most powerful
-
వంద మందిలో ఒకే ఒక్కడు.. ముఖేష్ అంబానీ
వ్యాపార రంగంలో ఫార్చూన్ (Fortune) అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరుగా నిలిచారు. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త ఆయనొక్కరే కావడం విశేషం. శక్తిమంతుల జాబితాలో ఆయన 12వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ లిస్ట్‌లో ఆరుగురు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారు 40 పరిశ్రమల నుండి ఉన్నారు. వీరిలో 30 నుండి 90 ఏళ్ల వరకు పలు వయసులవారు ఉన్నారు. ఇందులో వ్యవస్థాపకులు, ప్రముఖ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆవిష్కర్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఇక ఇందులో స్థానం పొందిన ఐదుగురు భారతీయ సంతతి సీఈవోలలో నలుగురు టెక్ దిగ్గజాల సీఈవోలు కాగా, ఒకరు మేకప్ బ్రాండ్‌ను నడుపుతున్నారు.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటభారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల ఫార్చూన్ జాబితాలో జాబితాలో 3వ స్థానంలో ఉండగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈసారి టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక అడోబ్ సీఈవో శంతను నారాయణ్ 52వ స్థానంలో, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 69వ స్థానంలో ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 74వ ర్యాంక్, మేకప్ బ్రాండ్ ఐస్ లిప్స్ ఫేస్ (ELF) సీఈవో తరంగ్ అమిన్ 94వ ర్యాంక్ దక్కించుకున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారు..!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ కారును ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ లాంచ్ చేయనుంది. ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్‌యూవీకు చెందిన టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. లాంచ్ ఎప్పుడంటే..! ఆస్టన్ మార్టిన్ 2022 DBX ఎస్యూవీ కారును రేపు (ఫిబ్రవరి 1)న రిలీజ్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ ఎస్‌యూవీగా నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు లంబోర్ఘిని ఉరస్ కారుకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త తరం డీబీఎక్స్ ఎస్యూవీ పలు మార్పులతో రానున్నట్లు కంపెనీ పేర్కొంది. సరికొత్తగా ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్..! ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ను భారీ మార్పులతో, మరింత ఆకర్షణీయంగా రానుంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త సెట్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ రీపోజిషన్ చేయబడ్డాయి. కొత్త వీల్ డిజైన్స్‌తో సరికొత్త కలర్ కాంబినేషన్‌తో రానుంది. ఇంజన్ విషయానికి వస్తే..! న్యూ ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ ఎస్యూవీ అభివృద్ధి చేసిన కొత్త టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 650 hp శక్తిని ఉత్పత్తి చేయనుంది. మునపటి మోడల్ కంటే 100 hp అధిక శక్తిని విడుదల చేయనుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోనుంది. గరిష్టంగా 290 kmph వేగంతో ప్రయాణించనుంది. Change is coming. Power talks. The world’s most powerful luxury SUV. 01.02.22#AstonMartin#NewSeatOfPower — Aston Martin (@astonmartin) January 18, 2022 చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..! -
‘పవర్’ఫుల్ పాస్‌పోర్టు...
పాస్‌పోర్టులలో పవర్ ఉండటమేంటి అనుకుంటున్నారా..! ప్రపంచంలోని ఏ దేశ పాస్‌పోర్టు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందనే విషయంపై లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ కన్సల్టింగ్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. జర్మనీ పౌరుల పాస్‌పోర్టు ప్రపంచలోనే అత్యంత శక్తిమంతమైనదని అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో జర్మనీ వరుసగా మూడోసారి టాప్‌లో నిలిచింది. అంటే ఈ దేశ పాస్‌పోర్టు ఉన్న పౌరులు చాలా దేశాల్లో వీసా లేకున్నా తిరిగిరావచ్చు. ఆ తర్వాత స్థానంలో వరుసగా యూరోపియన్ దేశాలు, అమెరికా, జపాన్, కెనడా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో చివరి స్థానంలో అఫ్గానిస్తాన్ పౌరుల పాస్‌పోర్టు ఉంది. ఈ జాబితాలో గత 11 ఏళ్లుగా అఫ్గానిస్తాన్ చివరి స్థానంలో ఉండటం విశేషం. అంటే ఈ దేశం పాస్‌పోర్టు వేరే దేశంలో అంతగా ఉపయోగపడదట. అంతేకాదు ఆ పాస్‌పోర్టు ఉన్న పౌరులను వేరే దేశంలోని అధికారులు అంతగా పట్టించుకోరట. గౌరవ మర్యాదలు, వసతుల కల్పన వంటివి కూడా కాస్త తక్కువగానే ఉంటాయట.