ఫైల్ ఫోటో
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఈ రోజు (సోమవారం) నిర్వహించనుంది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాన్ని రిలయన్స్ తన యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాలలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా ఎప్పటినుంచో కస్టమర్లు ఎదురు చూస్తున్న రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ జియోగిగా ఫైబర్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయనుంది. గత ఏడాది ఏజీఎంలో కంపెనీ అధికారికంగా తన జియోగిగా ఫైబర్ సేవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, రిలయన్స్ జియోఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. తాజా అంచనాల ప్రకారం బంపర్ ఆఫర్లతో జియో గిగా ఫైబర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జియో గిగా ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో లభిస్తోంది.
నెలకు రూ.600రుసుముపై ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, టీవీ ప్రసార సేవలతో రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. 50ఎంబీపీఎస్ వేగంతో,100 జీబీ కాంప్లిమెంటరీ డేటాతో ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. దీనితోపాటు రూ.1000 ప్లాన్‌లను తీసుకురానుందని అంచనా. దీని ద్వారా ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు, ఉచిత ల్యాండ్‌లైన్ లభించనుంది. ఈ ల్యాండ్‌లైన్ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్ పొందవచ్చు. అంతే కాదు 4కే హెచ్ డీ సర్వీసుతో పాటు, జియో గిగా టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సేవలు లభించనున్నాయి.
చదవండి : మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో
Comments
Please login to add a commentAdd a comment