‘పవర్’ఫుల్ పాస్‌పోర్టు... | German passport most powerful in world, Afghan least: Report | Sakshi
Sakshi News home page

‘పవర్’ఫుల్ పాస్‌పోర్టు...

Published Sun, Feb 28 2016 2:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

‘పవర్’ఫుల్ పాస్‌పోర్టు...

‘పవర్’ఫుల్ పాస్‌పోర్టు...

పాస్‌పోర్టులలో పవర్ ఉండటమేంటి అనుకుంటున్నారా..! ప్రపంచంలోని ఏ దేశ పాస్‌పోర్టు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందనే విషయంపై లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ కన్సల్టింగ్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. జర్మనీ పౌరుల పాస్‌పోర్టు ప్రపంచలోనే అత్యంత శక్తిమంతమైనదని అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో జర్మనీ వరుసగా మూడోసారి టాప్‌లో నిలిచింది. అంటే ఈ దేశ పాస్‌పోర్టు ఉన్న పౌరులు చాలా దేశాల్లో వీసా లేకున్నా తిరిగిరావచ్చు.

ఆ తర్వాత స్థానంలో వరుసగా యూరోపియన్ దేశాలు, అమెరికా, జపాన్, కెనడా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో చివరి స్థానంలో అఫ్గానిస్తాన్ పౌరుల పాస్‌పోర్టు ఉంది. ఈ జాబితాలో గత 11 ఏళ్లుగా అఫ్గానిస్తాన్ చివరి స్థానంలో ఉండటం విశేషం. అంటే ఈ దేశం పాస్‌పోర్టు వేరే దేశంలో అంతగా ఉపయోగపడదట. అంతేకాదు ఆ పాస్‌పోర్టు ఉన్న పౌరులను వేరే దేశంలోని అధికారులు అంతగా పట్టించుకోరట. గౌరవ మర్యాదలు, వసతుల కల్పన వంటివి కూడా కాస్త తక్కువగానే ఉంటాయట.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement