ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నడు ముఖేష్ అంబానీ ఆస్తులకు వారసుడిని వాటాదారులకు రిలయన్స్ డైరెక్టర్ నీతా అంబానీ పరిచయం చేశారు. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపార గ్రూపు రిలయన్స్ ఇండస్ట్రీస్, జూన్ 24న జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో గ్రీన్ ఎనర్జీ, చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్, 5జీ టెక్నాలజీ వంటి ఎన్నో కొత్త అప్‌డేట్స్ ప్రకటించారు. అయితే వీటితో పాటు మరో అంశం వాటాదారులను ఎక్కువ ఆసక్తికి గురి చేసింది. అదే అంబానీ ఇంట సంతోషాలు పూయిస్తున్న పృధ్వీ ఆకాశ్ అంబానీ పరిచయం.
ముఖేష్ మనవడు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, శ్లోక దంపతులకు డిసెంబరు 10న కొడుకు జన్మించాడు. చాలా కాలం పాటు ఆ బాబుని జూనియర్ అంబానీగానే నెటిజన్లు పిలుచుకున్నారు. ఆ తర్వాత డిసెంబరు 23న ఆ బాబుకి పృధ్వీ ఆకాశ్ అంబానీ అని పేరు పెట్టారు. అయితే ఇదంతా కుటుంబ వ్యవహరాలకే పరిమితమైంది. పృధ్వీ ఆకాశ్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి వార్షిక సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లోనే వాటాదారులకు తమ వారసుడి గురించి నీతా తెలిపారు.
చదవండి : Reliance AGM 2021: ‘భారత్ నుంచి గ్రీన్‌ఎనర్జీని ఎగుమతి చేసుకోనే రోజులు
Comments
Please login to add a commentAdd a comment