మొబైల్ ఆక్వా ల్యాబ్ సేవల్ని వినియోగించుకోవాలి
మొబైల్ ఆక్వా ల్యాబ్ సేవల్ని వినియోగించుకోవాలి
Published Wed, Nov 30 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
‘సిఫ్ట్’ ఎఫ్‌డీఓ డాక్టర్ విజయభారతి
నేడు కాట్రేనికోన మండలంలో పరీక్షలు
కాట్రేనికోన : మత్స్య పరిశ్రమ అ«భివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ ఆక్వా సేవలను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఎఫ్‌డీఓ డాక్టర్ టి. విజయభారతి సూచించారు. ఆక్వా చెరువుల వద్దే మొబైల్ ఆక్వా ల్యాబ్‌లో నామమాత్రపు రుసుంతో మట్టి, నీటి నాణ్యత, బాక్టీరియా పరీక్షలు చేసి నివేదికలను రైతులకు అందిస్తామన్నారు. విజయభారతి బృందం గురువారం కాట్రేనికోన మండల కేంద్రంలో నడవపల్లి, కందికుప్ప, కాట్రేనికోన తదితర గ్రామాలలో మొబైల్ ఆక్వా సేవలు అందిస్తారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులు చెరువు నీటిని మొబైల్ లాబ్‌కు తీసుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
Advertisement