ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఎప్పటికప్పుడు తన వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన జియో సేవలను పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అధికారులు ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీలంక టెలికాం పిఎల్‌సిలో వాటాను రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.
శ్రీలంక టెలికాం పీఎల్‌సీలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న మొదటి మూడు కంపెనీలలో అంబానీ జియో ప్లాట్‌ఫామ్ కూడా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవలే పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పీఎల్‌సీ మార్కెట్ విలువ రూ.4000 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.
శ్రీలంక టెలికాం పీఎల్‌సీ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీల జాబితాలో జియో మాత్రమే కాకుండా.. గోర్ట్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, పెట్టిగో కమర్సియో ఇంటర్నేషనల్ ఎల్‌డిఎ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ ఎవరి హస్తగతం అవుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.
ఇండియాలో జియో ప్లాట్‌ఫారమ్
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించిన జియో 2023 అక్టోబర్ నాటికి 31.59 లక్షల వినియోగదారులను కలిగి ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలిసింది. ఈ సంఖ్య దాని ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ కంటే కూడా ఎక్కువని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: భయాన్ని ఎదుర్కోండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
గత వారం గాంధీనగర్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పెట్టుబడి ప్రకటనల తర్వాత రిలయన్స్ అండ్ జియో షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలను పొందాయి. షేర్లలో పెరుగుదల ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని తిరిగి పొందేందుకు దారితీసింది. దీంతో మళ్ళీ భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా ముకేశ్ అంబానీ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment