2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని లోక్‌సభలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు.. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే తక్కువని తెలుస్తోంది. మార్చి 31 నాటికి వొడాఫోన్ ఐడియా రూ.2.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.1.25 లక్షల కోట్లు, జియో రూ.52,740 కోట్ల రుణాలుగా తీసుకున్నట్లు సమాచారం.
బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు రూ. 40,400 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీతో సంస్థ లోన్ రూ. 28,092 కోట్లకు తగ్గిందని పెమ్మసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. రూ.89,000 కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment