్ ప్రకటించారు. అయితే వీటితో పాటు మరో అంశం వాటాదారులను ఎక్కువ ఆసక్తికి గురి చేసింది. అదే అంబానీ ఇంట సంతోషాలు పూయిస్తున్న పృధ్వీ ఆకాశ్ అంబానీ పరిచయం. ముఖేష్ మనవడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, శ్లోక దంపతులకు డిసెంబరు 10న కొడుకు జన్మించాడు. చాలా కాలం పాటు ఆ బాబుని జూనియర్ అంబానీగానే నెటిజన్లు పిలుచుకున్నారు. ఆ తర్వాత డిసెంబరు 23న ఆ బాబుకి పృధ్వీ ఆకాశ్ అంబానీ అని పేరు పెట్టారు. అయితే ఇదంతా కుటుంబ వ్యవహరాలకే పరిమితమైంది. పృధ్వీ ఆకాశ్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి వార్షిక సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లోనే వాటాదారులకు తమ వారసుడి గురించి నీతా తెలిపారు. చదవండి : Reliance AGM 2021: ‘భారత్ నుంచి గ్రీన్ఎనర్జీని ఎగుమతి చేసుకోనే రోజులు -
Reliance AGM 2021: ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీదే... భవిష్యత్ భారత్‌దే
ముంబై: గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులకు రిలయన్స్ శ్రీకారం చుట్టింది. ఒక్క రిలయన్స్ సంస్థ నుంచే ఏకంగా 450 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటూ సంచలన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. మొబైల్ నెట్‌వర్క్‌లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో.. రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తీసుకువస్తామంటూ ఆయన ప్రకటించారు. జూన్ 24న వర్చువల్‌గా జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రీన్ ఎనర్జీపై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రూ. 75,000 కోట్ల పెట్టుబడి గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏకంగా రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. 2035 నాటికి కర్బణ ఉద్ఘారాలను జీరో స్థాయికి తీసుకు రావడం లక్ష్యంగా తమ ప్రణాళిక ఉందని వెల్లడించారు. దీని కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ధీరుభాయ్ అంబానీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ తెస్తున్నట్టు వివరించారు. ఇందులో సోలార్ ప్యానెల్స్, అడ్వాన్స్డ్ స్టోరేజీ బ్యాటరీల తయారీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, హ్రైడోజన్ వినియోగాలకు సంబంధించి నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామన్నారు. వీటి కోసం ఏకంగా రూ. 60,000 కోట్లు వెచ్చించబోతున్నట్టు ఆయన తెలిపారు. దీంతో పాటు ఫ్యూచర్ టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం మరో రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. మూడేళ్ల వ్యవధిలోనే ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తాయన్నారు. ఎండ్ టూ ఎండ్ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీలకు సంబంధించి ఎండ్ టూ ఎండ్ సర్వీసులను రిలయన్స్ అందివ్వబోతుందని ముఖేష్ ప్రకటించారు. అతి తక్కువ ధరకే సోలార్ మాడ్యుల్స్ తయారు చేయడంతో పాటు విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక బ్యాటరీలు కూడా తయారు చేస్తామన్నారు. తమ గ్రీన్ ఉత్పత్తులు ఇండస్ట్రీయల్ స్కేల్లో ఉండటంతో పాటు గృహఅవసరాలు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే విధంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. 450 గిగావాట్లు రిలయన్స్ ద్వారా స్వంతంగా 450 గిగా వాట్ల గ్రీన్ విద్యుత్‌ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖేష్ తెలిపారు. ఇందులో 100 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి చేరుకుంటామంటూ అంబాని నమ్మకంగా తెలిపారు. ప్రస్తుతం ఇండియా పెట్రోలును దిగుమతి చేసుకుంటుందని, రాబోయే రోజుల్లో ఇండియా నుంచి గ్రీన్ ఎనర్జీ విదేశాలు ఎగుమతి అవుతుందని ఆయన అన్నారు. చదవండి: Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా ఆరాంకో చైర్మన్..! -
Reliance AGM 2021: రిలయన్స్ జియో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?
ముంబై: రిలయన్స్ తన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో 5జీ గురించి ప్రకటించింది. టెక్ దిగ్గజం గూగుల్ సహకారంతో తన కొత్త ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను అభివృద్ది చేసినట్లు తెలిపింది. జియో 5జీ కోసం రిలయన్స్ గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు ప్రకటించింది. జియో 5జీ గూగుల్ సంస్థ క్లౌడ్ స్టోరేజ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొనున్నట్లు ఈ సమావేశంలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ సహకారంతో 10 ఎండబ్ల్యూ సామర్ధ్యం గల జియో-అజ్యూరే క్లౌడ్ డేటా సెంటర్లు నిర్మించినట్లు కూడా ఉదహరించింది. అంబానీ నేతృత్వంలోని సంస్థ జియో 5జి టెక్నాలజీని పరీక్షించినట్లు తెలిపింది. టెస్టింగ్ సమయంలో 1జీబీపీఎస్ వేగాన్ని తకినట్లు పేర్కొంది. దేశంలోనే పూర్తి స్థాయి 5జీ సేవలను ప్రారంభించిన మొదటి నెట్ వర్క్ రిలయన్స్ జియోనే సంస్థ ప్రకటించింది. 5జీ పరికరాల అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం, రిటైల్ రంగాలలో పెనుమార్పులు సంభవిస్తాయని వివరించింది. రిలయన్స్ ఫౌండేషన్ పాఠశాలల్లోని విద్యార్థులకు జియో 5జీ సహాయంతో ఎఆర్/విఆర్ కంటెంట్‌ను అందించనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. జియో ఫైబర్ డేటా వినియోగం ఒక సంవత్సరం క్రితం తో పోలిస్తే 3.5 రెట్లు పెరిగింది. జియో ఫైబర్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయని అంబానీ అన్నారు. చదవండి: ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో -
Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా ఆరాంకో చైర్మన్..!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ ఏజీఎం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో భారీ ప్రకటనలు ఉంటాయని వ్యాపార నిపుణులు చెప్పినట్లుగానే జరిగింది. సమావేశం మొదలుకాగానే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రిలయన్స్ సిబ్బంది, షేర్ హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులను నిమిషంపాటు మౌనం పాటించారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ గత ఎజీఎం సమావేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార పనితీరులో, అంచనాలను మించిపోయాయి. కంపెనీ వ్యాపార పనితీరు కంటే కోవిడ్ సమయంలో రిలయన్స్ కంపెనీ సేవ కార్యక్రమాలు నాకు ఎక్కువ ఆనందాన్ని కల్గించిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ కంపెనీ ప్రపంచంలో ఏ కంపెనీ చేయలేని విధంగా సుమారు 44.4 బిలియన్ డాలర్ల మూలధనాన్ని సేకరించిందని తెలిపారు. సౌదీ అరాంకో ఛైర్మన్, పిఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ స్వతంత్ర డైరెక్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరనున్నట్లు అంబానీ ప్రకటించారు. ఆరాంకో చైర్మన్ రాక రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయీకరణకు నాంది అని ముఖేష్ తెలిపారు. ఆరాంకో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో వూహత్మాక భాగస్వామిగా కొనసాగనుంది. సంవత్సర ప్రారంభంలో తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులతో కంపెనీ ఆయిల్ టూ కెమికల్స్( O2C) వ్యాపారం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని అంబానీ చెప్పారు. ఐనా రిలయన్స్ నిలకడగా ఉందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. చదవండి: Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..! -
ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా బయటికి ప్రకటించలేదు. చాలా మంది మార్కెట్ నిపుణులు ఈ మొబైల్ రూ.5,000 లోపు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్ -
Reliance AGM: రేపే సమావేశం..భారీ ఒప్పందాలు..ఆఫర్లు..!
ముంబై: ప్రతి సంవత్సరం జరిగే రిలయన్స్ కంపెనీ వార్షిక వాటాదారుల మీటింగ్(AGM) జూన్ 24 గురువారం రోజున ముంబైలో జరగనుంది. రిలయన్స్ ఏర్పాటు చేసే ఏజీఎం మీటింగ్‌పైనే అందరీ దృష్టి. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ భారీ ప్రకటనలు చేస్తోందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. గూగుల్-జియో సంయుక్తంగా అతి తక్కువ ధరకే 5జీ మొబైల్ ఫోన్‌ను ఈ సమావేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ కంపెనీ గత సంవత్సరం రిలయన్స్ జియోలో సుమారు రూ. 33, వేల 737 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తాజాగా 44వ ఏజీఎం మీటింగ్‌లో అతి తక్కువ ధరకే జియో బుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏజీఎం మీటింగ్‌లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. సౌదీకు చెందిన ఆరాంకో కంపెనీతో సుమారు 15 బిలియన్ డాలర్లతో భారీ ఒప్పందం జరగుతుందని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆరాంకో కంపెనీ చైర్మన్ యాసిర్ అల్ రుమయ్యన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ 44వ ఏజీఎం సమావేశం జూన్ 24 మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ సమావేశంలో రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ పలు అంశాలపై మాట్లాడతారు. అంతేకాకుండా జియో 5జీ, జియో బుక్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని జియో మీట్, యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రత్యక్షప్రసారం కానుంది. చదవండి: ప్రాథమిక హక్కులుగా కనెక్టివిటీ, కమ్యూనికేషన్ -
Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..!
ముంబై: ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ ఏర్పాటుచేసే వార్షిక వాటాదారుల మీటింగ్(AGM)పైనే అందరీ దృష్టి. ఈ సమావేశం ఈ నెల 24 న జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ కంపెనీ భారీ ప్రకటనలను చేయనున్నట్లు తెలుస్తోంది. 4జీ రాకతో రిలయన్స్ దేశ వ్యాప్తంగా విప్లవత్మాకమైన మార్పులు తీసుకొని వచ్చింది. మారుమూల గ్రామాలకు సైతం 4జీ టెక్నాలజీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమావేశంలో రిలయన్స్ అతి తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఏజీఎం మీటింగ్‌లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల భావిస్తున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల(రూ.లక్ష కోట్లు)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సౌదీకు చెందిన అరాంకో కంపెనీతో భారీ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 24న జరిగే రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ఆరాంకో చైర్మన్, కింగ్డమ్ ఆఫ్ వెల్త్ ఫండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ ఈ సమావేశంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే.. -
జియో.. 5జీ గూగులీ!
ముంబై: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన టెలికం సేవల సంస్థ జియో భారీ ప్రణాళికలకు తెరతీసింది. కొత్త తరం 5జీ సేవలకు సంబంధించిన సొల్యూషన్స్‌ను సొంతంగా దేశీయంగా అభివృద్ధి చేసింది. వీటిని వచ్చే ఏడాదే అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అలాగే భారత అవసరాలకు అనుగుణంగా ఆండ్రాయిడ్ ఆధారిత చౌక 5జీ స్మార్ట్ఫోన్లను దేశీ సాంకేతికతతో రూపొందించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం టెక్ దిగ్గజం గూగుల్‌తో జట్టు కట్టింది. అదే సమయంలో డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ దాదాపు రూ. 34 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే మేడిన్ ఇండియా 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించవచ్చని, మరుసటి ఏడాది క్షేత్రస్థాయిలో ఉపయోగంలోకి తేవచ్చని అంబానీ తెలిపారు. ‘5జీ సొల్యూషన్‌ను ప్రారంభ స్థాయి నుంచి పూర్తిగా జియోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసిందని చెప్పేందుకు గర్వంగా ఉంది. పూర్తిగా 100 శాతం దేశీ సాంకేతికత, సొల్యూషన్స్‌ను ఉపయోగించి ప్రపంచ స్థాయి 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని పేర్కొన్నారు. ‘ఆండ్రాయిడ్ ద్వారా అందరికీ కంప్యూటింగ్ సామర్థ్యాలను అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఇది సరైన సమయం. జియోతో భాగస్వామ్యం ఆ దిశగా తొలి అడుగు‘ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. రిలయన్స్ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన ఏజీఎంలో జియోమీట్ ప్లాట్‌ఫాం ద్వారా 48 దేశాల్లోని 550 నగరాల నుంచి ఏకంగా 3.2 లక్షల మంది షేర్హోల్డర్లు పాల్గొన్నారు. 2జీ విముక్త భారత్.. 5జీ సేవల ముంగిట్లో ఉన్న భారత్‌ను పూర్తిగా 2జీ నుంచి విముక్తం చేయాలన్న లక్ష్యం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం 2జీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్న దాదాపు 35 కోట్ల మంది భారతీయులను చౌక స్మార్ట్ఫోన్ల వైపు మళ్లేలా చేయాల్సి ఉందని అంబానీ తెలిపారు. ‘చాలా మంది ఫీచర్ ఫోన్ యూజర్లు కాస్త చౌకగా ఉండే స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. ఈ సవాలును ఎదుర్కొనాలని నిర్ణయించుకున్నాం. మనం ఎంట్రీ లెవెల్ 4జీ .. అంతకు మించి ఆఖరుకు 5జీ స్మార్ట్ఫోన్లయినా సరే ప్రస్తుతమున్న ధరకన్నా అత్యంత చౌకగా డిజైన్ చేయగలమన్న నమ్మకం ఉంది‘ అని అంబానీ తెలిపారు. అయితే, ఇందుకోసం భారత్ అవసరాలకు అనుగుణంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అవసరమన్నారు. టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇది సుసాధ్యం కాగలదని చెప్పారు. భారత్ స్థాయిలో 5జీ సొల్యూషన్స్ ఉపయోగం నిరూపితమైన తర్వాత వీటిని అంతర్జాతీయంగా ఇతర టెల్కోలకు కూడా వీటిని ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్చ్.. సౌదీ ఆరామ్కో కుదరలేదు.. చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో సంస్థకు వాటాలు విక్రయించాలన్న ప్రతిపాదన అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదని అంబానీ చెప్పారు. కరోనా వైరస్ సంబంధ పరిణామాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. సౌదీ ఆరామ్కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న అంబానీ.. డీల్ ప్రస్తుత స్థితి గురించి వెల్లడించలేదు. సౌదీ ఆరామ్కో సంస్థకు ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సుమారు 15 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రిలయన్స్ గతేడాది ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ2సీ వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా విడదీస్తున్నట్లు, 2021 తొలినాళ్లలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంబానీ చెప్పారు. ఆన్లైన్ ఏజీఎం రికార్డు వర్చువల్ విధానంలో నిర్వహించిన రిలయన్స్ ఏజీఎంలో రికార్డు స్థాయిలో షేర్హోల్డర్లు పాల్గొన్నారు. 48 దేశాల్లోని 550 నగరాల నుంచి దాదాపు 3.2 లక్షల మంది ఇందులో పాల్గొన్నట్లు కంపెనీ వెబ్సైట్ వెల్లడించింది. ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద వర్చువల్ ఏజీఎంగా అంచనా. రిలయన్స్‌కి 26 లక్షల పైచిలుకు షేర్హోల్డర్లు ఉన్నారు. 2035 నాటికి జీరో కార్బన్ ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న ఇంధనాల స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్, హైడ్రోజన్ మొదలైన వాటిని అందుబాటులోకి తెస్తామని అంబానీ చెప్పారు. టెక్నాలజీ సాయంతో కర్బన ఉద్గారాలను ఉపయోగకర ఉత్పత్తులు, రసాయనాల కింద మార్చడంపై దృష్టి పెడతామన్నారు. తద్వారా 2035 నాటికి కార్బన్–జీరో సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. జియో గ్లాస్.. ఆన్లైన్ విప్లవం మిక్సిడ్ రియాలిటీ సర్వీసులు అందించే జియో గ్లాస్‌ను రిలయన్స్ జియో ఆవిష్కరించింది. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. 25 ఇన్‌బిల్ట్ యాప్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్‌తో కాల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో జరిగే సమావేశాల్లో ఇంటి వద్ద నుంచే పాల్గొనడం, ఉపాధ్యాయులు 3డీ వర్చువల్ రూమ్స్ ద్వారా హోలోగ్రామ్ తరగతులను నిర్వహించడం తదితర అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ ఎం థామస్ తెలిపారు. దీని ధర ఎంత ఉంటుందన్నదీ వెల్లడించకపోయినప్పటికీ, మార్కెట్లో ఈ తరహా గ్లాస్‌ల రేటు సుమారు రూ. 37,000–40,000 స్థాయిలో ఉంటోంది. జియో మీట్ 50 లక్షల డౌన్లోడ్స్.. దేశీయంగా తొలి క్లౌడ్ ఆధారిత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియోమీట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే 50 లక్షల డౌన్లోడ్స్ నమోదయ్యాయని అంబానీ తెలిపారు. మరో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌కు పోటీగా జియో దీన్ని ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో ఇది పనిచేస్తుంది. జూమ్లాగా 40 నిమిషాల కాలపరిమితి లాంటివి ఇందులో ఉండవని, 24 గంటలూ కాల్స్ కొనసాగించవచ్చని జియో పేర్కొంది. గూగుల్ 33,373 కోట్లు ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా జియోలో టెక్ దిగ్గజం గూగుల్ 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. దీని ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు రూ. 4.36 లక్షల కోట్లుగా ఉంటుంది. గత వారమే సుమారు రూ. 4.91 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో జియోలో చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ ఇన్వెస్ట్ చేసింది. తాజాగా జియోలో ఇన్వెస్ట్ చేసిన దిగ్గజాల్లో గూగుల్ 13వది. కేవలం 12 వారాల వ్యవధిలో వాటాల విక్రయం ద్వారా జియో సుమారు రూ. 1,52,055 కోట్లు సమీకరిం చినట్లయింది. 32.94 శాతం వాటాలు విక్రయించింది. గూగుల్‌కి వాటాల అమ్మకంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి తొలి దశ పెట్టుబడుల సమీకరణ పూర్తయినట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. రుణరహిత కంపెనీ.. గడిచిన మూడు నెలల్లో రిలయన్స్ మొత్తం మీద రూ. 2,12,809 కోట్లు సమీకరించినట్లు అంబానీ తెలిపారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులతో పాటు రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు, ఇంధన రిటైల్ వెంచర్లో బ్రిటన్ దిగ్గజం బీపీ చేసిన రూ. 7,629 కోట్ల పెట్టుబడులు కూడా వీటిలో ఉన్నాయి. ‘2021 మార్చి కన్నా ముందుగానే రిలయన్స్ ప్రస్తుతం నికరంగా రుణ రహిత కంపెనీగా మారింది. జియో, రిటైల్, చమురు–రసాయనాల (ఓ2సీ) వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా పటిష్టంగా మారింది‘ అని అంబానీ తెలిపారు. ఆయా ఒప్పందాలకు సంబంధించిన నిధులు దఖలు పడిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరంగా రుణ రహిత సంస్థగా మారనుంది. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తంలో 75 శాతం నిధులు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. ఏప్రిల్ 22న ఫేస్బుక్ రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ (9.99 శాతం వాటా) చేయడం ద్వారా మొదలైన పెట్టుబడుల పరంపర ఆ తర్వాత వేగం పుంజుకుంది. ఆరు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, చిప్ తయారీ సంస్థలు ఇంటెల్ కార్పొరేషన్ .. క్వాల్కామ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. షేరు... రేసు గుర్రమే! గత ఏజీఎమ్ (12–8–2019) నాటి ధర రూ.1,151 ఏడాది కనిష్ట ధర (23–3–2020) రూ.867 బుధవారం ఆల్‌టైమ్ గరిష్ట ధర (15–7–2020–ఇంట్రాడే) రూ.1,978 జియోలో 7.7 శాతం వాటా కొనుగోలు... జియో ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టరుగా గూగుల్‌ను సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య, పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనితో తొలి దశ పెట్టుబడుల సమీకరణ లక్ష్యం పూర్తయ్యింది. కోట్లాది మంది భారతీయులకు ఉపయోగకరమైన సమాచారాన్ని గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. జియో తరహాలోనే కొంగొత్త మార్పులు, నవకల్పనలను ఆవిష్కరిస్తోంది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్ డిజిటలీకరణలో జియో ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించగలిగితే మిగతా అందరు యూజర్లకు కూడా అనువైన ఉత్పత్తులను రూపొందించవచ్చన్న మా అభి ప్రాయానికి ఊతమిస్తోంది. జియోతో భాగస్వామ్యం ద్వారా కోట్ల మంది భారతీయులకు స్మార్ట్‌ఫోన్‌ను మరింత అందుబాటులోకి తేగలదని ఆశిస్తున్నాం. – సుందర్ పిచాయ్, సీఈవో, గూగుల్ -
జియో నుంచి ఎంట్రిలెవల్ 4జీ, 5జీ స్మార్ట్ఫోన్లు
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ముకేశ్ మాట్లాడుతూ ‘‘జియో 4జీ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిబద్దతను కలిగి ఉంది. ఈరోజు వరకు 10 కోట్ల జియోఫోన్లను విక్రయించాము. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో ఎంట్రీ లెవల్ 4జీ, 5జీ ఫోన్లను తయారీ చేయగలమని నమ్ముతున్నాం’’ అని తెలిపారు. ఇప్పటికీ 35కోట్ల మంది 2జీ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తారని, వారి దృష్టిలో ఉంచుకొని చౌకధరల్లో స్మార్ట్‌ఫోన్ తయారీకి సిద్ధమైనట్లు ముకేశ్ ఈ సందర్భంగా తెలిపారు. జియో, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో తయారీ అయ్యే 4జీ, 5జీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్.... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్‌ను ఆప్టిమైజ్ చేసుకోనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీ అంశంపై గూగుల్ స్పందిస్తూ ...‘‘ 50కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి రూపొందించిన టెక్నాలజీ, నెట్వర్క్ ప్రణాళికల్లో మార్పులను చూడటం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఇప్పటికీ చాలామందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. చాలా తక్కువమంది స్మార్ట్‌ఫోన్ వినియోదిస్తున్నారు. ఇకపై టెక్నాలజీలతో పాటు డివైజ్‌లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది’’ అని తెలిపింది. -
జియో ఫైబర్ సంచలనం: బంపర్ ఆఫర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత, సీంఎడీ ముకేశ్ అంబానీ మరోసారి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా జియో గిగా ఫైబర్ సేవలకు సంబంధించి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఆఫర్లను ప్రకటించడం విశేషం. టెలికాం రంగంలో జియో మాదిరిగాగానే అతి తక్కువ ధరకే ఫైబర్ సేవలను భారతీయ వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. ముఖ్యంగా రానున్న 18 నెలలో అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ అవతరించనుందని ముకేశ్ ప్రకటించడం విశేషం. జియో 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తెస్తామని అంబానీ వెల్లడించారు. 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ పీఎస్ వరకు డేటా ఉచితం. అలాగే వెల్ కం ప్లాన్ కింద కస్టమర్లకు 4కే ఎల్డీ టీవీ, 4జీ హెచ్డీ సెట్‌టాప్‌బాక్స్ పూర్తిగా ఉచితం అందిస్తామన్నారు. తద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉచిత ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటి నుంచి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించనుంది. రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రాతిపదికన కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జియో.కాం ద్వారా సెప్టెంబరు 5నుంచి అదుబాటులో వుంటాయని తెలిపారు. అలాగే రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందని పేర్కొన్న అంబానీ, బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని స్పష్టం చేశారు. జియో ఫైబర్‌నెట్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా, కుమారుడు, ఆకాశ్ జియో ఫైబర్ సంచలన వివరాలను అందిస్తూ వేదికపై సందడి చేశారు. ముఖ్యంగా జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు. ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చో ప్రదర్శించారు. ప్రపంచంలో ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవచ్చని తెలిపారు. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే మనకు సరిపడే దుస్తుల షాపింగ్ చేయవచ్చని తెలిపారు. అంతేకాదు ఇంట్లో థియేటర్ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా చూపించారు. జియో సీఈవో కిరణ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. -
ఇండియా, రిలయన్స్ రైజింగ్.. ఎవ్వరూ ఆపలేరు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్ అధినేత, సీఎండీ ముకేశ్ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్‌కు తరలి వచ్చింది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తల్లి, భార్య నీతూ అంబానీ, కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీతోపాటు కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు. అధినేత ముకేశ్ అంబానీ వాటాదారులనుద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో అత్యున్నత విలువగల కంపెనీగా రిలయన్స్ తన సత్తా చాటుదోందని, భారత ఆర్థిక వ్యవస్థలో కీలక భూమికను పోషిస్తోందని తెలిపారు. రిలయన్స్ వృద్ధి, అలాగే భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం ఉన్నంత ప్రకాశవంతంగా ఇంతకుముందెన్నడూ కనిపించలేదని అంబానీ పేర్కొన్నారు. ఇండియా వృద్ధిని, రిలయన్స్ ఎదుగుదలను ఆపడం ఎవ్వరి తరమూ కాదని ఆయన వెల్లడించారు. న్యూ ఇండియా, న్యూ రిలయన్స్ అనే నినాదాన్నిచ్చారు. ఈ సందర్భంగా రిలయన్స్, బీపీ ఒప్పందాన్ని ప్రస్తావించారు. రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుంది బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని ముఖేశ్ స్పష్టం చేశారు. జియో ఫైబర్‌నెట్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం. రిలయన్స్ భవిష్యత్తు ప్రణాళికలపై అంబానీ చేయనున్న ప్రకటనలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంబానీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు : 2030 నాటికి భారత ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. రిలయన్స్ పెట్రోలియంతో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ‘బీపీ ఆయిల్ ఇండస్ట్రీ’ చేతులు కలపబోతోంది. సౌదీ కంపెనీ ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు . భారతీయులు డిజిటల్‌పై ఏటా రూ.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానిలో భాగంగా జియో రూ.3.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. జియో మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది. వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం. జియో వినియోగదారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ ఘనతను సాధించాం. ప్రతి నెల కోటి మంది వినియోగదారులు కొత్తగా జియోలో చేరుతున్నారు. రూ. 700 - రూ. 10వేల మధ్య జియో గిగా ఫైబర్ తారిఫ్స్ - ముకేశ్ అంబానీ రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుంది బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని ముకేశ్ స్పష్టం చేశారు. జియో ఫైబర్‌నెట్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకు జమ్ము కశ్మీర్, లదాఖ్‌ను అభివృద్ధికి కృషి చేస్తాం. దీనికి సంబంధించి తమ ప్రణాళికను రానున్న రోజుల్లో ప్రకటిస్తాం. ఆరామ్కో మెగా డీల్ : రిలయన్స్ చమురు, కెమికల్ బిజినెస్‌లో 20 శాతం విదేశీ పెట్టుబడులను పెట్టబోతున్నట్లు అంబానీ ప్రకటించారు. మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సౌదీ అరామ్కో ద్వారా రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌తో జత: భారతీయుల డేటా ప్రైవసీ కోసం బ్లాక్‌చైన్ వ్యవస్థను తీసుకొస్తున్నాం. జియో డేటా సెంటర్ల కోసం మైక్రోసాఫ్ట్‌తో జతకడుతున్నామని అంబానీ వివరించారు. ‘అజుర్ ప్లాట్‌ఫాం’ను మైక్రోసాఫ్ట్ అందజేయనున్నాము. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వీడియో బైట్ ప్లే చేశారు. అంతేకాదు దేశీయంగా స్టార్టప్స్‌కు జియో పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు 2020, జనవరిలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు ఈషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సరికొత్త ఎంఆర్ (మిక్స్డ్ రియాలిటీ) హెడ్ సెట్స్ ఓ స్టార్టప్ డెలవప్ చేసింది. ఇందులో జియో పెట్టుబడి పెట్టిందని , ఇది త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందంటూ చెప్పుకొచ్చారు. గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే మనకు సరిపడే దుస్తుల షాపింగ్ చేయవచ్చని తెలిపారు. అంతేకాదు ఇంట్లో థియేటర్ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా చూపించారు. జియో గిగా పైబర్ ఫీచర్లు మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చు. ప్రపంచంలో ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవచ్చు. వార్షిక ప్లాన్ ఎంచుకున్న వారికి 4కే ఎల్ఈడీ టీవీ, 4జీ సెట్‌టాప్‌బాక్స్ ఉచితం. సెప్టెంబరు 5న ఫైబర్ సేవలులాంచ్, జియో.కాం ద్వారా పూర్తి వివరాలు సెస్టెంబరు 5 నుంచి. -
రిలయన్స్ ఏజీఎం : బంపర్ ఆఫర్లు?!
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఈ రోజు (సోమవారం) నిర్వహించనుంది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాన్ని రిలయన్స్ తన యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్ ఖాతాలలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా ఎప్పటినుంచో కస్టమర్లు ఎదురు చూస్తున్న రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ జియోగిగా ఫైబర్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయనుంది. గత ఏడాది ఏజీఎంలో కంపెనీ అధికారికంగా తన జియోగిగా ఫైబర్ సేవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, రిలయన్స్ జియోఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. తాజా అంచనాల ప్రకారం బంపర్ ఆఫర్లతో జియో గిగా ఫైబర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జియో గిగా ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో లభిస్తోంది. నెలకు రూ.600రుసుముపై ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, టీవీ ప్రసార సేవలతో రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. 50ఎంబీపీఎస్ వేగంతో,100 జీబీ కాంప్లిమెంటరీ డేటాతో ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. దీనితోపాటు రూ.1000 ప్లాన్లను తీసుకురానుందని అంచనా. దీని ద్వారా ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు, ఉచిత ల్యాండ్‌లైన్ లభించనుంది. ఈ ల్యాండ్‌లైన్ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్ పొందవచ్చు. అంతే కాదు 4కే హెచ్ డీ సర్వీసుతో పాటు, జియో గిగా టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సేవలు లభించనున్నాయి. చదవండి : మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో -
ఇంకెన్ని సంచలనాలో: జియో యూజర్లు బీ రెడీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక సాధారణ సమావేశానికి(ఏజీఎం) సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. సూపర్ స్పీడులో అత్యధిక డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం వంటి ఆఫర్లతో ఇప్పటికే టెలికాం మార్కెట్‌ను కుదిపేసిన రిలయన్స్, ఈ మీటింగ్‌లో చేయబోయే ప్రకటనలపై మార్కెట్లో సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఈ సమావేశంలోనే అత్యంత చౌకైన 4జీ ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేయబోతుందని టాక్. జియో ఫీచర్ ఫోన్‌పై ఇప్పటికే పలు ఆసక్తికర రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఫోన్ 500 రూపాయలకే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌తో మొబైల్ సెక్టార్లో కూడా ముఖేష్ అంబానీ సంచలనాలు సృష్టించబోతున్నారని రిపోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు జియో ఫీచర్ ఫోన్‌ను తయారుచేసేందుకు ఈ కంపెనీకి, ఇంటెక్స్కు మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మానుఫ్రాక్చరింగ్ చర్చలు తుది దశలో ఉన్నాయని ఇంటెక్స్ స్పష్టంచేసింది. ఫీచర్ ఫోన్‌తో పాటు బ్రాడ్ బ్యాండు నెట్వర్క్ జియోఫైబర్‌ను కూడా రిలయన్స్ ఆవిష్కరించబోతుందని టాక్. ఈ ప్రకటన కూడా బ్రాడ్ బ్యాండు ఇండస్ట్రీని షేక్ చేయనుందని తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే కంపెనీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, జమ్మునగర్, సూరత్, వడోదరా వంటి ప్రాంతాల్లో జియోఫైబర్ ప్రీవ్యూ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్న ఈ సేవలపై జీరో రూపాయలకు 3 నెలల పాటు ప్రతినెలా 100ఎంబీపీఎస్ స్పీడులో 100జీబీ డేటాను జియో తన కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి తొలుత 4500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా తర్వాత రీఫండ్ చేయనున్నామని కంపెనీ అంతకముందే క్లారిటీ ఇచ్చేసింది. బ్రాడ్‌బ్యాండు సర్వీసు ధరలు కూడా 500 రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసింది. 500 రూపాయలకు 600జీబీ డేటా, 2000 రూపాయలకు 1000జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడులో జియో ఆఫర్ చేయనుంది. -
మార్కెట్‌కు ఇరాక్ దెబ్బ
275 పాయింట్లు పతనం 25,246 వద్దకు సెన్సెక్స్ గరిష్టం 25,609- కనిష్టం 25,114 ఒక దశలో 400 పాయింట్లు డౌన్ అన్ని రంగాలకూ నష్టాలే ఇరాక్ అంతర్యుద్ధం శృతిమించడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ముందురోజుకి పూర్తి విరుద్ధమైన రీతిలో మిడ్ సెషన్నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి. ఉదయం సెషన్లో 25,609 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో కనిష్టంగా 25,114ను చవిచూసింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 500 పాయింట్ల పతనం! క్రితం ముగింపునుంచి చూస్తే 400 పాయింట్ల నష్టం! ఆపై కొంతమేర కోలుకున్నప్పటికీ చివరికి 275 పాయింట్ల నష్టంతో 25,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే విధంగా కదిలి ట్రేడింగ్ ముగిసేసరికి 74 పాయింట్లు పోగొట్టుకుంది. 7,558 వద్ద నిలిచింది. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, ఆయిల్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ 2-1% మధ్య తిరోగమించాయి. ఇరాక్‌లో యుద్ధ భయాలు ముదరడంతో ఆయిల్ ధరలు మరోసారి పెకైగశాయి. ఇరాక్ బైజీలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీను మిలటెంట్లు ఆక్రమించినట్లు వార్తలు వెలువడటంతో ఒక్కసారిగా సెంటిమెంట్ దిగజారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లకు చేరగా, నెమైక్స్ చమురు 107 డాలర్లకు చేరువైంది. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కూడా 0.6% బలహీనపడి 60.40కు పతనమైంది. ఇది కూడా అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఆరు షేర్లు మాత్రమే సెన్సెక్స్‌లో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా... సిప్లా, హిందాల్కో, గెయిల్ 3-1.5% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు భెల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, హీరోమోటో, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య తిరోగమించాయి. ఇక బీఎస్ఈ-500 సూచీలో ఆమ్టెక్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జీలెర్న్, బీజీఆర్ ఎనర్జీ, ఇండియా సిమెంట్స్, ఎరా ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, జేఎం ఫైనాన్షియల్, హెచ్‌పీసీఎల్, అలహాబాద్ బ్యాంక్, బజాజ్ హిందుస్తాన్ 7.5-4.5% మధ్య పతనమయ్యాయి. మొత్తం ట్రేడైన షేర్లలో 1,631 నష్టపోగా, 1,400 బలపడ్డాయి.