జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు | Ril Agm CMD mukesh Ambani  announced jio Fiber srvs | Sakshi
Sakshi News home page

జియో ఫైబర్‌ సంచలనం : బంపర్‌ ఆఫర్లు

Published Mon, Aug 12 2019 1:03 PM | Last Updated on Wed, Sep 4 2019 5:01 PM

Ril Agm CMD mukesh Ambani  announced jio Fiber srvs - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో  రిలయన్స్‌  అధినేత, సీంఎడీ ముకేశ్‌ అంబానీ మరోసారి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా జియో గిగా ఫైబర్‌ సేవలకు సంబంధించి అందరూ ఊహించిన దానికంటే  ఎక్కువగా ఆఫర్లను ప్రకటించడం విశేషం. టెలికాం రంగంలో జియో మాదిరిగాగానే అతి తక్కువ ధరకే ఫైబర్‌ సేవలను భారతీయ వినియోగదారులకు  అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు.  ముఖ్యంగా రానున్న 18 నెలలో అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్‌ అవతరించనుందని ముకేశ్‌ ప్రకటించడం  విశేషం.

జియో 3వ  వార్షికోత్సవం సందర్భంగా  ఈ ఏడాది  సెప్టెంబర్‌ 5 నుంచి  దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని అంబానీ వెల్లడించారు. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ పీఎస్‌ వరకు డేటా ఉచితం.  అలాగే వెల్‌ కం ప్లాన్‌ కింద కస్టమర్లకు 4కే ఎల్‌డీ టీవీ, 4జీ హెచ్‌డీ సెట్‌టాప్‌బాక్స్‌ పూర్తిగా ఉచితం అందిస్తామన్నారు. తద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉచిత ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.  జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు   ల్యాండ్‌ లైన్‌ ద్వారా ఇంటి నుంచి అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్  అందించనుంది.

రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే  ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో  ప్రాతిపదికన కొత్త సినిమాలు  చూసే అవకాశం కల్పిస్తామన్నారు. దీనికి సంబంధించి  పూర్తి వివరాలు జియో.కాం ద్వారా సెప్టెంబరు 5నుంచి అదుబాటులో వుంటాయని తెలిపారు. అలాగే  రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందని పేర్కొన్న అంబానీ, బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని  స్పష్టం చేశారు.  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈశా, కుమారుడు, ఆకాశ్‌ జియో ఫైబర్‌  సంచలన వివరాలను అందిస్తూ వేదికపై  సందడి చేశారు. ముఖ్యంగా జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు. ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్‌ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చో  ప్రదర్శించారు.  ప్రపంచంలో ఏమూలనున్నవారితోనైనా వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకోవచ్చని తెలిపారు. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో షాపింగ్‌ అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే  మనకు సరిపడే దుస్తుల షాపింగ్  చేయవచ్చని తెలిపారు.  అంతేకాదు ఇంట్లో థియేటర్‌ అనుభవాన్ని ఎలా పొందవచ్చో కూడా  చూపించారు. జియో  సీఈవో కిరణ్‌ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement