
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్‌నగర్‌లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.
కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.
వంతారా
అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment