Vantara
-
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్‌లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్‌లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్‌లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్‌లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్‌లను బ్రెజిల్‌లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్‌లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్‌కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్‌లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్‌లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్‌లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్‌కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్‌లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్‌లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్‌లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
వంతారాకు కొత్త అతిథులు
ఇస్కాన్ మాయాపూర్‌కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్‌తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరువంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.