వ్యాపార రంగంలో ఫార్చూన్ (Fortune) అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరుగా నిలిచారు. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త ఆయనొక్కరే కావడం విశేషం. శక్తిమంతుల జాబితాలో ఆయన 12వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ లిస్ట్‌లో ఆరుగురు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారు 40 పరిశ్రమల నుండి ఉన్నారు. వీరిలో 30 నుండి 90 ఏళ్ల వరకు పలు వయసులవారు ఉన్నారు. ఇందులో వ్యవస్థాపకులు, ప్రముఖ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆవిష్కర్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఇక ఇందులో స్థానం పొందిన ఐదుగురు భారతీయ సంతతి సీఈవోలలో నలుగురు టెక్ దిగ్గజాల సీఈవోలు కాగా, ఒకరు మేకప్ బ్రాండ్‌ను నడుపుతున్నారు.
ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల ఫార్చూన్ జాబితాలో జాబితాలో 3వ స్థానంలో ఉండగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈసారి టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక అడోబ్ సీఈవో శంతను నారాయణ్ 52వ స్థానంలో, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 69వ స్థానంలో ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 74వ ర్యాంక్, మేకప్ బ్రాండ్ ఐస్ లిప్స్ ఫేస్ (ELF) సీఈవో తరంగ్ అమిన్ 94వ ర్యాంక్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment