Aqua
-
మీకు తెలిసిన సలహాలుంటే చెప్పండి
సాక్షి, అమరావతి: ఆక్వా రంగం బలోపేతానికి, సంపద సృష్టికి మీకు తెలిసిన సలహాలుంటే చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వారైతులు, నిపుణులను కోరారు. మత్స్యశాఖ సౌజన్యంతో గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 పేరిట నిర్వహించిన మూడురోజుల వర్కుషాపు ముగింపు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆక్వా రంగంలో 30 శాతం జీవీఏ సాధించడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం త్వరలో డ్రాఫ్ట్ విడుదల చేస్తామని తెలిపారు. ఆక్వారంగం ద్వారా సుస్థిరాభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని కోరారు. ఆక్వారైతులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోతూ తమ ప్రభుత్వంపై రూ.10వేల కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. చేద్దామంటే అప్పు కూడా పుట్టడంలేదన్నారు. కేంద్రం కూడా అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ సహకారంతో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు. అనధికారిక ఆక్వా చెరువులను క్రమబద్ధీకరించే విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. -
ఆక్వాలో ఏపీనే టాప్
ఆక్వా రంగానికి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏపీ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో రికార్డులు తిరగరాస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో విస్తీర్ణం, దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో మూడొంతులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళ్తున్నాయి. ఆక్వా రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో రికార్డులు తిరగరాస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విస్తీర్ణం, దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో మూడొంతులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళ్తున్నాయి. 2014–19 మధ్యలో జాతీయస్థాయిలో రూ.1.93 లక్షల కోట్ల విలువైన 59 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆ సమయంలో ఏపీ నుంచి ఏటా సగటున రూ.13 వేల కోట్ల విలువైన 2.28 లక్షల టన్నులు ఎగుమతి జరిగింది. అంటే అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో రూ.65,312 కోట్ల విలువైన సుమారు 11 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగుమతులు రికార్డు స్థాయికి పెరిగాయి. 2019–24 మధ్య జాతీయ స్థాయిలో రూ.2.72 లక్షల కోట్ల విలువైన 73 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవగా.., అదే సమయంలో ఏపీ నుంచి కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదురొడ్డి మరీ ఏటా సగటున రూ.18 వేల కోట్ల విలువైన 3.15 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయి. ఆ ఐదేళ్లలో సుమారు రూ.90,234 కోట్ల విలువైన 15.74 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2014 నుంచి 2019 మధ్య బాబు ప్రభుత్వ హయాంలో పెరిగిన ఎగుమతుల విలువ రూ.1,154 కోట్లు కాగా.., వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఏకంగా రూ.4,524 కోట్ల మేర ఎగుమతులు పెరిగాయి. అంటే మత్స్య ఎగుమతులు దాదాపు మూడింతలు పెరిగాయి. ఏపీ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్)కే జరిగాయి.12.74 శాతం చైనాకు, 4.54 శాతం యూరోపియన్ దేశాలకు, 3.51 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 2.92 శాతం సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు జరిగాయని ఎంపెడా ప్రకటించింది. ఫ్రోజెన్ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20 శాతం ఏపీ నుంచే జరగడం గమనార్హం. అందనంత ఎత్తులో ‘ఏపీ’మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరే రాష్ట్రానికి అందనంత ఎత్తులో ఉంది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక్క ఏపీ వాటానే 36 శాతం. రెండో స్థానంలో ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల వాటా 13 శాతం. 10 శాతంతో గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఎగుమతుల విలువ చూస్తే 24 శాతంతో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ది 18 శాతం. కేరళ వాటా 14 శాతం. జాతీయ స్థాయిలో జరిగిన ఎగుమతుల్లో 29.7 శాతం ఉత్పత్తులు విశాఖపట్నం నుంచే జరిగాయి. 2014–19 మధ్య ఏపీ నుంచి జాతీయ స్థాయిలో రూ.53 వేల కోట్ల మత్స్య ఉత్పత్తులు ఎగుమతవగా, 2019–24 మధ్య ఏకంగా రూ.76 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంవైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా), ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి చెరువుల్లో, 54 వేల హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్ విస్తీర్ణం ఉండగా, 1.75 లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39 లక్షల నుంచి 51 లక్షల టన్నులకు పెరగ్గా, రొయ్యల దిగుబడులు 4.54 లక్షల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరిగాయి. -
ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్
-
అక్వేరియం ఏమైనట్టు!.. రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన
సాక్షి, హైదరాబాద్: అక్వా మెరైన్ పార్కు..హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టన్నెల్ అక్వేరియం ప్రాజెక్టు ఇది. కొత్వాల్‌గూడ ఎకో పార్కులో అత్యాధునిక హంగులతో అక్వేరియం నిర్మాణానికి హెచ్ఎండీఏ అప్పట్లో ప్రణాళికలను రూపొందించింది. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. కానీ ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచలేదు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిరి్మంచాలని భావించారు. రెండుసార్లు టెండర్లు కూడా ఆహా్వనించారు. కానీ నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ప్రస్తుతం ఎకోపార్కు తుది దశకు చేరుకుంది. కానీ టన్నెల్ అక్వేరియం ఏర్పాటు మాత్రం పెండింగ్ జాబితాలో పడిపోయింది. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల హెచ్ఎండీఏ చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను, పార్కులను పరిశీలించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన టన్నెల్ అక్వేరియంపైన ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్లనున్నదనేది చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.150 కోట్లతో ప్రతిపాదించిన అక్వేరియం ప్రతిపాదన ఉన్నట్లా? లేనట్టా అనే అంశంపైనా సందిగ్ధం నెలకొంది. నగర పర్యాటకానికి మణిహారం.... హిమాయత్‌సాగర్‌కు చేరువలో హెచ్ఎండీఏ 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకోపార్కు నిర్మాణం చేపట్టింది. నగరవాసులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఒక అందమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే విధంగా పార్కును విస్తరించారు. ఈ పార్కులోనే సుమారు 4.27 ఎకరాల్లో టన్నెల్ అక్వేరియం ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్వేరియంలపైన అధికారులు అధ్యయనం కూడా చేశారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని అక్వా మెరైన్ పార్కుల కంటే మరిన్ని ఆధునిక హంగులతో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కానీ పీపీపీ పద్ధతిలో ప్రతిపాదించిన ఈ భారీ అక్వేరియం నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదు. గత సంవత్సరం రెండుసార్లు టెండర్లు పిలిచారు. స్పందన రాకపోవడంతో కొంతమంది ఆసక్తి కలిగిన డెవలపర్లతో ప్రీ బిడ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ వారి నుంచీ పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పెండింగ్ జాబితాలో పడిపోయింది. దీనిపై మరోసారి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన అధికారులు ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును పూర్తిగా పెట్టేయడమా లేక, మరోసారి ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి విధి విధానాల్లో మార్పులు చేయడమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రంగు రంగుల చేపలతో... ⇒ కొత్వాల్‌గూడ ఎకో పార్కు ఏర్పాటు కోసం, చెన్నై వీజీటీ మెరైన్‌పార్కు, అహ్మదాబాద్ సైన్స్‌సిటీ ప్రాజెక్టులపైన అధికారులు అధ్యయనం చేశారు. ఆ తరువాత దేశంలోనే అతి పెద్ద టన్నెల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ⇒ వేయి రకాల రంగు రంగుల చేపలు, మెరైన్ స్పీసెస్, బహుళ టన్నెల్స్‌తో ఈ మెగా అక్వా మెరైన్ పార్కును అందంగా తీర్చి దిద్దాలని భావించారు. షార్క్ చేపల నుంచి డాలి్ఫన్ల వరకు ఉంటాయి. ఇది సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చే విధంగా, అతి పెద్ద జలాశయం అడుగున పర్యటిస్తూ వీక్షిస్తున్న అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది. ⇒ అలాగే అక్వేరియంను దగ్గరి నుంచి వీక్షించేందుకు అనుగుణంగా ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ⇒ అతి పెద్ద డోమ్ థియేటర్, సెవెన్ డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, హెల్మెట్ అక్వేరియం వంటివి ఏర్పాటు చేసేందుకు సైతం అప్పట్లో ప్రణాళికలను రూపొందించారు. ⇒ పిల్లల కోసం కియోస్‌్కలను కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ⇒ కనీసం 2500 మంది ఒకేసారి సందర్శించేందుకు వీలుగా సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావించారు. అక్వేరియంలో ఏర్పాటు చేసే టన్నెల్ ట్యాంక్ మలుపు 180 డిగ్రీల కోణంలో ఉంటుంది. ⇒ కనీసం 100 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు వాక్ వేలతో టన్నెల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ⇒ మొత్తం అక్వేరియం సుమారు 3 వేల మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యానికి తగ్గకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
క్రాప్ హాలిడేకు సిద్ధమవ్వాలి
సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అవసరమైతే క్రాప్ హాలీడేకు రైతులు సిద్ధం కావాలని ఆక్వా రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అప్పుడే హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు దిగివస్తాయన్నారు. జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో ఆక్వా రైతు మహాసభ నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. ‘హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు లాభాపేక్షతో వ్యవహరిస్తూ ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. చాలా కంపెనీలు ఫీడ్, మందులు రెండింటినీ తయారు చేస్తున్నాయి. నాసిరకం ఫీడ్ వల్ల తెగుళ్లు వస్తున్నాయి. వాటిని తగ్గించే మందులను కూడా ఆ కంపెనీలే విక్రయిస్తున్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు సీడ్, ఫీడ్ నాణ్యతలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఎంపెడా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క రైతుకు సమస్య వ చ్చినా రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ పోరాడాలి. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీల వద్ద ఆందోళనలు చేపట్టాలి. పరిస్థితి మరింతగా దిగజారితే ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు క్రాప్ హాలీడేకు సిద్ధమవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలీడేను విజయవంతం చేసేందుకు అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకువద్దాం’ అని అన్నారు. గత ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం ఆక్వా రైతు సంఘం నాయకుడు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో రొయ్య ధరలు ఒడిదుడుకులకు గురికాకుండా ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు అప్సడా కృషి చేసింది. అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ రైతు సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారు. వీరవాసరంలో ఆక్వా చెరువులకు విద్యుత్ సమస్య ఉందని రైతులు చెప్పగా.. వెంటనే నిరంతర విద్యుత్‌ను అందించారు’ అని చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తామని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలపైనా సమావేశంలో చర్చించారు. వాటి అమలుకు మంత్రులను కలవాలని నిర్ణయించారు. ఆక్వా రైతు సంఘాల నాయకులు బోణం వెంకట నరసయ్య, యాళ్ల వెంకటానందం, గాదిరాజు సుబ్బరాజు, పి.నాగభూషణం, వీరవల్లి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలు, రాయితీలతో రాష్ట్రంలో ఆక్వా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో మత్స్య ఉత్పత్తులు పెరగడమే కాకుండా, ఈ రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఆక్వా రంగంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలుస్తోంది. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల దిగుబడి దేశ సగటు దిగుబడిని మించి ఉంది. దేశ సగటు దిగుబడి హెక్టార్‌కు 7.5 టన్నులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 8.8 టన్నులు ఉంది.ఒడిశా రాష్ట్రంలో ఇది 4.1 శాతమే ఉంది. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ లోతైన అధ్యయనం చేసి వెల్లడించిన వివరాలివి. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఆక్వా రంగంలో అవకాశాలు, సవాళ్లను మ్యాపింగ్ చేయడం, ఈ రంగంలో ఫుడ్ ప్రోసెసింగ్ అవకాశాలను, ఎంఎస్ఎంఈల పని తీరును మెరుగుపరచడం ద్వారా ఉద్యోగావకాశాల మెరుగుకు ఈ అధ్యయనం చేసినట్లు నివేదిక పేర్కొంది.భారత దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమబెంగాల్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలది ఆధిపత్యమని తెలిపింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 71,900 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తులు సాగవుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా 6,34,672 టన్నుల రొయ్యలు ఉత్పత్తవుతున్నట్లు వెల్లడించింది. ఒడిశాలో 10,600 హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తుల సాగు ఉండగా 43,677 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 91 శాతం ప్రాసెస్ చేయని చేప ఉత్పత్తులనే విక్రయిస్తున్నారని, ఆక్వా ఉత్పత్తులు ప్రోసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.ఆహార ప్రోసెసింగ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ మెరుగుపడుతుందని పేర్కొంది. ఎక్కువ పోషక విలువలు గల రొయ్యల ప్రోసెస్డ్ ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పింది. ఉత్పత్తి సమయంలో రసాయనాల వినియోగం తగ్గించడంతో పాటు ప్రోసెసింగ్ చేసిన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఎగుమతి చేసే ఆక్వా ఉత్తు్తలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 19,894 సంస్దలు ఉన్నాయని, 105 ఫ్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లు, 99 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయని, 74 మంది మాన్యఫ్యాక్చర్ ఎగుమతిదారులతో పాటు 69 మర్చంట్ వ్యాపారులు ఉన్నారని నివేదిక తెలిపింది. రొయ్యల ప్రాసెసర్ల శ్రామిక శక్తిలో 70–80 శాతం మంది మహిళలు ఉన్నట్లు అంచనా వేసింది.ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఆక్వా రంగంలో ఈ వృద్ధి సాధ్యమైందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020–25 ఆహార ప్రాసెసింగ్ విధానాన్ని ప్రకటించి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, అలాగే మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ మందికి స్థానికంగా ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టిందని వివరించింది. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ కేంద్రాలను అభివృద్ధి ద్వారా ఆక్వాకు పెద్ద ఎత్తున చేయూతనిస్తోందని తెలిపింది. ఆక్వాలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. -
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
వారందరివీ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు.. ఒక్క రోజు పనిలోకి వెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి.. వారికి తెలిసిన విద్య చేపల వేట మాత్రమే.. వివిధ కారణాల వల్ల స్థానికంగా చేపలు లభించని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి.. సముద్రంలోకి వేటకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువు.. వేట నిషేధం సమయంలో అయితే కటిక దరిద్రం తప్పదు.. ఇదంతా ఐదేళ్ల క్రితం.. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.. అన్ని విధాలా మత్స్యకారులకు అండగా నిలిచి భరోసా కల్పిస్తోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు..ఎగుమతులు మత్స్య ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74 లక్షల టన్నులు ఉంటే.. ఈ 5 ఏళ్లలో 7.47 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యల దిగుబడులు 10.04 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యల దిగుబడులు 7.06 లక్షల టన్నులకు చేరాయి. జాతీయ స్థాయిలో 77.55 శాతం ఏపీలోనే ఉత్పత్తి అవుతోంది. గ్రోత్ రేట్ జాతీయ స్థాయిలో 19.37శాతం ఉంటే, ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. 2018–19లో రూ. 16,825 కోట్ల విలువైన 3.13 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయితే, 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.29 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. చినలక్ష్మి సంతోషం ఈమె పేరు కారే చినలక్ష్మి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన ఈమె కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. వేట నిషేధ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2 వేలు మాత్రమే భృతిగా ఇచ్చేవారు. 2019లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. బోటులో ఆయిల్ నింపే ప్రతిసారీ సబ్సిడీ వస్తోంది. ఆమె కుమార్తెకు నాలుగేళ్లపాటు అమ్మఒడి అందింది. ఈ ఏడాది డిగ్రీలో చేరడంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు దరఖాస్తు చేసింది. చేయూత కింద రూ.18,750, ఆసరా కింద రూ.10 వేలు చినలక్ష్మికి జమ అవుతోంది. భర్తకు మత్స్యకార పింఛన్ మంజూరైంది. పొన్నాడ జగనన్న లేఅవుట్లో సెంటున్నర స్థలమూ ఇచ్చారు. అక్కడ సెంటు రూ. 2 లక్షలకు పైగా పలుకుతోంది. ఇంటి నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఇలా గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లబ్ధి పొందలేదని.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే తమకు మేలు జరిగిందని చినలక్ష్మి సంతోషంతో చెబుతోంది. కాకినాడ హార్బర్ ఓ ఉదాహరణ కాకినాడ ఫిషింగ్ హార్బర్లో 2018–19లో మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు 503 ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 578కు చేరింది. మెకనైజ్డ్ బోట్లు 398 నుంచి ఏకంగా 451కి పెరిగాయి. 2018–19 నాటికి వేటకు వెళ్లే వారి సంఖ్య 4,149 ఉంటే ప్రస్తుతం 4,763కు పెరిగింది. మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే వారి సంఖ్య 3,582 నుంచి 4,059 మందికి చేరింది. గతంలో బోట్లపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య 11,971 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 14,541 మందికి పెరిగింది. మత్స్య దిగుబడులు 2018–19లో రూ.677 కోట్ల విలువైన 22,592 టన్నులు వస్తే 2023–24లో రూ.890.12 కోట్ల విలువైన 25,153 టన్నులు వచ్చాయి. ఆక్వా రంగానికి జవసత్వాలు ఆక్వా రంగం నిలదొక్కుకోవడానికి సీఎం వైఎస్ జగన్ చొరవ, కృషి ఎంతగానో ఉపయోగపడింది. ధరలు పతనమైన సమయంలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రాసెసింగ్ సంస్థలు 3 సార్లు పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఉపసంహరించేలా చేయగలిగాం. ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధరకే రొయ్యల కొనుగోలు చేయించగలిగాం. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింప చేసాం. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంగపుత్రుల జాతకాలు మారిపోయాయి. గత ప్రభుత్వ కాలంలో వారు పడిన కష్టాలు తొలగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో వారింట అన్నీ మీన రాశులే. వ్యయాలన్నీ ఆదాయాలుగా మారాయి. అవమానాల స్థానంలో రాజపూజ్యాలు ఎదురయ్యాయి. ఆక్వా రైతుల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆటుపోట్లు ఎదుర్కొన్న మత్స్యకారులు, సంక్షోభంలో చిక్కుకున్న ఆక్వా రైతులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. (పంపాన వరప్రసాద రావు, సాక్షి ప్రతినిధి, అమరావతి)ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4913 కోట్ల లబ్ధి చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.17.50 కోట్ల పరిహారాన్ని ఈ ప్రభుత్వం అందజేసింది. చంద్రబాబు పాలనలో 300 మందికి అందిన సాయం కేవలం రూ.11.43 కోట్లు మాత్రమే. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది. వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.4913 కోట్ల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించింది. అప్సడా చట్టాలతో ఆక్వా రైతుకు రక్షణ ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020, ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020(అప్సడా)లను అమలులోకి తీసుకొచ్చింది. ఇవి నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. తీర ప్రాంత జిల్లాల్లో 35 ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తీర గ్రామాల్లోని ఆర్బీకేల్లో 732 ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆక్వా రైతులకు బీమా సౌకర్యం కలి్పంచింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. ఆక్వా రైతుకు రెట్టింపు ఆనందం ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. బాబు హయాంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పరిధి నోటిఫై చేయడంలో జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి రీ సర్వే చేయించింది. దీంతో 3,56,278 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 54072కు చేరింది. జోన్ పరిధిలోకి వచ్చిన 10 ఎకరాలలోపు సాగుదారులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించడంతో మెజార్టీ ఆక్వా రైతులకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలు రూ.340 కోట్లు సహా ఈ ఐదేళ్లలో రూ.3497 కోట్ల సబ్సిడీ అందుకున్నారు. దేశానికే ఆదర్శంగా ఫిష్ ఆంధ్ర స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్‌తో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో 40–60 శాతం సబ్సిడీతో జిల్లా స్థాయిలో ఆక్వా హబ్‌లు(రూ.కోటి), వాటికి అనుబంధంగా మినీ రిటైల్ అవుట్‌లెట్స్ (రూ.3లక్షలు), డెయి లీ (రూ.10లక్షలు), సూపర్(రూ. 20లక్షలు), లాంజ్ (రూ.50 లక్షలు) యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప టికే జిల్లా స్థాయిలో 2 ఆక్వా హబ్‌లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,630 మినీ, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్ వీలర్ యూనిట్లు మంజూరయ్యా యి. ప్రత్యక్షంగా 6941 మందికి, పరోక్షంగా 13,146 మందికి ఉపాధి లభిస్తోంది. నర్సాపురం వద్ద దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ నర్సాపురం సమీపంలో రూ.332 కోట్లతో 40 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మలీ్టపర్పస్ బిల్డింగ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. యూనివర్సిటీ కోసం 140 పోస్టులు మంజూరు చేశారు. కార్యకలాపాలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా బీఎఫ్ఎస్సీ కోర్సుతో 60 సీట్లతో కొత్తగా నర్సాపురం ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేశారు. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటవద్ద రూ.36.55 కోట్ల అంచనాతో 30 ఎకరాల్లో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూ ఎఫ్‌సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహించే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. సిబాతో పాటు మరికొన్ని కేంద్ర కార్యాలయాలను కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. -
ఏపీ ఆక్వా చట్టాలు దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆక్వారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, చట్టాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేంద్రం కితాబునిచ్చింది. రాష్ట్రంలో ఆక్వారంగం బలోపేతం కోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, నీతి ఆయోగ్ సీఈవో పీవీఆర్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ జాతీయ సలహాదారు నీలం పటేల్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు న్యూఢిల్లీ వెళ్లిన ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం శుక్రవారం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆక్వారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నారని, ఈ రంగంలో తెచ్చిన సంస్కరణలు నిజంగా ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్‌లో ఆక్వారంగం మరింత పుంజుకునేందుకు ఇవి ఎంతో దోహద పడతాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా సాగు గుర్తింపు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆన్లైన్ ద్వారా లైసెన్సుల జారీ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. జాతీయ స్థాయిలో ఆచరించతగ్గ కార్యక్రమాలని చెప్పారు. ఏపీ ఆక్వా కార్యక్రమాలను ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించినపుడు స్వయంగా చూశామన్నారు. 15 రోజులకోసారి సమీక్ష రాష్ట్రంలో ఆక్వా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం కేంద్రమంత్రికి, నీతి ఆయోగ్ సీఈవోకు వివరించారు. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నం.1 స్థానంలో ఉందన్నారు. ఈ రంగం బలోపేతం కోసం సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తున్నారని అన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన అప్సడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చారని, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం ఏపీ సీడ్, ఫీడ్ యాక్టులను తీసుకొచ్చారని చెప్పారు. ప్రతీ 15 రోజులకోసారి అప్సడా ఆధ్వర్యంలో రైతులు, ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇప్పటి వరకు రూ. 3,420 కోట్లు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించిందన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో మాట్లాడుతూ.. ఏపీలో జాతీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, తాము అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపితే ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
రొయ్య.. 100 కౌంట్ కిలో 240 రూ.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంద కౌంట్ రొయ్యలకు కిలో రూ. 240గా రేటు ఖరారు చేశామని, ఇంతకన్నా తక్కువకు కొనడానికి వీల్లేదని ఆక్వా సాధికారత కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే తక్కువకు కొనే వారిపై ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, అధికారులు పాల్గొన్నారు. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో ఫిష్ ఆంధ్రా అవుట్‌లెట్స్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు చెప్పారు. ఫలితంగా ప్రతి నెలా స్థానిక వినియోగం వెయ్యి టన్నులకు పెరిగిందన్నారు. దీనిని మరింత పెంచాలని చెప్పారు. అప్సడా ద్వారా 10 రోజులకోసారి రొయ్య రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణకు కృషి చేస్తున్నట్లు వడ్డి రఘురాం మంత్రులకు వివరించారు. రాష్ట్రంలో రొయ్య రైతులందరితో కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యకు ఇటీవలే తాడేపల్లిలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించామన్నారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ స్థానిక వినియోగాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి కొత్త కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ సీఎం వైఎస్ జగన్ నియమించిన సాధికారత కమిటీ కృషి ఫలితంగా ఇప్పటి వరకు 6 సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని మంత్రులు చెప్పారు. గతంలో ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయే వారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలో 4.65 లక్షల ఎకరాలు సాగవుతుండగా, దాంట్లో విద్యుత్ సబ్సిడీకి అర్హత పొందిన (10 ఎకరాల్లోపు ) విస్తీర్ణం 3.26 లక్షల ఎకరాలుగా గుర్తించామన్నారు. తొలుత ఈ–ఫిష్ సర్వే ద్వారా 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మరో 4,230 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా అర్హత పొందిన వారికి నవంబర్ 1 నుంచి సబ్సిడీ విద్యుత్ అందించాలని డిస్కంలను మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు, అడిషనల్ డైరెక్టర్ అంజలి తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా స్టార్టప్ కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: ఆక్వారంగంలో అంతర్జాతీయ అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఆక్వాఎక్సేఛంజ్ ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో కలిసి ఆక్వా ఎక్సేఛంజ్ కో–పౌండర్ బండి కిరణ్‌కుమార్, సీఈవో పవన్‌కృష్ణ కలిసి ఇటీవల బెంగళూరులో జరిగిన జీ–20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్ సమ్మిట్–2023లో సాధించిన గ్లోబల్ అవార్డును చూపించారు. అవార్డు సాధించిన ఆక్వా ఎక్సేఛంజ్ ప్రతినిధులను అభినందించిన సీఎం.. చిన్న, సన్నకారు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించేలా ఆలోచనలు చేయాలని సూచించారు. -
అదిరిందయ్యా.. పిల్ల రొయ్య!
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి సముద్ర జలాలు, గాలి రొయ్యల లార్వా ఉత్పత్తికి, రొయ్య పిల్ల పెరుగుదలకు అనువుగా ఉండటంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా వందలాది హేచరీలు (రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు) అభివృద్ధి సాధించాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతంలో 314 హేచరీలు ఉండగా.. ఏటా ఇక్కడ 60 బిలియన్ల రొయ్య పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, కేరళ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు రొయ్య పిల్లలు (ష్రింప్ సీడ్) ఎగుమతి అవుతున్నాయి. లక్ష మందికి ఉపాధి హేచరీలు, రొయ్యల చెరువులు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కేవలం లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో హేచరీలో వివిధ పనులకు గాను సుమారు 150 మంది వరకు ఉపాధి పొందుతుండగా.. రొయ్యల చెరువుల నిర్వహణలో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో ఒక్కో యూనిట్లో 500 నుంచి 1000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వరకు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు ఐస్ ఫ్యాక్టరీలు, రవాణా ప్యాకింగ్ యూనిట్లలో వేలాది మందికి ఉపాధి కలుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పురోగమనం రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి నాణ్యమైన మత్స్య సంపదను విక్రయించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. 10 ఎకరాలలోపు ఆక్వా చెరువులున్న రైతుల కు యూనిట్ కేవలం రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ అందిస్తోంది. 10 ఎకరాలకు పైబడి ఉన్న వారికి యూనిట్ విద్యుత్ రూ.3.85కే ఇస్తోంది. ఆక్వా ఎగుమతులు సక్రమంగా నిర్వహించడాని కి ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తోంది. ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ఆక్వా రైతులకు తగిన అండ లభిస్తోంది. దీంతో తీర ప్రాంతంలో రొయ్యల సాగు, హేచరీలు బాగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తులు గణనీయంగా పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహం దోహదం చేస్తోంది. – సత్యనారాయణ, జేడీ మత్స్య శాఖ, కాకినాడ హేచరీలకు ఎల్టీ కేటగిరీగా మార్చాలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 314 వరకు హేచరీలు ఉన్నాయి. ఏటా 60 బిలియన్ల రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల రొయ్యల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు తీవ్ర ఇబ్బంది కలిగించగా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంది. హేచరీలకు విద్యుత్ వినియోగం చాలా అవసరం. గతంలో ఎల్టీగా ఉండే వాటిని హెచ్‌టీ చేయడం వల్ల అదనపు భారం పడింది. హేచరీలు 8 నెలలు పని చేస్తే 4 నెలలు మూతపడి ఉంటాయి. పని చేసే సమయంలో విద్యుత్ భారంగా మారగా పని చేయని సమయంలోనూ మినిమం బిల్లులు వేయడం వల్ల ఆర్థిక భారం పడుతోంది. – సత్తి వీర్రెడ్డి, అధ్యక్షుడు, ఆలిండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ -
AP: 46,445 మంది రైతులకు ఆక్వా విద్యుత్ సబ్సిడీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా నిర్వహించిన ఈ ఫిష్ సర్వే వల్ల లక్షలాది మంది అర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తెలిపారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం 6వ ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాలలోపు సాగు చేస్తున్న ప్రతి ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఫిష్ సర్వే ద్వారా అర్హులైన ఆక్వా రైతులను గుర్తించడం జరిగిందని అన్నారు. సర్వే తరువాత రాష్ట్రంలో 46,445 మంది రైతులను అర్హులుగా నిర్ధారించడం జరిగిందని, దాదాపు 3,27,575 ఎకరాలకు, విద్యుత్ సబ్సిడీగా ఏటా రూ.672.61 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఫిష్ సర్వేకు ముందు ఆక్వాజోన్ పరిధిలో పది ఎకరాల లోపు ఆక్వా సాగు చేస్తున్న విస్తీర్ణం కేవలం 1.90 లక్షల ఎకరాలకు మాత్రమే సబ్సిడీ అందితే, సర్వే తరువాత 3.27 లక్షల ఎకరాలకు సబ్సిడీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ఎక్కువ మంది అర్హులైన చిన్న రైతులు ఆక్వాజోన్ పరిధిలో ఈ పరిమితుల్లోకి రావడం వల్ల వారికి మేలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలను తక్షణం పరిశీలించి, పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన సాధికారిత కమిటీ ఇప్పటి వరకు పలుసార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. చదవండి: ఏది నిజం?: ‘ఈనాడు’ దిగజారుడు రాతలు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను స్థిరీకరించడం, ఆక్వా ఉత్పత్తుల ధరలను పది రోజుల పాటు ఒకేలా కొనసాగేలా చర్యలు తీసుకోవడం, ఈ రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించడం ద్వారా రైతులు, ప్లాంట్ నిర్వాహకుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎక్కడికక్కడ రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆక్వాలో రేట్ల పెరుగుదల, ఆకస్మికంగా ధరల పతనం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు, స్థానికంగా ఆక్వా వినియోగం పెంచేందుకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు, సబ్సిడీలతో మొత్తం 4 వేల ఫిష్ ఆంధ్రా ఆక్వా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే 1549 యూనిట్లను ఏర్పాటు చేయడం పూర్తయ్యిందని, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 360 యూనిట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొత్తం 2500 యూనిట్లకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపారు. నిరుద్యోగ యువత ఉత్సాహంగా ఫిష్ ఆంధ్రా యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందకు వస్తున్నారని, అటు ఆక్వా రంగానికి, ఇటు యువత ఉపాధికి బాటలు వేస్తూ ఫిష్ ఆంధ్రా యూనిట్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక ఈ సందర్భంగా అప్సడా చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఆక్వా ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు, ఎగుమతి దారులకు అవసరమైన సమాచారంను అందిస్తున్నామని తెలిపారు. మధ్య దళారీల ప్రమేయంను పూర్తి స్థాయిలో నియంత్రించడం, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించడం ద్వారా రేట్లు పతనం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సీడ్ రేట్లు పెరుగుదలకు సంబంధించి అప్సడాకు సమాచారం ఇచ్చిన తరువాతే, వాటిని శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటున్నామని, రైతులపై అధిక భారం లేకుండా, అటు సీడ్, ఫీడ్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉండేలా రేట్లను ప్రభుత్వ పరంగా నియంత్రించగలిగామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయానంద్, గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పిసిబి చీఫ్ ఇంజనీర్ శివారెడ్డి పాల్గొన్నారు. -
AP: నీతి ఆయోగ్ మెచ్చిన ఆక్వా టెకీ
సాక్షి, విశాఖపట్నం: ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో సాంకేతికతని పరిచయం చేసి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఏకంగా 2,500 మంది రైతుల్ని నడిపిస్తున్నారు విశాఖకు చెందిన పవన్‌కృష్ణ కొసరాజు. అతడి కృషిని నీతి ఆయోగ్ గుర్తించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి దోహదపడుతున్న 75 స్టార్టప్‌లలో ఆక్వా ఎక్స్చేంజ్కు చోటు కల్పించింది. విశాఖలో చదువుకుని ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పట్టా, బెర్లిన్‌లో ఎంబీఏ, యూఎస్ఏలో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ పట్టా పుచ్చుకున్న పవన్‌కృష్ణ జర్మనీ, భారతదేశాల్లోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఆ తరువాత ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసిన పవన్ వారికి సాంకేతికతను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో 2020లో స్టార్టప్‌ను ప్రారంభించారు. విశాఖలో రిజిస్టర్ చేసి విజయవాడలో కార్యాలయం ప్రారంభించారు. కోవిడ్ సమయం కావడంతో కాస్తా ఆలస్యంగానే అడుగులు పడ్డాయి. తన బంధువులైన ఒకరిద్దరు రైతులతో మొదలుపెట్టగా.. వారు సత్ఫలితాలు సాధించడంతో క్రమంగా రైతులు ఆక్వా ఎక్స్చేంజ్ వైపు ఆకర్షితులయ్యారు. టెక్ పరికరాలు.. లాభాల సిరులు ఆక్వా రైతులకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలపైనే పవన్ దృష్టి సారించారు. చెరువుల్లో పెంచే రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ పూర్తిస్థాయిలో సరఫరా చేయడం.. మేతను సమపాళ్లలో అందించడం.. విద్యుత్ ఖర్చులు తగ్గించడం.. దిగుబడుల్ని మంచి లాభాలకు కొనుగోలు చేయించడం వంటి నాలుగు అంశాలపై ఆక్వా ఎక్స్చేంజ్ పనిచేస్తూ.. రైతుల మన్ననల్ని చూరగొంటోంది. నెక్ట్స్ ఆక్వా పేరుతో భిన్నమైన పరికరాలను ఆవిష్కరించారు. వాటికి పేటెంట్లు కూడా దక్కించుకున్నారు. ఆక్వా ఎక్స్చేంజ్ పేరుతో తయారు చేసిన యాప్ ద్వారా ఈ పరికరాల్ని ఆయా రైతులే స్వయంగా మోనిటరింగ్ చేసుకునేలా వ్యవస్థను రూపొందించారు. అద్భుతమైన ఈ టెక్ పరికరాల్ని నెల్లూరు జిల్లా గూడూరు నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ 2500 మంది రైతులు 30 వేల ఎకరాల్లో వినియోగిస్తున్నారు. మేతకు ఢోకా లేదు... రొయ్యలకు మేత వేసేందుకు చెరువులోకి పడవలో వెళ్లి.. ఒక వైరుని చేత్తో పట్టుకొని మరో చేత్తో మేతని విసురుతారు. అన్నిచోట్లా మేత ఒకేలా అందకపోవడంతో రొయ్యలు, చేపలు సమస్థాయిలో ఎదగవు. ఫలితంగా దిగుబడిలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనిని అధిగమించేందుకు పవన్ సంస్థ ఆక్వాబాట్ అనే పరికరాన్ని తయారు చేసింది. దీనిని రైతు ఏ ప్రాంతం నుంచైనా స్టార్ట్‌చేసి మేతని అందించవచ్చు. ఈ మెషిన్ చెరువులోని ప్రతి ప్రాంతానికి ఆటోమేటిక్‌గా తిరుగుతూ సమపాళ్లలో మేతని అందిస్తుంటుంది. దీన్ని 6 నెలలకు రైతులకు రూ.20 వేల అద్దెకు అందిస్తున్నారు. సాధారణంగా ఒక చెరువుకు ఒకర్ని నియమించుకుంటే.. ఒక పంటకాలానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. పవన్ సంస్థ తయారు చేసిన పరికరాల్ని వినియోగించి దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ రైతులు ఖర్చుల్ని ఆదా చేసుకుంటున్నారు. ఆక్వాఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వాలంటే నెలకు రూ.150 ఖర్చవుతుంది. వీటిని వినియోగిస్తుండటం వల్ల ప్రతి రైతు విద్యుత్ వినియోగంలో రూ.500 నుంచి రూ.600 వరకూ ఆదా చేస్తున్నారు. విజయవాడ శివారు గన్నవరంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయంలో ప్రస్తుతం 160 మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 50 మంది మహిళలుండటం విశేషం. కరెంట్ పోయినా.. చింత లేదు ఈ సంస్థ రూపొందించిన పవర్ మోన్ అనే పరికరాన్ని చెరువు వద్ద ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ సరఫరాను ఆ పరికరమే మోనిటరింగ్ చేసుకుంటుంది. కరెంటు పోయినప్పుడు ఏరియేటర్లు ఆగిపోకుండా ఆ పరికరమే జనరేటర్‌ను ఆన్ చేస్తుంది. ఆక్వాఎక్స్చేంజ్ తయారు చేసిన ఏపీఎఫ్సీని పెట్టుకుంటే.. ఆక్వా చెరువుకు ఎంత లోడ్ అవసరమో అంతే విద్యుత్వినియోగించేలా చేస్తుంది. తది్వరా విద్యుత్ బిల్లు చాలా వరకూ ఆదా అవుతుంది. 25 వేల మంది రైతులకు చేరువ చేసే దిశగా.. ఆక్వా రైతులకు ఖర్చులు తగ్గించి వారికి భరోసా అందించే దిశగా ప్రారంభించిన స్టార్టప్ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతిక డేటా ఆధారంగా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాం. కేవలం టెక్ పరికరాలు అందించడమే కాదు.. నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు మంచి ధర వచ్చేలా ఎగుమతిదారులకు అనుసంధానం చేసే బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాం. మొత్తంగా 25 వేల మంది రైతులకు లక్ష ఎకరాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. తాజాగా ఒడిశాకు కూడా ఆక్వా ఎక్స్చేంజ్ సేవలను విస్తరించాం. – పవన్‌కృష్ణ కొసరాజు, సీఈవో, ఆక్వా ఎక్స్చేంజ్ -
ఆక్వాకు ఉజ్వల భవిత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆక్వా రంగం మరింత పురోభివృద్ధి సాధించేలా, రైతులకు మేలు కలిగేలా స్టేక్ హోల్డర్స్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఫీడ్ ధర కిలో రూ.2.50 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రొయ్య పిల్లను 36 పైసలకు విక్రయిస్తుండగా, ఆరు పైసలు తగ్గించి 30 పైసలు చేశారు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన రొయ్య సీడ్ ఉత్పత్తికి అత్యంత ఆధునిక లేబొరేటరీలు నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ లేబొరేటరీల ద్వారా రొయ్య సీడ్లో యాంటీబయాటిక్స్ లేకుండా చూడాలని నిర్ణయించారు. ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. రొయ్యల చెరువుల వద్ద పట్టుబడి జరిగిన తరువాత సాధ్యమైనంత త్వరగా రొయ్యలను ఐస్‌లో వేసి తాజాదనం కోల్పోకుండా చూడాలని, ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలోని అన్ని వర్గాల వారితో వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు అమలయ్యేటట్టు చూడాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. తక్కువ సాంద్రత కలిగి 25 నుంచి 60 మధ్య కౌంట్ సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మెరుగైన ఉత్పాదకత, నాణ్యత కోసం రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించే బాధ్యతను మేత తయారీదారులు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడి ధరలను సమీక్షించిన అనంతరమే ఫీడ్ ధర ఖరారు చేసేందుకు ఫీడ్ తయారీదారులు ఆమోదం తెలిపారు. విధిగా నెలకోసారి ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు అనుకూలమైన ప్రాంతంలో సమావేశమై, సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఆక్వా సాగు, రవాణా, కొత్త ట్రెండ్లు, నోటిఫికేషన్లు, ముందస్తు హెచ్చరికలు, దేశీయ మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు. ల్యాబ్‌లు ఏర్పాటు, నిర్వహణ విషయంలో హేచరీ యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మా ‘విడాకులు’ తెగుతున్నాయి) -
‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’
సాక్షి, పశ్చిమగోదావరి: ఆక్వా పాలిట విలన్ చంద్రబాబేనంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా రంగానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి సబ్సిడీలు అందిస్తుందన్నారు. ధరల నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా రంగంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు. చదవండి: అంతా బాగున్నా అసత్యాల సేద్యమే -
వాణిజ్య ఖిల్లా ‘పశ్చిమ’
సాక్షిప్రతినిధి, ఏలూరు: అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా ఏర్పడిన నూతన పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య ఖిల్లాగా అవతరించింది. డెల్టా, గోదావరి, సముద్ర తీర ప్రాంతాలతో ఆవిష్కృతమైంది. జిల్లాగా ఏర్పడిన నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేశారు. ఆక్వా ఉత్పత్తులు, విదేశీ ఎగుమతులు, వాణిజ్య, విద్యాసంస్థలు కలబోతగా భీమవరం కేంద్రంగా జిల్లా అవతరించింది. ఆధ్యాత్మిక సౌరభం, రాజకీయ చైతన్యంతో విరాజిల్లనుంది. ఆక్వాహబ్‌గా పేర్గాంచి.. ప్రధానంగా 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతో భీమవరం ఆక్వాహబ్‌గా మారింది. ఆక్వా చెరువులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్, సీడ్ యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి నుంచి అమెరికా, చైనా, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంకతో పాటు యూరప్ దేశాలకు నిత్యం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రెండో బార్డోలి: స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండో బార్డోలిగా పేర్గాంచింది. ఆధ్యాత్మిక సౌరభం: పాలకొల్లు, భీమవరంలో పంచారామక్షేత్రాలు, భీమవరంలో మావుళ్లమ్మవారి ఆలయం, పెనుగొండలో వాసవీ మాత ఆలయం, నరసాపురంలో ఆదికేశవ ఎంబేరుమన్నార్ కోవెలతో జిల్లా ఆధ్యాత్మికంగా విలసిల్లుతోంది. కళలకు ప్రసిద్ధి: పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో రంగస్థల, సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులుగా వెలుగొందుతున్నారు. రాజకీయ చైతన్యం: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా కీలకం. ఇక్కడి నుంచి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. చారిత్రక నేపథ్యం: నరసాపురం ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొగల్తూరు రాజులు మొగల్తూరు కేంద్రంగా కృష్ణా జిల్లా వరకూ పాలన సాగించారు. డచ్, బ్రిటిషర్లు ఇక్కడ స్థావరాలు ఏర్పాటుచేసుకున్నారు. 300 ఏళ్ల క్రితం డచ్ వారు నిర్మించిన వైఎన్ కళాశాల పరిపాలనా భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. లేసు, వాణిజ్య ఉత్పత్తులు: ఐర్లాండ్ దేశస్తులు పరిచయం చేసిన లేసు అల్లికల పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉంది. మొగల్తూరు మామిడి, మోళ్లపర్రు ఎండుచేపలు, పాలకొల్లు కొబ్బరి, నరసాపురం బంగారం వ్యాపారం, తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్, ఆయిల్ విక్రయాలకు పేర్గాంచింది. ఇస్రో ఇంధన తయారీ: అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాల్లో అవసరమైన ఇంధనాన్ని తణుకు కేంద్రంగా ఉత్పత్తి చేస్తున్నారు. 1988 నుంచి ఆంధ్రా సుగర్స్ అనుబంధ సంస్థలో తయారైన ఇంధనాన్ని ఇస్రో ఉపయోగిస్తోంది. విద్యా నిలయం: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలు ఉన్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. -
స్పైసీ రుచులతో ఆక్వా రెస్టారెంట్లు.. ఇలా వెళ్లి అలా తిని రావొచ్చు
చేపలు.. రొయ్యలు.. పీతలు. వీటితో పులుసు.. ఇగురు.. వేపుడే కాదు. బిర్యానీ.. మంచూరియా.. స్నాక్స్ కూడా అప్పటికప్పుడు తయారవుతాయి. విభిన్న రుచులతో మత్స్య ప్రియుల జిహ్వ చాపల్యాన్ని ఇట్టే తీర్చేస్తాయి. దేశంలోనే తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులు లైవ్ (బతికి ఉన్నవి)గానే కాకుండా ‘రెడీ టు కుక్’ రూపంలోనూ లభిస్తాయి. అంతేకాకుండా శుచిగా.. రుచిగా వండి అక్కడికక్కడే వడ్డించే రెస్టారెంట్లు సైతం అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, చేప, రొయ్య పచ్చళ్లు కూడా అక్కడే లభిస్తాయి. వీటిలో ఏది కావాలన్నా స్వయంగా వెళ్లి తెచ్చుకోవచ్చు. లేదంటే.. ఇంట్లోనే ఉండి డోర్ డెలివరీ ద్వారా పొందవచ్చు. వీటి శాంపిల్స్‌ను ఆక్వా ల్యాబ్స్‌లో పరీక్షించిన తర్వాత ఫిష్ ఆంధ్రా హబ్, రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందేలా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఫిష్ ఆంధ్రా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు సరసమైన ధరలకే లభించడమే కాకుండా మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వనరులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఆక్వా పరిశ్రమకు మంచి రోజులొస్తాయి. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. అక్కడే మరో 100 అవుట్‌లెట్స్, 2 స్పోక్స్ కూడా అందుబాటులోకి రావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా అవుట్ లెట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. సీఎం జగన్ ప్రారంభించనున్న పులివెందుల ఆక్వా హబ్ కంటైనర్ తరహా రెస్టారెంట్ మినీ అవుట్ లెట్లో బతికిన చేప, రొయ్యలు, రెడీ టు కుక్ పేరిట మారినేట్ చేసిన (ఊరవేసిన) ఉత్పత్తులు, ఎండు చేపలు, రొయ్యలు, పచ్చళ్ల విక్రయాలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడికక్కడే తయారు చేసిన స్నాక్ ఐటమ్స్ పార్శిల్స్ రూపంలో అమ్ముతారు. మినీ అవుట్ లెట్ తరహాలోనే అన్నిరకాల ఉత్పత్తులు డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్లలోఅందుబాటులో ఉంటాయి. వాటితోపాటు డెయిలీ యూనిట్లో కిచెన్‌తో పాటు 6–7 మంది, సూపర్ యూనిట్లో 10–15 మందికి పైగా కూర్చుని వాటిలో వండిన ఆహార పదార్థాలను భుజించేందుకు వీలుగా ఏసీ సౌకర్యంతో డైనింగ్ ఉంటుంది. లాంజ్ యూనిట్ పూర్తిస్థాయి రెస్టారెంట్ తరహాలో ఉంటుంది. ఇక్కడ కనీసం 20–30 మంది కూర్చుని వాటిలో వండిన మత్స్య పదార్థాలను అక్కడే తినేందుకు వీలుగా కంటైనర్ తరహాలో డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్స్‌లో ఫిష్ మసాలా, ప్రాన్ మసాలా, ప్రాన్ తవా ఫ్రై, అపొలొ ఫిష్, మసాలా ఫిష్, ఫిష్ పిలెట్, ఆంధ్రా చిల్లీ ఫిష్, ఆంధ్రా చిల్లీ ప్రాన్స్, మసాలా ప్రాన్స్, పెప్పర్ ప్రాన్స్, పాంఫ్రెట్ స్టీక్స్, పాంఫ్రెట్ హోల్, వంజరం, పండుగప్ప ఫుల్ ఫిష్ ఫ్రై వంటి వాటితో పాటు సైడ్స్, డ్రింక్స్, బేకరీ, ఫ్రూట్ ఐటమ్స్, అన్ని రకాల ఐస్‌క్రీమ్స్ కూడా విక్రయిస్తారు. ఆక్వా హబ్‌కు అనుసంధానంగా.. సముద్ర, మంచినీటి, ఉప్పునీటి మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్రాన్, మారినేట్ ఉత్పత్తులు, చేప, రొయ్య పచ్చళ్లను విక్రయించేందుకు వీలుగా ఆక్వా హబ్‌లకు అనుబంధంగా మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్స్, ఈ–మొబైల్ 3 వీలర్ ఫిష్ వెండింగ్ కార్ట్స్, మొబైల్ 4 వీలర్ ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ వెహికల్స్, డెయిలీ (ఫిష్ కియోస్క్) యూనిట్లు, సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), ఒకటి లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలిసారి సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను వీటిద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. విశాఖలోని ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లేట్ వినియోగదారులతోపాటు మత్స్యకారులకూ ప్రయోజనం నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మత్స్యకారులు, ఆక్వా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ వనరులను పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆక్వా హబ్‌లను తీసుకొస్తున్నాం. దీనివల్ల స్థానిక వినియోగం పెరగడంతోపాటు ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా పులివెందుల ఆక్వా హబ్‌తో పాటు దాని పరిధిలోని అవుట్‌లెట్స్, స్పోక్స్‌ను ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. – సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ మంత్రి -
Fish Andhra: ఇంటి ముంగిటకే చేపలు
సాక్షి, అమరావతి: బొమ్మిడాయల పులుసు, కొర్రమీను ఫ్రై, రావల ఇగురు, బొచ్చె, శీలావతి, రాగండి కూరలు.. ఈ పేర్లు చెబితేనే మాంసాహారులకు నోరూరుతుంది కదూ.. అవును ఈ చేపల్లో పోషక విలువలూ ఎక్కువే. అందుకే ప్రభుత్వం తాజా స్వచ్ఛమైన చేపలను ప్రజలకు అందించడంతోపాటు, ఆక్వా రైతులకు మార్కెటింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ–వెహికల్, మినీఫిష్ రిటైల్ అవుట్లెట్ల స్థాపననూ ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తిలో ముందు.. వినియోగంలో వెనుక రాష్ట్రంలో మాంసాహారులకు తాజా స్వచ్ఛమైన చేపలు దొరకడం గగనమే. పైపెచ్చు అన్ని రకాల చేపలూ అందుబాటులో ఉండవు. దీంతో పోషక విలువలు ఉన్న చేపలు తినాలనే ఆసక్తి ఉన్నా.. ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో (దేశ వ్యాప్తంగా ఉత్పత్తిలో ఏపీ వాటా 75.84 శాతం) ఉంది. అదే సమయంలో వాటి వినియోగంలో మాత్రం బాగా వెనుకబడి ఉంది. 2020లో ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఏడాదికి సరాసరిన ఓ వ్యక్తి చత్తీస్ఘడ్, కేరళ రాష్ట్రాల్లో 19 కేజీలు, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 16 కేజీల చేపలను తింటున్నారని అంచనా. మన రాష్ట్రంలో మాత్రం ఇది కేవలం 8.07 కేజీలుగా ఉంది. మార్కెట్ లేక రైతుల అవస్థలు ప్రజలు చేపల వినియోగంలో వెనుకపడడంతో రైతులు తమ చెంతనే ఉన్న మార్కెట్‌ను కోల్పోతున్నారు. ఫలితంగా కేవలం ఎగుమతులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కోవిడ్ సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఆక్వా హబ్‌ల ఆలోచన చేసింది. హబ్‌ల పనితీరు ఇలా.. ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, వినుకొండ, పిడుగురాళ్లలో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి విడతగా గుంటూరు, తెనాలిలో హబ్‌ల ఏర్పాటుకు లబ్ధిదారులు ముందుకొచ్చారు. వీటి ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్ 21న అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు హబ్‌లను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వా హబ్‌ల పనితీరు ► ఆక్వా హబ్‌లను రైతులు సొసైటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. ► చేపలు, ఆక్వా ఉత్పత్తులను సేకరించి ప్రాసెస్ చేస్తారు. అందుకోసం రూ.2 కోట్లతో శీతల గిడ్డంగిని సమకూర్చుకుంటారు. ► ఇందులో లైవ్ పూల్స్, ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులో ఉంటాయి. ► హబ్‌ల నుంచి మత్స్య సంపదను రిటైల్ వర్తకులకు సరఫరా చేస్తారు. రిటైల్ యూనిట్లు ఇలా.. ► గ్రామ/వార్డుస్థాయిలో ఈ–వెహికల్, మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు కానున్నాయి. ► హబ్‌ల ద్వారా సరుకు తీసుకుని ఆసక్తి ఉన్న వ్యాపారులు వాల్యూ యాడెడ్ యూనిట్లను నెలకొల్పుకోవచ్చు. ► రిటైల్ దుకాణాలు, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేసుకోవచ్చు. ► ఈ యూనిట్లలో స్నాక్స్, ఆహార ఉత్పత్తులూ అందుబాటులో ఉంచొచ్చు. ► మత్స్య ఉత్పత్తుల విక్రయానికి కియోస్క్ యూనిట్లనూ ఏర్పాటు చేయనున్నారు. ►మొబైల్ ఫిష్ వెండింగ్, ఫుడ్ కోర్టులూ అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ రాయితీ మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్ మినహా అన్ని రకాల యూనిట్లకు ప్రభుత్వం రాయితీ అందించనుంది. బీసీ, జనరల్‌కు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 60 శాతం పెట్టుబడిని రాయితీగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు తన వాటాగా సమకూర్చుకోవాలి. ఇందుకు బ్యాంకు ద్వారా రుణం సమకూర్చే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. హబ్‌లు, రిటైల్ దుకాణాల ఏర్పాటులో తొలి ప్రాధాన్యం చేపల వేట, మత్స్య వ్యాపారం చేస్తున్న కుటుంబాలకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఔత్సాహికులు సచివాలయాల్లో సంప్రదించాలి ఆక్వా హబ్‌ల వల్ల గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య యూనిట్లను నెలకొల్పేవారు సచివాలయాల్లో లేదా వలంటీర్లను సంప్రదించాలి. ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో స్థానికంగా 30 శాతం వినియోగించగలిగితే రైతులకు భరోసా ఉంటుంది. వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల చేపలు ప్రస్తుతం లభించడం లేదు. ఈ హబ్‌ల వల్ల వినియోగదారుడికి కావాల్సిన రకం, ఇంటి ముంగిటకే తాజాగా రానుంది. – ఏవీ రాఘవ రెడ్డి , జేడీ మత్స్య శాఖ(ఎఫ్ఏసీ), గుంటూరు -
ఆక్వా చెరువుల్లోకి ఓఎన్జీసీ వ్యర్థాలు
ఉప్పలగుప్తం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలోని జీఎంఏఏ ఓఎన్జీసీ సైట్ నుంచి వెలువడిన వ్యర్థ జలాలు పంట కాలువలో చేరి ఆక్వా, చేపల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లటంతో రైతులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ సైట్‌కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గోపవరం గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్)గా వ్యవహరించే ఈ సైట్లో ముడిచమురుతో వచ్చే వ్యర్థ జలాలను సెపరేటర్ల ద్వారా శుద్ధి ప్లాంటుకు తరలిస్తారు. రెండు మూడు రోజులుగా వ్యర్థ జలాలు పంట కాలువలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి లీకేజీ ఎక్కువ కావడంతో కాలువ నిండా వ్యర్థ జలాలు చేరాయి. ఈ విషయం తెలియని ఆక్వా రైతులు కాలువలోని నీటిని చెరువుల్లోకి తోడారు. సుమారు 3 వందల ఎకరాల ఆయకట్టున్న ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాలకు ఇంజన్లతో ఆ నీటిని తోడారు. దీంతో పలు చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలగా రొయ్యలు మృత్యువాత పడి అడుగు భాగానికి చేరినట్లు గుర్తించారు. దీంతో రైతులు అల్లూరి రమేష్‌రాజు, సామంతకూరి జగన్రాజు తదితరులు స్థానిక నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆధ్వర్యంలో జగ్గరాజుపేటలో ధర్నాకు దిగారు. ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ఆమేరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చల్లపల్లి సర్పంచ్ ఇసుకపట్ల జయమణి ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని అందించారు. ఓఎన్జీసీ ఇన్స్టలేషన్ మేనేజర్ (ఐఎం) పి.జగన్నాథరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. సాంకేతిక బృందం నివేదిక మేరకు పరిహారం అందజేస్తామని చెప్పారు. -
పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆక్వా హబ్స్
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆక్వా హబ్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ తరువాత నియోజకవర్గ కేంద్రాలకూ విస్తరించనుంది. వీటి నిర్వహణ బాధ్యతల్ని ఎఫ్ఎఫ్పీవో (ఫిష్ ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్)లకు అప్పగిస్తారు. ఎంపికైన ఆక్వా హబ్ నిర్వాహకులకు ప్రభుత్వమే రాయితీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తుంది. హబ్‌ల నుంచి రిటైలర్లు, ఫిష్ మార్కెట్లు, జనతా బజార్లకు లైవ్ ఫిష్ (బతికున్న చేపలు) రవాణా చేయడానికి వీలుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. హబ్‌లలో కూలింగ్ సెంటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటినుంచి మార్కెట్లకు లైవ్ ఫిష్ రవాణా చేసేందుకు ఐస్ బాక్సు వ్యాన్లను వాడతారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా హబ్స్, మార్కెట్ పరిస్థితులను పర్యవేక్షిస్తారు. మార్కెట్లో ఒడిదుడుకుల్ని నివారించేందుకు.. ► రాష్ట్రంలో ఏటా 35 లక్షల టన్నుల చేపల దిగుబడి వస్తోంది. ఇందులో 90 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కేవలం 10 శాతం చేపల్ని మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నారు. ► రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్ల వరకు ఉంది. ఈ రంగంపై ఆధారపడి 1.40 లక్షల కుటుంబాలు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నాయి. ► ఈ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.25 వేల కోట్లకు చేరుకుంది. ► ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రంగం లాక్డౌన్ సమయంలో మార్కెట్ల మూసివేత, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ► భవిష్యత్‌లో ఒడిదుడుకులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేస్తోంది. ► ఇదే సందర్భంలో పోషక విలువలు అధికంగా ఉండే చేపల్ని ఆహారంగా తీసుకునే అలవాటును ప్రజల్లో పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. స్థానిక వినియోగం మరీ తక్కువ ► ప్రపంచంలోని ఇతర దేశాల్లో చేపల సగటు వినియోగం 20 నుంచి 30 కిలోలుగా ఉంది. ► మత్స్యశాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి వ్యక్తి ఏటా 7.50 కిలోల నుంచి 10 కిలోల వరకు చేపలను ఆహారంగా తీసుకుంటున్నారు. ► మన రాష్ట్రానికి వస్తే.. చేపల సగటు వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఏటా 1.80 కిలోలు, పట్టణాల్లో 1.32 కిలోలుగా ఉంది. ► మంచి పోషక విలువలు కలిగిన చేపల్ని వారానికి రెండుసార్లు ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ► ఈ దృష్ట్యా వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో లక్ష టన్నులు, 2025 నాటికి 5 లక్షల టన్నుల చేపల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం వివిధ పథకాలను అందుబాటులోకి తెస్తోంది. -
భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ
సాక్షి, అమరావతి: భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్సిటీ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రాథమికంగా వర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ► రాష్ట్రంలో ఏటా 25.52 లక్షల టన్నుల చేపలు, 11.82 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. ► చేపలు, రొయ్యల సాగులో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే ఈ దిగుబడి మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సాగుకు సంబంధించిన వివిధ కోర్సులను బోధించే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ► ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా సాగు అధికంగా జరుగుతుండటంతో ఈ జిల్లాల రైతులకు భీమవరం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. ► ఈ జిల్లాల్లోనే శాస్త్రీయ విధానాలను అనుసరించే రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హేచరీస్ నిర్వహణ, ఎగుమతి వ్యాపారాల్లో కొనసాగుతున్నవారు అధికంగా ఉన్నారు. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని భీమవరంలో యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఇతర అధికారులను సీఎం ఆదేశించడంతో చర్యలు ఊపందుకున్నాయి. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాడే పల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్న గూడెంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పింది. ► ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడం పట్ల ఆయా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భీమ వరంలో ఆక్వా యూ నివర్సిటీ ఏర్పాటుకు అవసర మైన భూమిని సేకరించే ప్రయ త్నాలు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో పలుమార్లు భూసేకరణపై చర్చలు జరిపాం. త్వరలోనే భూసేకరణ పూర్తి చేస్తాం. –కె. కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
బోనస్ పేరుతో బురిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపల రైతుల పాలిట ‘బోనస్’ విధానం వారి ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చేపల అమ్మకాల సమయంలో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్ల వరకు నష్టపోతున్నారు. రైతుల నుంచి చేపలను కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు 5 శాతం బోనస్ విధానాన్ని అనుసరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యను కూడా పరిష్కరించి తమను ఆదుకోవాలని చేపల రైతులు కోరుతున్నారు. ఈ ‘బోనస్’ దందాను మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గత నెలలో రైతులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. విషయాన్ని సీఎంకు వివరించి, మరోసారి రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఐదు శాతం బోనస్ అంటే: రైతు నుంచి చేపలు కొనుగోలు చేసిన సమయంలో ఎన్ని కిలోలు కొంటే ఆ మొత్తానికి ధర చెల్లించాలి. కానీ బోనస్ పేరుతో అదనంగా మరో అయిదు కిలోలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు 100 కిలోలు కొంటూ 105 కిలోల చేపలను తీసుకుని, 100 కిలోలకే ధర చెల్లిస్తున్నారు. ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోందని అదనంగా తీసుకుంటున్న అయిదు కిలోల విలువను ఇతర రాష్ట్రాల్లోని బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అలా చేయకపోతే అక్కడి మార్కెట్లలో ధర రానీయకుండా చేస్తారని అంటున్నారు. ఈ దందాతో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్లు నష్టపోతున్నారు. అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. రైతులు ఎంత నష్టపోతున్నారంటే: ► ఏటా 16 లక్షల టన్నుల చేపల దిగుబడి అవుతోంది. ► వ్యాపారులు కొనుగోలు సమయంలో అయిదు శాతం అదనంగా తూకం వేసుకుని దానికి ధర చెల్లించట్లేదు. ఇలా మొత్తం 80 వేల టన్నులు నష్టపోతున్నారు. ► చెరువులు వద్ద చేపల ధర కిలో రూ.60 నుంచి రూ.100లోపు ఉంటుంది. కనిష్టంగా రూ. 60గా అంచనా వేసినా.. బోనస్ దందాతో రూ.480 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నారు. వాస్తవాలు తెలుసుకుని త్వరలో మరో సమావేశం: మోపిదేవి ‘బోనస్’పై వాస్తవాలు తెలుసుకుంటాం. రాష్ట్ర దిగుబడిలో 90 శాతం చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు, రైతులు ఇరు వర్గాలకు ప్రయోజనాలు కాపాడేలా వారితో త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం. -
‘ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్’
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు కరోనా నివారణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు అభద్రతాభావంతో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తులపై ధరలను నిర్ణయించిందన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లలో వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచవాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ‘వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. రైతులు పండించిన పంటలు, ఆక్వా రంగం ఉత్పత్తులకు నష్టం రాకుండ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమెరికా వంటి దేశాలు కరోనా వలన కుదేలైపోయాయి. కరోనా వైరస్ వలన గ్రామాలు కొన్ని కట్టుబాట్లు చేసుకోవడం వలన రైతులకు కొనుగోలుదారులు కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అటు వంటి గ్యాప్ లేకుండా, రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలపై ఎమ్పెడ్ కంపెనీ ప్రతినిధులు తో సీఎం సంప్రదింపులు జరిపారు’ అని మోపిదేవి తెలిపారు. ఆ రంగానికి మంచి భవిష్యత్ ఎగుమతులుపై చైనా ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తుంది. 2830 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు నాలుగు రోజుల్లో ఎగుమతి చేశాము. సోమవారం నుంచి ఫీల్డ్ కు వెళ్లి ఎక్సపోర్ట్స్ మీద ఒత్తిడి తెచ్చి వాస్తవ ధరకే కొనుగోళ్లు జరిగేలా చూస్తాము. ఆక్వా ఉత్పత్తులు కు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది. ధరలు తగ్గిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తాము. మిడిల్ మ్యాన్ వ్యవస్థ చాలా ప్రమాదకరమైనది. దళారి వ్యవస్థ లేకుండా చేస్తున్నాము. ఆక్వా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. రైతుల్లో అభద్రతా భావం వద్దు. పాజిటివ్ కేసులు పెరగడం వలనే నిత్యావసర కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితే సమయంలో సడలింపు ఇస్తాము. గ్రామాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతుంది. పట్టణాల్లో కొంత మార్పు రావాల్సి ఉంది’ అంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ వివరించారు. చదవండి: నోట్లతో ముక్కు తుడుచుకున్న వ్యక్తి అరెస్టు 'కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలి' -
ఆక్వా రంగానికి మంచి భవిష్యత్ ఉంది
-
ఆక్వా చెరువుల్లో కాసుల వేట
వివిధ శాఖల్లో వక్రమార్గం పట్టిన కొందరు అధికారులు ఆక్వా చెరువుల్లో అక్రమాల పంటపండిస్తున్నారు. ఒక్కో స్థాయిలో ఒక్కో రేటు నిర్ణయించి కాసులు దండుకుంటున్నారు. అసలు చేయి తడపందే ఆక్వా చెరువులకు అనుమతులే ఇవ్వబోమంటున్నారు. సొమ్ములెందుకివ్వాలని ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే పాత ‘నకిలీ’లను బయటపెట్టి బెదిరింపులకు దిగుతున్నారు.దీంతో ఎందుకొచ్చిన గొడవంటూ ఆ అధికారులు అడిగినంతా ఆక్వా రైతులు ముట్టజెబుతున్నారు. ఆక్వా సాగవుతున్న దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ ఆమ్యామ్యాల బాగోతం యథేచ్ఛగా సాగుతోంది. ఆక్వా చెరువులకు అనుమతి ఉన్నట్టుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ విద్యుత్తు రాయితీ పొందిన రైతులే అధికంగా ఉండడంతో ఆయా అధికారులు అడిగిన మొత్తం కిమ్మనకుండా సమర్పించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: జిల్లాలో రొయ్యల చెరువులకు అనుమతి పత్రాల కోసం వివిధ శాఖల్లోని కొందరు అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆక్వా సాగులో నాణ్యమైన ఉత్పత్తుల కోసం కేంద్ర ప్రభుత్వం రొయ్యలు, చేపల చెరువులను సాగు చేసేందుకు చెన్నై కేంద్రంగా కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ సర్టిఫికెట్ (సీసీఏ) తప్పనిసరి చేసింది. ఈ సర్టి ఫికెట్ లేకుండా చెరువులు తవ్వకానికి, ఆక్వా సా గు చేపట్టడానికి వీలు లేదు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆక్వా చెరువుల సా గుకు వినియోగించే విద్యుత్తుకు రాయితీని పెంచింది. గత ప్రభుత్వంలో రూ.3.60 ఉన్న యూని ట్ విద్యుత్‌ను ప్రస్తుతం రూ.1.50కే అందిస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ రాయితీ కొట్టేసేందుకు కొందరు ఆక్వా రైతుల బుద్ధి వక్రమార్గం పట్టింది. ఎటువంటి అధికారిక అనుమతులూ లేకపోయినా చెరువులు తవ్వేసి రాయితీ మొత్తం కాజేస్తున్నారు. ఈ విషయాన్ని రెండు నెలల కిందట ‘సాక్షి’ వెలుగులోకితెచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి నకిలీ సర్టిఫికెట్లతో విద్యుత్తు కనెక్షన్లు పొందిన చెరువుల వివరాలను మత్స్యశాఖ ద్వారా సేకరించారు. వాటి కనెక్షన్లను రద్దు చేయించారు. అలా రద్దు చేసిన సర్టిఫికెట్లను పునరుద్ధరించుకునేందుకు రైతులకు 2020 జనవరి 4వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఆ గడువు దగ్గర పడుతున్న క్రమంలో రైతులు అనుమతుల కోసం తొందరపడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని క్షేత్ర స్థాయిలో పలు శాఖల అధికారులు లంచాలు డిమాండ్ చేస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ లేకుండా ఆక్వా సాగు అసాధ్యం. దీంతో చెరువుల సాగుకు అనుమతి పత్రాల కోసం అధికారుల చుట్టూ యజమానులు తిరుగుతున్నారు. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ çసర్టిఫికెట్ పొందాలంటే తొలుత మండల స్థాయి, ఆ తరువాత జిల్లా స్థాయి కమిటీల్లో అనుమతి తప్పనిసరి. ‘స్పందన’ ఫిర్యాదుతో కలెక్టర్ అప్రమత్తం కాకినాడ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’కు ఆక్వా సాగుపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయం, నివాస ప్రాంతాలు, మంచినీటి వనరులు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కన్వీనర్‌గా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీ ఉంది. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, మత్స్య, ఇరిగేషన్, వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఆక్వా సాగు కోసం రైతుల దరఖాస్తులపై మండల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కమిటీకి సిఫారసు చేయాలి. ఆ కమిటీ అనుమతించిన తరువాతే చెన్నైలోని ఆక్వా కల్చర్ అథారిటీకి పంపిస్తారు. ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పక్కతోవ పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ముట్టకుంటే కింది స్థాయి అధికారులు ఫైళ్లను ముందుకు కదపడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ముడుపుల వ్యవహారంపై కోనసీమలోని పలు మండలాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నాడు విద్యుత్తు రాయితీల కోసం కక్కుర్తిపడి, నకిలీ సర్టిఫికెట్లతో సాగు చేయడాన్ని బూచిగా చూపించి, ముడుపులు డిమాండ్ చేస్తున్నారని, అడిగినంతా ముట్టజెప్పందే తమ అర్జీలను జిల్లాస్థాయికి పంపడం లేదని అంటున్నారు. కోనసీమలోని ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి, పెదమడి, బాణాపురం, కేశనకుర్రుపాలెం, మురమళ్ల; కాట్రేనికోన మండలం చెయ్యేరు, చెయ్యేరు అగ్రహారం, కాట్రేనికోన, కందికుప్ప; అల్లవరం మండలం కొమరగిరిపట్నం, గోడి, గోడిలంక; ఇంకా ఉప్పలగుప్తం, అయినవిల్లి తదితర మండలాల్లో కూడా ఈ ముడుపుల దందా నడుస్తోందంటున్నారు. ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు. కోస్టల్ ఆక్వా అథారిటీ సర్టిఫికెట్ లేని చెరువుల విద్యుత్తు కనెక్షన్ తొలగించేందుకు ఏపీఈపీడీసీఎల్ సమాయత్తమవుతోంది. దీంతో హడావిడి పడుతున్న రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మండల స్థాయిలో మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు వసూళ్లకు తెగబడతున్నారు. ఈ మండలాల్లో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున గుంజుతున్నారు. ఈ ముడుపులను మండల స్థాయిలో శాఖల వారీగా తలా రూ.3 వేల చొప్పున పంపకాలు చేసుకుంటున్నారు. చేయి తడపనిదే జిల్లాస్థాయి కమిటీకి సిఫారసు చేయడం లేదని కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలకు చెందిన పలువురు రైతులు, ఒక మండల స్థాయి అధికారి చెప్పారు. సీఏఏ సర్టిఫికెట్ విద్యుత్తు శాఖకు అందజేస్తే రాయితీ వస్తుందనే ఆశతో వారు డిమాండ్ చేసినంతా ఆక్వా రైతులు ఇచ్చుకుంటున్నారు. రాయితీ ఇలా.. జిల్లాలో చెరువులకు ఉన్న 7,111 విద్యుత్తు కనెక్షన్లకు ప్రభుత్వం రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తూ వస్తోంది. వీటిలో 3,583 చెరువులకు మాత్రమే సీఏఏ సర్టిఫికెట్లున్నాయి. మిగిలిన 3,528 విద్యుత్తు కనెక్షన్లున్న చెరువులకు పొందిన సర్టిఫికెట్లు నకిలీవేనని తేల్చి, వాటిని రెండు నెలల కిందట కలెక్టర్ రద్దు చేశారు. వీటితోపాటు రద్దు చేస్తారనే భయంతో కొందరు రైతులు ముందస్తుగా సీఏఏ సర్టిఫికెట్లు పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా వారి నుంచి అధికారులు ముడుపులు గుంజేస్తున్నారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు సర్టిఫికెట్ల కోసం మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి. అత్యధికంగా అల్లవరం మండలంలో 603, కాజులూరులో 533, ఐ.పోలవరంలో 447, ఉప్పలగుప్తంలో 316, సఖినేటిపల్లి మండలంలో 265, కాట్రేనికోనలో 256, తాళ్లరేవులో 200 దరఖాస్తులు వచ్చాయి. అమలాపురంలో 98, అయినవిల్లిలో 82, ముమ్మిడివరంలో 167, మలికిపురంలో 56, రాజోలు 47, మామిడికుదురులో 46, కొత్తపల్లిలో 95, కరపలో 104, పెదపూడిలో 45, కె.గంగవరంలో 49, రామచంద్రపురంలో 44 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా రెండు నుంచి 20 వరకూ దరఖాస్తులు వచ్చిన మండలాలు మరో 10 వరకూ ఉన్నాయి. విచారణ జరిపించిచర్యలు తీసుకుంటాం ముడుపుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. రైతుల నుంచి నిర్దిష్టంగా ఫిర్యాదులు వస్తే కచ్చితంగా విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం. ఇంతవరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నకిలీ సర్టిఫికెట్లతో కనెక్షన్లు పొందిన రైతులు ఇటీవల మంత్రులను కలిసి పునరుద్ధరించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ, అన్ని అనుమతులూ తీసుకున్న వాటిని మాత్రమే గుర్తించి, పునరుద్ధరిస్తామని వారు రైతులకు చెప్పారు. లంచాల విషయం మా దృష్టికి రాలేదు. ఏయే మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉందో స్వయంగా తెలుసుకుంటాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అటువంటి వాటిని కట్టడి చేస్తాం.– పి.కోటేశ్వరరావు, జేడీ ఇన్చార్జి, అదనపు డైరెక్టర్, ప్రిన్సిపాల్, రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయం (ఎస్‌ఐఎఫ్‌టీ), కాకినాడ -
ఆపరేషన్ అంపలాం సక్సెస్
పోలాకి: ఏళ్ల తరబడి తీరప్రాంత మత్స్యకారు లు, స్థానికులు, పర్యావరణ అభిమానులు చే స్తున్న పోరాటాలు ఫలించాయి. అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ అంపలాం’తో ఆక్రమణలో వున్న వంశధార నదీమతల్లి చెర వీడినట్టయింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆర్డీవో ఎం.వి.రమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ ఎ.సింహాచలం సిబ్బందితో కలసి దాదాపు 50మంది పోలీ సు బందోబస్తు మధ్య వంశధార నదీతీరానికి చేరుకున్నారు. అక్కడ పోలాకి–2 రెవెన్యూ పరిధిలో 516 సర్వే నెంబర్లో నదీగర్భంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదా పు 20 ఎకరాల్లోని రొయ్యిల చెరువులను తొలగింపునకు పూనుకున్నారు. అంపలాం గ్రామానికి ఆనుకుని వున్న ఆ ప్రాంతంలో అప్పటి వరకూ ఏం జరుగుతుందో తెలియక అటు ఆక్రమణదారులు, ఇటు స్థానికులు అదే పనిగా చూ స్తూ ఉండిపోయారు. ఈలోగా జేసీబీ యంత్రాలతో గంటల వ్యవధిలోనే ఆక్రమణలు తొలగింపు చేపట్టి ఆపరేషన్ అంపలాం విజయవంతం అయినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఇద్దరు ఆర్ఐలు, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐదు గురు సర్వేయర్లు, పదిమంది వీఆ ర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. నరసన్నపేట సీఐ తిరపతి, ఎస్ఐలు చిన్నం నాయుడు, సత్యనారాయణ, 50మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వంశధార ‘సాక్షి’గా కబ్జాదారుల ఆగడాలు.. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి, నదులు, కాలువలు, చెరువులు, సముద్ర పరివాహక ప్రాంతాల్లో కబ్జాకు తెగబడుతున్న వారికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ గట్టి హెచ్చరికే అని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మరీ భూఆక్రమణలకు పాల్పడ్డారు. వారిపై అప్పట్లో ‘సాక్షి’ లో కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. అయితే నాటి పాలకుల కనుసన్నల్లో నడిచే యంత్రాంగం సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. నదిగా అడ్డంగా గట్టువేసి, మత్స్యకారుల జీవనోపాధి గండికొట్టేలా.. చేసినా సర్వే పేరుతో తాత్సారం చేశారు. నది ప్రవాహ దిశ మార్చుకుని ఇటీవల వరదల్లో ఉగ్రరూపం చూపితే గానీ అప్పట్లో చేపట్టిన ఘనకార్యాన్ని యంత్రాంగం గుర్తించలేకపోయింది. ఆక్రమణల తొలగింపు అసాధ్యం అనుకున్నాం.. నదికి అడ్డంగా గట్టువేసి ఆక్రమించుకున్న భూమిలో రొయ్యల చెరువులు తవ్వుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఈ విషయంపై మండల, జిల్లాస్ధాయి అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇక ఆక్రమణలు తొలగించటం సాధ్యం కాదని అనుకున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కాకముందే ఆక్రమణలు తొలగింపు సంతోషదాయకం. –కోడ లక్ష్మీపతి, మత్స్యకారుడు, రాజారాంపురం కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ నిర్వహించాం. ఆక్రమణలు ఎక్కడున్నా ఇదే స్ధాయిలో స్పందిస్తాం. నదీ సంగమ ప్రదేశంలో రొయ్యల చెరువులు తవ్వకంతో నది దిశను మార్చుకుని ఇటీవల వరద కళింగపట్నం వైపు మళ్లింది. మళ్లీ ఇలాంటి ఆక్రమణలు పునరావృత్తం కాకుండా మండల రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేశాం. –ఎం.వి.రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం -
మత్స్యకారుల అభివృద్ధికి ఆక్వా ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ ఆక్వా ఎగ్జిబిషన్ (ఆక్వాక్స్) ఏర్పాటు చేయనున్నట్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ సంస్థ సహకారంతో మార్చి 15 నుంచి 18 వరకు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తామన్నారు. బుధవారం సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా– 2018 పోస్టర్‌ను మంత్రి ఆవిష్కంచారు. దక్షిణ ఆసియాలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆక్వాక్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో సుమారు 25 దేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల చేపల పెంపకందారులు హాజరుకానున్నారని చెప్పారు. కొత్త జాతులు ఉత్పత్తి, యంత్ర సామగ్రి, ఉత్తమ మార్కెటింగ్ పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించనున్నట్లు తలసాని అన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ (ఎస్ఐఎఫ్ఏ) ప్రెసిడెంట్ రామచంద్రరాజు, సీఈవో వేణు దంతులూరి, డైరెక్టర్ సమీర్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. -
కోనసీమలో ఆక్వా పంజా
-
చేలు మాయం.. చెరువుల మయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టాలో వరి చేలు మాయమవుతున్నాయి. సాగు భూములు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. అనధికారికంగా తవ్వుతున్న చెరువుల కారణంగా డెల్టా ప్రమాదంలో పడింది. నాలుగేళ్లుగా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గతంలో జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఆక్వా చెరువుల కారణంగా 5.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం వరి విస్తీర్ణం 4 లక్షల ఎకరాల లోపే ఉన్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టాలో పొలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లో వరిసాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు కాగా, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అధికారిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారికంగా మరో లక్ష ఎకరాల వరకూ చెరువులుగా మారినట్టు అంచనా. అనుమతి లేనివే అధికం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, యలమంచిలి, పాలకొల్లు మండలా ల్లోని అత్యధిక విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందులో అనుమతి లేనివే అధికం. తాజాగా ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, పెరవలి, అత్తి లి మండలాల్లోనూ చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. డెల్టా మండలాల్లో ఏటా రెండు పంటలు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కాలంలో కొత్త వంగడాలు సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం, తెగుళ్లు తప్పడంతో దిగుబడి బాగా పెరిగింది. గతంలో రెండు పంటలకు 60 నుంచి 65 బస్తాల వరకూ దిగుబడి వస్తే.. ఇప్పుడు సగటున 80 బస్తాల వరకూ పెరిగింది. అయితే, సాగు భూములు మాత్రం తగ్గిపోయాయి. ఆక్వా జోన్లుగా ప్రకటించడంతో.. ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా డెల్టాలోని కొన్ని మండలాల్లో అక్వా జోన్లను ప్రకటించింది. దీంతో ధనిక రైతులు వ్యవసాయం నుంచి అక్వా వైపు మళ్లుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఎక్కడా రొయ్యల చెరువులకు అనుమతి లేదు. ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు డెల్టాలోనూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లోని భూములన్నీ ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. ఉప్పునీటి బోర్లకు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తు్తన్నారు. సెలనిటి చాలకపోతే చెరువుల్లో నేరుగా బస్తాలకొద్దీ ఉప్పు కలుపుతున్నారు. రొయ్యల సాగు కోసం యాంటీబయోటిక్స్ సైతం అధికంగా వాడుతున్నారు. ఈ నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనినే చాలా గ్రామాల్లో తాగునీటికి ఉపయోగించాల్సిన దుస్థితి దాపురించింది. పని దినాలు తగ్గిపోయాయి ఆక్వా చెరువుల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ఆ భూముల్లో వరి సాగైన సమయంలో కూలీలకు సగటున 50 పని దినాలు ఉంటే అక్వా వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయాయి. దీంతో కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రొయ్యల చెరువులున్న గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఉప్పు నీటి కారణంగా పంటలు పండటం లేదు. దీనివల్ల రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టాలో వ్యవసాయ భూములు తగ్గిపోతుండటంతో కౌలు రేట్లు పెంచేశారు. గతంలో ఎకరానికి 24 బస్తాలు (రెండు పంటలకు కలిపి) ఉండే కౌలు ఇప్పుడు 32 నుంచి 34 బస్తాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అధికారిక గణాం కాల్లో తగ్గిన విస్తీర్ణం చూపించడం లేదు. గతంలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందో ఇప్పుడూ అంతే చూపిస్తున్నారు. వాస్తవానికి దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి కూడా పెరగాలి. అయితే, తగ్గిన విస్తీర్ణాన్ని చూపించకుండా అధికారులు పాత లెక్కలతోనే సరిపెడతున్నారు. డెల్టా పరిరక్షణకు నడుం కట్టాలి ఏటా పెరుగుతున్న అక్రమ చెరువుల కారణంగా డెల్టాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తిండి గింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
ఆక్వా రైతులపై సిండ్‘కాటు’
- కీలక కౌంట్ ధరల తగ్గింపు - లబోదిబోమంటున్న రైతులు అమలాపురం : ఆక్వా ధరలు మరోసారి దారుణంగా పడిపోయాయి. కీలక కౌంట్ ధరలు నెల రోజుల వ్యవధిలో కేజీకి రూ.50 నుంచి 120 వరకు పడిపోవడంతో రైతులు కుదేవుతున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి మరోసారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లుగా కాసులు కురిపిస్తున్న వెనామీ సాగు ఈ ఏడాది రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన ఊరూపేరూ లేని హేచరీల్లో నాణ్యత లేని సీడ్ వల్ల కొంత వరకు చెరువులు దెబ్బతినగా, మిగిలిన చెరువుల పట్టుబడి సమయానికి దగ్గరకు వచ్చే సరికి వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించి వేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో రొయ్యలు సహజసిద్ధంగా చనిపోతున్నాయి. దీనికితోడు డీవో (డెడ్ ఆక్సిజన్) కారణంగా వందలాది ఎకరాల చెరువుల్లో రొయ్యలు మరణిస్తున్నాయి. ఆందోళనతో ఉన్న రైతులు పట్టుబడులు ఆరంభించారు. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేటయ్యారు. ఎక్కువుగా వస్తున్న కౌంట్లను చూసి వాటి ధరలను ఆమాంతంగా తగ్గించేశారు. కొనుగోలుదారులు రేట్లు తగ్గుతున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయడంతో రైతులు ముందస్తు పట్టుబడులకు వెళుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువుగా 40 కౌంట్ (కేజీకి 40 రొయ్యలు) నుంచి 80 కౌంట్ వరకు వస్తున్నాయి. దీంతో ఈ కౌంట్ ధరలను గుణనీయంగా తగ్గించి వేశారు. 40 కౌంట్ ధర కేజీకి రూ.70, 43 నుంచి 50 కౌంట్ ధర రూ.120, 60 కౌంట్ ధర రూ.110, 63 నుంచి 70 కౌంట్ ధర రూ.90, 73 నుంచి 80 కౌంట్ ధర రూ.70 చొప్పున తగ్గించేశారు. వీటితోపాటు 83 నుంచి 90 కౌంట్ ధర రూ.50, 100 కౌంట్ ధర రూ.30 చొప్పున తగ్గించి రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. ధరలు తగ్గించే విషయంలో కొనుగోలుదారులు ఒకే మాట, ఒకే ధర అన్నట్టుగా సిండికేటు కావడంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 50 కౌంట్ ధర రూ.120 తగ్గడంతో రైతులు ఎకరాకు సగటున దిగుబడిగా వచ్చే రెండు టన్నుల రొయ్యల ఉత్పత్తిపై రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా. ఇటీవల కాలంలో వెనామీ సాగు వైపు రెతులు ఎక్కువగా మొగ్గు చూపడంతో చెరువుల లీజుల ధరలు, సీడ్, మేత ధరలతోపాటు కూలి ధరలు భారీగా పెరిగాయి. చివరకు వేసవి సీజన్ కావడంతో రూ.200 ఉండే క్యాన్ ఐస్ ధర ప్రస్తుతం రూ.400ల నుంచి రూ. 500 వరకు పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం పైగా పెట్టుబడి పెరిగిందని అంచనా. ఈ సమయంలో వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడంతో పంటపండినా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. కౌంట్ గత నెల 25న తాజాగా 20 కౌంట్ 640 640 25 కౌంట్ 540 540 30 కౌంట్ 530 460 40 కౌంట్ 430 360 42 కౌంట్ 410 340 43 నుంచి 50 కౌంట్ 380 260 60 కౌంట్ 350 240 63 నుంచి 70 కౌంట్ 320 230 73 నుంచి 80 కౌంట్ 290 220 83 నుంచి 90 కౌంట్ 260 210 93 నుంచి 100 కౌంట్ 230 200 -
రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి
‘ఆక్వా’పై సీపీఎం ప్రచారోద్యమం: సీపీఎం నేత మధు సాక్షి, అమరావతి: పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన రొయ్యలు, చేపల చెరువులను ధ్వంసం చేయాలని సీపీఎం పిలుపిచ్చింది. ఆక్వా సాగుతో ముంచుకొస్తున్న ముప్పును ప్రజలకు వివరించేందుకు త్వరలో 10 రోజుల పాటు ప్రచారోద్యమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగవుతున్న చేపలు, రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోకుంటే సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు వేస్తామని హెచ్చరించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 22 దేశాలు రొయ్యల సాగును నిషేధిస్తే చంద్రబాబు మాత్రం ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా సాగు వల్ల మంచినీటి కొరత, కాలుష్యం, నివసించలేనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. అలాగే కోనసీమలో కొబ్బరి తోటలు, పాడి పరిశ్రమ, వరి సాగు నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా సీఎం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
ఆక్వా లాబ్స్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కాట్రేనికోన (ముమ్మిడివరం) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆక్వా ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ప్రిన్సిపాల్ పి.కోటేశ్వరరావు అన్నారు. ఆక్వా ల్యాబ్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ల్యాబ్‌లను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్ రిజిస్ట్రేషన్ బృందం సభ్యులు ఆదివారం విస్తృతంగా పర్యటించారు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, అమలాపురం, కాట్రేనికోనలో పలు ఆక్వా ల్యాబ్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఆక్వా ల్యాబ్ జీఓ నెం.49 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్స్ ఎస్‌ఐఎఫ్‌టీ నోడల్ కేంద్రంగా పనిచేస్తాయన్నారు. నెట్ వర్కింగ్ ల్యాబ్ అనుసంధానంతో ల్యాబ్స్ నెల వారీ రిపోర్టింగ్, డీసీజ్ సర్వేలైన్స్ (వ్యాధులపై పర్యవేక్షణ, నిఘా), ల్యాబ్ సిబ్బంది రైతులకు అందిస్తున్న సేవలు, మొబైల్ ఆక్వా ల్యాబ్‌ల పనితీరుపై నిఘా ఉంటుంది. ప్రభుత్వ, ఫ్రైవేట్ ఆక్వా ల్యాబ్‌లు ఒక గొడుగు కిందకు తీసుకుని రావడంతో వివిధ ప్రాంతాలలో విజృంభిస్తున్న వ్యాధులపై పర్యవేక్షణ–నిఘా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తూర్పుగోవారి జిల్లాలో 10, పశ్చిమ గోదావరిలో 35, కృష్ణాజిల్లా 39, గుటూరు 8, ప్రకాశం 12, నెల్లూరు 27, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 3 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయన్నారు. అనంతరం పల్లంలో బాక్స్ కల్చర్ విధానంపై మత్స్యశాఖ చేపడుతున్న పీతల కల్చరును పరిశీలించారు. ఈ బృందంలో కాకినాడ, అమలాపురం మత్స్యశాఖ డీడీలు రామ్మోహనరావు, జయరావు, ఏడి రామచంద్రరావు, శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త సందీప్, ఎస్‌ఐఎఫ్‌టీ మైక్రోబయాలజీ ల్యాబ్ ఎఫ్డీఓ షేక్ దిల్షాద్ తదితరులు ఉన్నారు. -
నేరపూరిత నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు కార్మికుల మరణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనంద్ ఆక్వా ఇండస్ట్రీస్ యాజమాన్యం బాధ్యత వహించాలని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ నాయకత్వంలోని జాతీయ ప్రజా ఉద్యమాల సంఘటన (ఎన్ఏపీఎం) నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ, యాజమాన్యాల నేరపూరిత నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలి గొన్నదని నిగ్గు తేల్చింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆనంద్ ఆక్వా పరిశ్రమను మూసివేయాలని కోరింది. మొగల్తూరు నల్లంవారితోట గ్రామంలోని ఆనంద ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువులు వెలువడి ఐదుగురు మరణించిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాజిక సేవా కార్యకర్తలు రామకృష్ణంరాజు, మీరా సంఘమిత్ర, విమల, బాబ్జీ, రాజేష్ తదితరులు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి వాస్తవాలను పరిశీలించారు. మే«థాపాట్కర్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌కు చెందిన అరుణ్‌రాయ్, శంకర్‌సింగ్, ప్రఫుల్లా సమాంతర (లోక్‌శక్తి అభియాన్), బినాయక్ సేన్, సందీప్ పాండే, గీతా రామకృష్ణన్, మీరా సంఘమిత్ర సహా 25 మంది సేవా సంస్థల కార్యకర్తల సంతకాలతో కూడిన నిజనిర్ధారణ నివేదికను గురువారం మీడియాకు విడుదల చేశారు. వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. l2012లో నల్లంవారి తోటలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ కాలుష్యంతో ఇప్పటికే పది కుటుంబాలు (మొత్తం ఉన్నదే 60 కుటుంబాలు) గ్రామాన్ని వదిలివెళ్లాయి. కొంతమంది గ్రామస్తులు భూముల్ని అమ్ముకున్నారు. lగ్రామస్తుల ఫిర్యాదు మేరకు నెల క్రితం సబ్ కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించి వ్యర్థాల నిర్వహణకు ఒక ట్యాంకును నిర్మించాలి్సందిగా హెచ్చరించి వెళ్లారు. ఇప్పటివరకు ట్యాంకు నిర్మించలేదు. lయాజమాన్యానికి అధికార పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇలాంటి 8 ఫ్యాక్టరీలు నిర్వహిస్తోంది. ఈ కారణంగానే సబ్ కలెక్టర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే ఐదుగురు కార్మికుల్ని బలిగొంది. lఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే గొంతేరు కాలువలోకి వదలడం వల్ల వేలాది మంది జీవనోపాధికి ప్రమాదం ఏర్పడింది. యాజమాన్యం మాత్రం లాభాలను దండుకుంటోంది. డిమాండ్లు ఇవీ lఐదుగురు మృతి ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. lఆనంద్ గ్రూపు నడుపుతున్న సంస్థల్లో కాలుష్య స్థాయిని నిర్ధారించేందుకు పర్యావరణ, విద్యావేత్తలు, సేవా కార్యకర్తలు, న్యాయకోవిదులు, అధికారులతో నిపుణుల కమిటీని నియమించాలి. lగొంతేరు కాలువలోకి వ్యర్థాలు వదలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. lతుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం ఆపేయాలి. -
ఆక్వా ప్రకంపన
నరసాపురం/మొగల్తూరు : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో పుట్టుకొచ్చిన కాలుష్య భూతం ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మరోవైపు ఈ అంశం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుంటే.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. మరోవైపు చిన్నపాటి ప్లాంట్ నుంచి వెలువడిన కాలుష్యమే ఏకంగా ఐదుగుర్ని పొట్టన పెట్టుకుంటే.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల తలెత్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తించాలని.. తక్షణమే ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకోవైపు మొగల్తూరు ఘటనలో మృతిచెందిన వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఐదుగురు యువకుల్ని మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్ పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వీరి మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపించి హుటాహుటిన గ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చిమరీ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించారు. మృతుల ఇళ్ల ఇళ్లవద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ ఇళ్ల వద్ద శుక్రవారం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు, మొగల్తూరు మండలం పోతులవారి మెరకకు చెందిన తోట శ్రీనివాస్‌లకు చంటిబిడ్డలు ఉన్నారు. బొడ్డు రాంబాబు (మెట్టిరేవు), నల్లం ఏడుకొండలు (నల్లంవారి తోట), జక్కంశెట్టి ప్రవీణ్ (కాళీపట్నం)లకు వివాహాలు కాలేదు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల బాధ్యతలు మొత్తం వీరే చూస్తున్నారు. మృతులు ఐదుగురూ తమ కుటుంబాలను వారి భుజాలపై మోస్తున్నవారే. మృతుల కుటుం బాల్లో ఏ ఇంటికి వెళ్లినా వారి రోదనలు, ఆవేదనల్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అన్నెంపున్నెం ఎరుగుని వీరంతా.. స్వార్థం కోసం, సంపాదన కోసం పెద్దలు చేసిన ద్రోహానికి బలైపోయారని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు. ఇంటింటా ఇదే చర్చ సముద్రం.. గోదావరి.. పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామాల్లోని వాతావరణాన్ని ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్లక్ష్యం పూర్తిగా మార్చేసింది. ఐదుగురు యువకుల మృతితో మొగల్తూరు మండలంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకోలేదు. అందరిలో ఒకటే భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. విషవాయువు రావడం ఏమిటి, మనుషులు చనిపోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘోరం తామెప్పుడూ వినలేదని చెబుతున్నారు. ఎవరిని కదిపినా భవిష్యత్‌లో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ఆవేదన చెందుతున్నారు. ఆనంద ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని కాలుష్యకారక ప్లాంట్లను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల ఇళ్లవద్దా బూట్ల చప్పుళ్లే మొగల్తూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య భీతావహ వాతావరణం నెలకొంది. గురువా రం నాటి ఘోర ఘటన నేపథ్యంలో మొగల్తూరు పరిసరాల్లో భారీస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వడం లేదు. ప్రమాదానికి కారణమైన ఆనంద ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. గేట్లకు ఎలాంటి సీళ్లు వేయలేదు. గేట్లు మూసేసి, కాపలాగా భారీ బందోబస్తు పెట్టారు. పెనుగొండ సీఐ రామారావు నేతృత్వలో 100 మంది కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. తుందుర్రును మరిపించే విధంగా పోలీస్ బందోబస్తు నల్లంవారి తోటలోనూ కొనసాగుతోంది. ఫ్యాక్టరీకి వెళ్లేదారుల్లోనూ, మండలంలోని ముఖ్యమైన గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు జీప్లను నిలిపి నిఘా ఉంచారు. నిజానికి ప్రమాదం జరిగిన గురువారం సాయంత్రం వరకూ మాత్రమే ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన తరువాత అంతా ప్రశాంతంగానే ఉంది. ఆప్తులను కోల్పోయి మృతుల కుటంబాలవారు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పోలీసుల చర్యలు పచ్చని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. -
అడుగడుగునా ఆంక్షల కత్తి
భీమవరం: తుందుర్రు అంటే ఉలికి పడుతున్న ప్రభుత్వం.. ఆక్వా ఫుడ్‌పార్క్ పేరెత్తితే ఆగమేఘాలపై రంగంలోకి దిగుతున్న పోలీసులు.. అరెస్టులు, నిర్బంధాలు షరా మామూలైపోయాయి. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న కాలుష్య కారక గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా దాదాపు 40 గ్రామాల ప్రజల పోరాటం చేసూ్తనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌పార్క్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసేలా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలిసి వినతిపత్రం అందించాలని సోమవారం అమరావతి వెళ్లిన సీపీఎం, పోరాట కమిటీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరోసారి పో రాటంపై అక్కసు వెళ్లగక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుందుర్రులో గోదావరి మెగా ఫుడ్‌పార్క్ వల్ల కలిగే అనర్థాలను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు వివరించేందుకు సీపీఎం నాయకులు వి.ఉమామహేశ్వరరా వు, జేఎన్వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ ముందుగా అసెంబ్లీ గేట్‌పాస్‌లు తీసుకున్నారు. దీనికిగాను సోమవారం అనుమతి లభించింది. గేట్పాస్తో పాటు వినతిపత్రాన్ని తీసుకుని బ యలుదేరిన వారిని అసెంబ్లీలోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదేమని ప్రశ్నించగా అసెంబ్లీలో ఎటువంటి వినతిపత్రాలు ఇవ్వడానికి అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. వినతిపత్రాన్ని మీకే ఇచ్చేస్తామని పాస్‌లు ఉన్నందును తమను లోనికి అనుమతించాలని సీపీఎం, పోరాట కమిటీ నాయకులు పోలీసులను కోరారు. అయినా వినిపించుకోకుండా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారని గోపాలన్ చెప్పారు. సాయంత్రం ఐదు గంటల వరకు స్టేషన్లో నిర్బంధించి సొంత పూచీకత్తులతో విడుదల చేశారని తెలియజేశారు. అసెం బ్లీలో ప్రవేశించేందుకు పాస్‌లు ఇచ్చినా పోలీసులు వ్యవహించిన తీరు బాధాకరమని గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. తుందుర్రు అంటేనే ప్రభుత్వం ఉలికిపాటుకు గురవుతుందని వేలాదిమంది ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అధికారికంగా పాస్‌లు పొందినా అనుమతించకపోవ డం చూస్తుంటే ప్రజలపై పాలకులకు ఉ న్న శ్రద్ధ తేటతెల్లమవుతోందని గోపాలన్ విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లపై నిరసన గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని నిలుపుదల చేయా లని కోరుతూ రాజధాని అమరావతి వెళ్లిన పోరాట కమిటీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణం లోని మెంటేవారితోటలోని సీపీఎం కా ర్యాలయం నుంచి ప్రదర్శనగా పోలీస్ బొమ్మ సెంటర్ మీదుగా ప్రకాశం చౌక్ కు చేరుకుని నిరసన తెలిపారు. సీపీఎం ఆక్వాఫుడ్ పార్కు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాట కమిటీ, సీపీఎం నేతలు అసెంబ్లీ వద్దకు వెళ్లారని పట్టణ కార్యదర్శి బీవీ వర్మ అన్నారు. ఇందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నా పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. సమస్య వినేం దుకు పిలిచి అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. నిరసనలో చేబోలు సత్యనారాయణ, ఎం.వైకుంఠరావు, చెల్లబో యిన వెంకటేశ్వరరావు, కె.అప్పన్న, ఎన్.రాము తదితరులు పాల్గొన్నారు. -
కడితే..కాష్టమే
భీమవరం :తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు హెచ్చరించారు. పచ్చని పొలాలు, జనావాసాల మధ్య నిర్మి స్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సముద్ర తీరానికి తరలించేంత వరకు రాజీలేని పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి కడవరకూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీపీఎం, వైఎస్సార్ సీపీ, సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ), ఫార్వార్డ్ బ్లాక్, జనసేన, పౌరహక్కుల సం ఘం, దళిత సంఘ నాయకులు, పర్యావరణ వేత్తలతో కూడిన బృందం మంగళవారం తుందుర్రు, కంసాలి బేతపూడి, ముత్యాలపల్లి గ్రామాల్లో పర్యటించింది. ఆ మూడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో అఖిలపక్ష నేతలు మాట్లాడారు. ప్రజాభీష్టానికి వ్యతి రేకంగా.. పోలీసులను ప్రయోగించి మహిళలపై నిరంకుశ దాడులు చేయిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మహిళలు ఉద్యమించటం ద్వారా విజయం సాధించారన్నారు. వారి పోరాట పటిమ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరికొంతకాలం ఉద్యమిస్తే ఆక్వా పార్క్ పునాదులు కదలడం ఖాయమన్నారు. కడవరకు పోరాడదాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు పొందటం ద్వారా ఇక్కడి మహిళలు ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమంలో తొలి విజయం సాధించారన్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని.. ఫ్యాక్టరీని సముద్ర తీర ప్రాంతానికి తరలించే వరకూ కొనసాగుతుందన్నారు. ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమానికి కడవరకు అండగా ఉంటామని ప్రకటించారు. వేలాది ఎకరాల్లో పంటలను, ప్రజారోగ్యాన్ని తుడిచిపెట్టే ఆక్వా పార్క్‌ను ఇక్కడ నిర్మించవద్దని ప్రజలంతా కోరుతున్నా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం, యాజమాన్యం వ్యవహరిస్తున్నాయన్నారు. ఆక్వా పార్క్ పునాదులు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, అప్పటివరకు ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని సూచిం చారు. బుడబుక్కల టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం కారణంగా జిల్లాలోని కాలుష్యకారకమైన అన్ని పరిశ్రమలకు ముప్పు వాటిల్లిందన్నారు. కాలుష్య నివారణకు త్వరలోనే భీమవరంలో నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు. ఇది స్వచ్ఛమైన పోరాటం ప్రముఖ పర్యావరణవేత్త ఎం.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సాగిస్తున్న స్వచ్ఛమైన పోరాటమని అభివర్ణించారు. గతంలో పర్యావరణం కంటే డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని.. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందనడానికి తుందుర్రు ఉద్యమమే ఉదాహరణ అన్నారు. విషం కక్కే ఫ్యాక్టరీలను జనావాసాల మధ్య పచ్చటి పొలాల్లో నిర్మించడం దారుణమన్నారు. ఆక్వా పార్క్ యాజమాన్యం కాలుష్య నియంత్రణకు ఎటువంటి హామీ పత్రాలు ఇవ్వకపోయినా ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలబడటాన్ని చూస్తే ప్రజాశ్రేయస్సుపై ప్రభుత్వానికున్న శ్రద్ధ ఏపాటిదో అవగతం అవుతోందన్నారు. ప్రభుత్వ దివాళాకోరుతనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమవరం పట్టణ శాఖ కన్వీనర్ కోడే యుగంధర్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ వద్దని ప్రజలు ఉద్యమం చేస్తుంటే.. ప్రజాధనాన్ని వెచ్చిస్తూ పోలీసులను ఫ్యాక్టరీకి కాపలా పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంసీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రజలు ఉద్యమిస్తుంటే అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు. అధికారులు సైతం ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా వారిపై కేసులు బనాయించడం దారుణమని విమర్శించారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎ¯ŒS.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆక్వా పార్క్ నిర్మాణం వద్దం టున్న ప్రజలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్రమ అనుమతులిచ్చిన మంత్రులపైన, అధికారులపైన కేసులు పెట్టాలన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పచ్చటి పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమానికి అందరి మద్దతు ఉంటుందన్నారు. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకుడు సురేష్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ నిర్మాణాన్ని 99 శాతం ప్రజలు వద్దంటుంటే ప్రభుత్వం, యాజమాన్యం మొండిగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు సుందరరామరాజు మాట్లాడుతూ వ్యవసాయ జోన్లో విషం కక్కే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జనజీవనంతో చెలగాటమాడటం దారుణమన్నారు. దళిత సంఘం నాయకుడు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కూలీలు, ప్రజలు పడుతున్న కష్టాలు తుందుర్రు ప్రాంత ప్రజలకు తప్పలేదన్నారు. ఇక్కడి ఉద్యమాన్ని తాము కూడా స్ఫూర్తిగా తీసుకుంటామని మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ సభలకు పెద్దఎత్తున హాజరైన మహిళలు, విద్యార్థులు ఆక్వాపార్క్ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, డివిజన్ నాయకుడు జేఎన్వీ గోపాలన్, రైతు సంఘం నాయకుడు ఎం.నాగరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు తిరుమాని ఏడుకొండలు, పేరిచర్ల సత్యనారాయణరాజు, ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, ఆక్వాపార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులు, జవ్వాది సత్యనారాయణ, బీవీ వర్మ పాల్గొన్నారు. -
ఇంకా ఆంక్షల మధ్యే..
భీమవరం : భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ను సడలించలేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదేమైనా సరే.. తమ ప్రాణాలు పోయినా ఆక్వా పార్క్‌ను నిర్మించనీయబోమని కరాకండీగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలపక్షనాయకులు బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు భీమవరం మండలం తుందుర్రుతోపాటు నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాలిబేతపూడి, శేరేపాలెం, ముత్యాలపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రజల గోడు వినేందుకు తాము వెళ్తున్నామని, అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీలకు వినతిపత్రాలు ఇచ్చారు. గ్రామాల్లో శాంతియుతంగా పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల వారికి కలిగే ఇబ్బందులు తెలుసుకుంటామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావుండదని అధికారులకు విన్నవించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో హడల్ ఈనెల 8న ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాటకవిుటీ, సీపీఎం సిద్ధం కాగా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం పెద్దఎత్తును పోలీసు బలగాలను మోహరించి బాధితులపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కిన పోలీసుల దమనకాండ గుర్తుచేసుకుని ఇప్పటికీ బాధిత గ్రామ ప్రజలు హడలెత్తిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ధైర్యం నింపేందుకే.. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెసుకుని వారిలో ధైర్యం నింపేందుకు అఖిపక్షం నాయకులు సిద్ధమయ్యారు. 9న విజయవాడలో వివిధ పార్టీల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి ఈనెల 14న ఫుడ్‌పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఐదు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను తెలుసుకోనున్నారు. దీంతో తమ వద్దకు వచ్చే నాయకులకు తమ గోడు వినిపించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా గతంలో తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో పర్యటించిన పర్యావరణవేత్తల అభిప్రాయాలను, రొయ్యల ప్యాక్టరీ వల్ల తాగు, సాగునీటి ఇబ్బందులు, వాతావరణ కాలుష్యం వంటి అంశాల గురించి ప్రముఖులు చెప్పిన వివరాలను అఖిలపక్ష బృందానికి తెలియజేయాలని నిశ్చయంచుకున్నారు. సర్కారుపై ఆగ్రహం ఇదిలా ఉంటే ఫుడ్‌పార్క్ వల్ల తలెత్తే నష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంపై బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ వల్ల గ్రామాల్లోని మంచినీటి చెరువులు, గొంతేరు డ్రెయిన్ కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొంతేరు డ్రెయిన్‌లో సహజసిద్ధంగా పెరిగే మత్స్యసంపద హరించుకుపోతోందని, దీనివల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సర్కారుకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా.. మొండిగా ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఫుడ్‌పార్క్ కలుషిత నీరు చుక్క కూడా బయటకు రాదని, ఫ్యాక్టరీ ఆవరణలో ఆ నీటితో మొక్కలు పెంపకం చేపడతామని యాజమాన్యం చెప్పగా, ఉద్యమం తీవ్రరూపం దాల్చిన తర్వాత కలుషిత జలాలను సముద్రంలో కలిపేలా ప్రత్యేకంగా పైప్‌లైన్ వేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కలుషిత నీరు రాదని చెప్పి.. ఇప్పుడు పైపులైన్లు ఎలా వేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు తమ గోడు విని ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. -
దైన్యాగారం
ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమడెల్టా దైన్యాగారంగా మారుతోంది. వరి విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతోంది. చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం చాపకింద నీరులా పెరుగుతోంది. ఫలితంగా జిల్లాలో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచిఉంది. చెరువుల జోరుకు ఇప్పుడే కళ్లెం వేయకపోతే భవిష్యత్తులో వరిసాగు కనుమరుగైపోయే పెనుప్రమాదం పొంచి ఉంది. కొవ్వూరు : పశ్చిమడెల్టా ఆయకట్టు మొత్తం 5, 29, 962 ఎకరాలు. దీనిలో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాలు చెరువులుగా మారిపోయాయి. గత పదేళ్లుగా చెరువులపై మోజు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది కొత్తగా 11వేల ఎకరాలు చెరువులుగా మారినట్టు అధికారిక అంచనా. ఈ లెక్క వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటుంది. కొందరు అధిక లాభాల ఆశచూపి రైతుల చేత చెరువులు తవ్వించేస్తున్నారు. దీనివల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆహార భద్రత కొరవడడంతోపాటు కాలుష్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో చేపలు, రొయ్యల చెరువులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలూ కలుషితమైపోయాయి. పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి. సాగునీటి దోపిడీ చేపల చెరువులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల సాగునీటి దోపిడీ కూడా పెరిగింది. పశ్చిమడెల్టా కాలువల నుంచి ప్రధానంగా సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత చేపల చెరువులకు నీరు తోడుకోవచ్చు. కానీ చేపల చెరువుల యజమానులు విచ్చలవిడిగా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. పంట కాలువల నుంచి యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. పెను నీటి ఎద్దడి దీనివల్ల వరి సాగుకు, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ఈ ఏడాది సాగునీటి ఎద్దడితోపాటు మంచినీటి చెరువులనూ నింపుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో వరిచేలు బీటలు వారుతున్నాయి. మంచినీటి చెరువులు వెలవెలబోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అర్రులుచాస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. కాలుష్యపు కాట్లు చేపల చెరువుల తవ్వకంలో యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. వాస్తవానికి చేపల చెరువులు తవ్వాలంటే పంట కాలువలకు మూడు మీటర్లు దూరం పాటించాలి. విధిగా ఇన్లెట్, అవుట్లెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. కానీ యజమానులు ఈ నిబంధనలు పాటించడం లేదు. పంటకాలువల గట్లను ఆనుకుని చెరువులను తవ్వేస్తున్నారు. ఇ¯Œలెట్, అవుట్లెట్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పంట కాలువల నుంచి నీటిని యథేచ్ఛగా తోడుకుంటూ చెరువుల్లోని వ్యర్థ ఉప్పనీటిని పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ నీరు పొలాల్లోకి చేరడంతో చేలు చౌడుబారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం భీమవరం : చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రజాప్రతినిధులే ప్రోత్సాహం అదిస్తున్నారు. చెరువుల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భీమవరం, ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే కాక వారి అనుచరులు, సహాయకులు కూడా చెరువుల తవ్వకం పేరిట భారీగా లాభపడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే చెరువులకు అనుమతులు ఇప్పించి లాభపడడాన్ని దగ్గరుండి చూసిన అతని సహాయకుడూ అదే బాట పట్టాడు. అతను చెరువులకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.రెండుకోట్ల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల డెల్టాలో చెరువుల తవ్వకాన్ని ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేయడం ఆ సహాయకునికి వరంగా మారింది. చెరువుల తవ్వకానికి ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.40వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే సిఫార్సు పేరుతో అనుమతులివ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎట్టకేలకు ఎమ్మెల్యే చెవిన పడడంతో ఆ సహాయకుడిని ఆయన విధుల నుంచి తప్పించినట్టు ప్రచారం జరగుతోంది. నిబంధనల సడలింపు వల్లే.. చెరువులకు అనుమతుల విషయంలో నిబంధనల సడలించడం వల్ల తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో చెరువు తవ్వాలంటే రెవెన్యూ, నీటిపారుదలశాఖ, మత్స్యశాఖ తదితర 13 శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉండేది. దీంతో పంటభూములు చెరువులుగా మారాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే 2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెరువుల తవ్వకానికి అనుమతులను సరళతరం చేసింది. దీంతో చెరువుల తవ్వకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో ఎక్కడా రొయ్యల సాగుకు అనుమతి లేదు. అయినా అక్రమార్కులు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు చేపట్టేస్తున్నారు. చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యల సాగు చేపడుతున్నారు. చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల సాగు వల్లే జల కాలుష్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా స్వరూపం ఇదీ.. జిల్లాలో పశ్చిమడెల్టా 29 మండలాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో డెల్టా ప్రధాన కాలువతో కలిపి 357 కిలోమీటర్ల పొడవున 11 కాలువలు ఉన్నాయి. పంపిణీ కాలువలు 1,766 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నాలుగు సబ్డివిజన్లలో 19 సెక్షన్ల పరిధిలో ఆయకట్టు ఉంది. నీటి పారుదల కోసం ప్రాజెక్టు కమిటీతోపాటు 20 పంపిణీ కమిటీలు, 131 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. -
ఆక్వా చెరువులతో మానవ విధ్వంసం
చంద్రబాబు వచ్చాకే విచ్చలవిడితనం త్వరలో ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అమలాపురం రూరల్/ అల్లవరం/ ఉప్పలగుప్తం : ఆక్వాసాగు కోనసీమ మానవ మనుగడను ప్రశ్నార్థ్ధకం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి బాబు సర్కారే కారణమని ఆయన విమర్శిం చారు. అక్రమ సా గును ప్రోత్సహిస్తున్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ ఆక్వాసాగు పరిశీలనకు కోనసీమలో బుధవారం ఆయన రాజోలు, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆక్వాసాగును ప్రపంచ దేశాలు నిషేధిస్తున్నాయని, మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో నిషేధముందని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాక ఆక్వా సాగుకు తలుపులు బార్లా తెరిచారని, ఆక్వా హబ్ పేరుతో విలువైన మాగాణి భూములను బీళ్లుగా మార్చి అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఈ సాగు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవుపెట్టారు. గూడాలలో మహిళలు మాట్లాడుతూ అక్రమ చెరువులను అడ్డుకున్నవారిపై అక్రమంగా కేసులు పెట్టి భయపెడుతున్నారని, 11 మందిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టి తవ్వకాలు సాగించారని వివరించారు. ఉప్పలగుప్తం మండలం శింగరాయపాలెంలో మహిళలు, స్థానికులు ఆక్వా సాగు వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. అమలాపురం మండలంలో తాండవపల్లి, వన్నెచింతలపూడి, భట్నవిల్లిలో బాధితులతో ఆయన మాట్లాడారు. కోర్టు స్టే ఇచ్చినా కూడా చెరువు తవ్వకాలు ఆపడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. మధు వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్.రమణి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వసంతకుమార్, ఆ పార్టీ నాయకులు ఉడుపూడి రాఘవమ్మ, టి.నాగవరలక్ష్మి, భీమాల శ్రీను, వి.దొరబాబు, టి.ప్రసాద్, బి.వెంకట్రావులు పాల్గొన్నారు. -
సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 30నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు. క్రమంగా ఇలా ఆయకట్టు పరిధిలోని మొత్తం చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తుండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. ఉదాహరణలివిగో.. నిడమర్రు మండలంలోని నిడమర్రు, నరసింహపురం రెవెన్యూ గ్రామాల్లోని ఆయకట్టులో మెరక భూములను సైతం ఆక్వా మాఫియా వదిలి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇటీవల 163 ఎకరాల విస్తీర్ణంలో 6 భారీ చెరువులు తవ్వేశారు. నిడమర్రు–ఏలూరు రాష్రీ్టయ రహదారి పక్కనే గల బాడవ ఆయకట్టు పరిధిలోని పంట భూముల్లో చెరువులు తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం చెరువు తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేయలేదు. చెరువులు వద్దకు చేరుకునేందుకు వీలుగా రహదారి సైతం అధికారుల అండతో ఆక్వా మాఫియా సొంతంగా నిర్మించుకుంది. ఈ భూముల్ని లీజుకు తీసుకున్న వారే విద్యుత్ స్తంభాలు కూడా స్వయంగా పాతుకుంటున్నారు. చెరువులకు నీటి సదుపాయం నిమిత్తం మూడు మీటర్ల వెడల్పున కాలువల సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి అయినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. కనీసం దరఖాస్తు చేయలేదు... నిడమర్రు, నరసింహపురం ఆయకట్టులో 163 ఎకరాల్లో కొత్తగా చెరువులు తవ్వారు. ఆ తరువాత 65.89 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 7న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు నంబర్లు పీఆర్ఎఫ్ 011700018229, పీఆర్ఎఫ్ 011700018228, పీఆర్ఎఫ్ 01170018226 ద్వారా ఆన్లైన్లో పరిశీలిస్తుంటే ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు చూపిస్తోంది. పరిశీలన పూర్తికాకుండానే చెరువులు రెడీ అయిపోయాయి. మిగిలిన సుమారు 100 ఎకరాల్లో చెరువులకు సంబంధించి కనీసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చెయ్యలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినా.. అందులోనూ చెరువులు తవ్వేశారు. ముందు తవ్వకాలు.. ఆనక అనుమతులు లీజుదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ముందుగా చెరువులు తవ్వేస్తున్నారు. అ తర్వాత తాపీగా అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల మీసేవా కేంద్రం నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేసు దర్యాప్తు సమయంలో మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో అనధికార అనుమతులతో చెరువులు తవ్వేసినట్టు బహిర్గతమైంది. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో వరి ఆయకట్టు మాయమవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదు. ఇదో సిత్రం చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చే విషయంలో విచిత్రాలు బయటపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే.. ఎలాంటి విచారణ జరపకుండానే అనుమతి వచ్చేసింది. పైగా కలెక్టర్‌కు ప్రతినిధిగా పేర్కొంటూ తహసీల్దార్ డిజిటల్ సంతకం స్థానంలో తహసిల్దార్ సంతకంతో అనుమతి ఇచ్చేశారు. చేపల చెరువుల విషయంలో అధికారులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన పేరిచర్ల బంగారమ్మ, మరికొందరు కలిసి ఐదెకరాల పంట భూమిలో చేపల చెరువు తవ్వేందుకు అనుమతి కోరుతూ ఈనెల 13న నిడమర్రు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోరిన సాగుభూమిని అధికారులు కనీసం పరిశీలించకుండానే ఆన్లైన్లో అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రం వచ్చేసింది. ధ్రువీకరణ పత్రంపై విధిగా జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. ఆయన స్థానంలో నిడమర్రు తహసీల్దార్ పేరు కనిపిస్తోంది. ‘ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ’గా పేర్కొంటూ తహసీల్దార్ ఎం.సుందరరాజు పేరిట ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అంటే తహసీల్దార్ అనుమతి ఉంటే చెరువులు తవ్వేసుకోవచ్చన్నమాట. ఏపీ మీ సేవా పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘చెక్ మీ సేవా సర్టిఫికెట్’ అనే కాలమ్ దరఖాస్తు సంఖ్య పీఆర్ఎఫ్011700018461 నమోదు చెయ్యగానే ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఈ విధంగా ఆన్లైన్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ప్రత్యక్షం అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
మొబైల్ ఆక్వా ల్యాబ్ సేవల్ని వినియోగించుకోవాలి
‘సిఫ్ట్’ ఎఫ్డీఓ డాక్టర్ విజయభారతి నేడు కాట్రేనికోన మండలంలో పరీక్షలు కాట్రేనికోన : మత్స్య పరిశ్రమ అ«భివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ ఆక్వా సేవలను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఎఫ్డీఓ డాక్టర్ టి. విజయభారతి సూచించారు. ఆక్వా చెరువుల వద్దే మొబైల్ ఆక్వా ల్యాబ్‌లో నామమాత్రపు రుసుంతో మట్టి, నీటి నాణ్యత, బాక్టీరియా పరీక్షలు చేసి నివేదికలను రైతులకు అందిస్తామన్నారు. విజయభారతి బృందం గురువారం కాట్రేనికోన మండల కేంద్రంలో నడవపల్లి, కందికుప్ప, కాట్రేనికోన తదితర గ్రామాలలో మొబైల్ ఆక్వా సేవలు అందిస్తారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులు చెరువు నీటిని మొబైల్ లాబ్‌కు తీసుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. -
ఆన్లైన్, చేపల చెరువులు, అనుమతులు
విజయవాడ (గుణదల): జిల్లాలో 505 మందికి చేపల చెరువులకు అనుమతులు ఇచ్చామని కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి మత్యశాఖ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఏ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా, మత్య్స రంగాలను ప్రోత్సహించే దిశగా చేపల చెరువుల అనుమతులను ఇస్తున్నామని చెప్పారు. చేపల చెరువుల దర ఖాస్తులను డివిజన్ స్థాయిలో అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అనుమతులు జారీ చేసిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని, ఇకపై నిర్వహించే ప్రక్రియలు మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను డివిజన్ స్థాయి అధికారులు సిఫార్సు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ కార్యదర్శికి లేఖ రాశామని తెలిపారు. ఫిషరీస్ డీడీ కోటేశ్వరరావు, ఏడీ జయరావు, రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యం
కైకలూరు : ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక సీఎన్నార్ గార్డెన్లో శనివారం 12వ ఆక్వా టెక్ ఎక్స్ఫో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ ఆక్వా మందులు, యంత్ర పరికరాల తయారీ కంపెనీలు 50 స్టాల్స్‌లో ఉత్పత్తులను ప్రదర్శించాయి. కైకలూరు ఆక్వా మందుల దుకాణదారులు ఏర్పాటు చేసిన చేప వంటకాలు ఆకట్టుకున్నాయి. మంత్రి రవీంద్ర స్టాల్స్‌ను పరిశీలించారు. ఆక్వా టెక్ చీఫ్ ఎడిటర్ కోనా జోసఫ్ ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల రైతులతో సమీక్ష జరిపారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చేపల రైతులకు రెండు హెక్టార్లకు రూ.3.75కే విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ జలాల కారణంగా కొల్లేరు సరస్సులో సహజసిద్ధ చేపలు మరణిస్తున్నాయన్నారు. రిజర్వాయర్లలో విడిచిపెట్టే చేప పిల్లల టెండర్లలో అవినీతిని అరికట్టాలని మంత్రిని కోరారు. అంతకు ముందు జరిగిన ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని కోరారు. గుడివాడకు చెందిన రొయ్యల రైతు కనుమూరి భాస్కరరాజు, ముదినేపల్లికి చెందిన చేపల రైతు రావిశెట్టి హనుమంతరావులకు ఉత్తమ ఆక్వా రైతు అవార్డులను మంత్రి అందించారు. చీఫ్ ఆర్గనైజర్ జోసఫ్ మాట్లాడుతూ ఆక్వా టెక్ మాసపత్రిక ద్వారా చేపల రైతులకు విలువైన సమాచారం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్రామయ్య, కైకలూరు, మచిలీపట్నం జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి, లక్ష్మణప్రసాద్, ఎంపీపీ బండి సత్యవతి, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, సభ్యులు చింతపల్లి అంకినీడు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ వీరరాజరాజేశ్వరీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాజు, కైకలూరు సర్పంచ్ అప్పారావు, సీఐఎఫ్ఏ అధికారి గిరి, ప్రొఫెసర్ పి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
'పుడ్ పార్క్' నిర్మాణం పై ప్రజల వ్యతిరేకత
-
కోనసీమకు ఆక్వా మొబైల్ ల్యాబ్
అమలాపురం రూరల్:తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఆక్వా సాగు జరిగే కోనసీమలో త్వరలో ఆక్వా మెుబైల్ ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర మత్య్సశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ చెప్పారు. అమలాపురం క్షత్రియ కల్యాణమండపంలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఆక్వా సదస్సులో అమలాపురంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కమిషనర్‌ను కోరారు. ల్యాబ్ ఏర్పాటుకు ఎన్నో నిధులు, శాస్త్రవేత్తలు అవసరమని, ప్రస్తుతం తాత్కాలికంగా ఓ మెుబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి 104 మాదిరిగా అన్ని గ్రామాలకు ల్యాబ్ సౌకర్యాలు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సంచార ల్యాబ్ ఉదయం నుంచి రాత్రి వరకూ గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రొయ్యలు, చేపలు, పీతల పెంపకందారులు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆక్వా సాగుకు వరికి మాదిరిగానే సాగునీరిచ్చేలా ప్రభుత్వం ఇటీవల క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే వరి సాగుకు వాడగా మిగిలిన నీటినే ఆక్వా సాగుకు ఇస్తారని చెప్పారు. ఉప్పునీరు, మంచినీరు రొయ్యల పెంపకం రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాణ్యమైన విత్తనాలతోపాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయన్నారు. -
‘ఆక్వా’కు మంచిరోజులు
డబుల్ డిజిట్లో భాగంగా చెరువులు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు రైతులను మరింత ప్రోత్సహించాలని మత్స్యశాఖ నిర్ణయం దాదాపు వెయ్యి హెక్టార్లలో పునరుద్ధరణకు కసరత్తు ఒంగోలు టౌన్ : ఆక్వాకు ఊపిరిపోయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. గతంలో డాలర్ల వర్షం కురిపించిన పంటకు తిరిగి అదే వైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. డబుల్ డిజిట్లో భాగంగా గతంలో తవ్వి వదిలేసిన దాదాపు వెయ్యి హెక్టార్లలోని చెరువులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆక్వా రైతులను ఒక వేదికపైకి తీసుకువచ్చి సాగులో మెళకువలు అందించడంతోపాటు నాణ్యమైన దిగుబడి పొందే విధంగా సలహాలు, సూచనలు అందించి మరింత ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లోని చెరువులతోపాటు మంచినీటి చెరువుల్లో ఆక్వాను సాగుచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1990 దశకంలో ఆక్వా రంగం నీలి విప్లవంలా వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య పంటలను సాగు చేసేవారికంటే ఆక్వా చెరువులు ఉన్నవారు స్వల్ప కాలంలోనే ఆర్థికంగా బలపడ్డారు. ఆ సమయంలో ఎన్ని ఎకరాల మాగాణి భూమి ఉన్నాగానీ రెండుమూడు ఆక్వా చెరువులు ఉంటే చాలన్నట్లుగా ఆ సాగు ఫరిడవిల్లింది. ఒకరిని చూసి మరొకరు, ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం..ఇలా అంతా ఆక్వా చెరువుల మయమైంది. ఇబ్బడి ముబ్బడిగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తీరప్రాంత మండలాల్లో మెజార్టీ భాగం ఆక్వా చెరువులు ఉన్నాయి. చివరకు మంచినీటి వనరులున్నచోట కూడా ఒక్కసారిగా ఆక్వా చెరువులు వెలిశాయి. విదేశాల నుంచి అనూహ్యంగా ఆర్డర్లు రావడంతో ఇక్కడి రైతులకు డాలర్ల వర్షం కురిసింది. ఒకవైపు పెద్దమొత్తంలో ఆదాయం పొందుతున్నప్పటికీ, ఇంకోవైపు ఆక్వా చెరువులకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులు పెద్దగా దృష్టి సారించలేదు. విచ్చలవిడిగా చెరువులు తవ్వడం, ఉత్పత్తి అధికంగా రావాలన్న ఉద్దేశంతో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో ఒక్కసారిగా ఆక్వా రంగం కుదేలైంది. వైట్‘స్పాట్’... భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న రొయ్యల్లో వైట్‘స్పాట్’ ఉండటంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. వైట్‌స్పాట్ ఉన్న రొయ్యల్లో అధిక శాతం ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నవి కావడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో కొన్ని దేశాలు భారతదేశం నుంచి రొయ్యలు ఎగుమతి చేసుకునేందుకు పూర్తిగా నిరాకరించాయి. దాంతో ఆక్వా రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక మంది రైతులు ఆక్వా చెరువులను ఎక్కడికక్కడే వదిలేశారు. అనేక ప్రాంతాల్లో చెరువులు కొన్నేళ్లపాటు ఖాళీగా ఉన్నాయి. పరిమిత సంఖ్యలో ఆక్వా చెరువులు సాగుచేస్తూ రావడం, అదే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో క్రమంగా ఆక్వా రంగం కోలుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో డబుల్ డిజిట్ సాధించాలన్న ఉద్దేశంతో లక్ష్యాలు కేటాయించింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను విస్తృతంగా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో ఆక్వాకు పూర్వ వైభవం రానుంది. నేడు ఆక్వా రైతులకు అవగాహన సదస్సు జిల్లాలోని ఆక్వా రైతులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు పి.శ్రీహరి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ సదస్సులో కలెక్టర్ సుజాతశర్మ, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ పాల్గొంటారన్నారు. డబుల్ డిజిట్ సాధనలో భాగంగా జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత విస్తరింపజేసేందుకు వీలుగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత పరిధిలో, మంచినీటి చెరువుల పరిధిలో ఆక్వా సాగు చేస్తున్నవారు, గతంలో సాగుచేసి వదిలేసిన రైతులంతా హాజరుకావాలని ఆయన కోరారు. -
ప్రాథమికరంగ మిషన్‌కు ‘కృషి కేబినెట్’
వ్యవసాయ యాంత్రీకరణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు * రాష్ట్రంలో ఆక్వా, వాటర్ వర్సిటీలు.. వృద్ధిరేటు లక్ష్యం 18.2 శాతం * కలెక్టర్ల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రాథమికరంగ మిషన్‌కు దిశానిర్దేశం చేసేందుకు, నిధులు ఇతర సమస్యలు రాకుండా చూసేందుకు ‘కృషి కేబినెట్’ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పా రు. 18.2 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఈ కమిటీ వారానికోసారి సమావేశమవుతుందని తెలిపారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన ఈ మిషన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. ప్రాథమికరంగ మిషన్‌కు జిల్లాల్లో అదనపు జేసీలను ఇన్ఛార్జిలుగా నియమించామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2018-19 కల్లా పూర్తి చేస్తామని, కుడి కాలువ భూసేకరణకు రూ.700 కోట్లు రైతులకు పరిహారంగా ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడిన 65 శాతం జనాభా కోసమే ఈ మిషన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్రిశాట్, నాబార్డును కన్సల్టెన్సీగా నియమించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణను గ్రామా ల్లో రైతు మిత్ర, డ్వాక్రా సంఘాలకు అప్పగించి వారికి రుణాలు ఇప్పించి, రాయితీలు ఇస్తామని చెప్పారు. యాంత్రీకరణకు రూ.1600 నుంచి రూ.1700 ఖర్చవుతుందని, సంవత్సరానికి రూ.400 కోట్లు ఇస్తామన్నారు. లక్ష ట్యాబ్‌లు ఇవ్వాలనుకుని ఇప్పటికి 45 వేలు ఇచ్చామన్నారు. ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ఇవ్వనున్నామని, దీనికి రూ.4,900 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ-పాస్ ద్వారా కృష్ణా జిల్లాలోనే నెలకు రూ.10 కోట్లు ఆదా అవుతున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో దీన్ని అన్ని జిల్లాల్లో విస్తరిస్తామని తెలిపారు. రాయలసీమను అరటి హబ్‌గా తయారు చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్వా, వాటర్ యూనివర్సిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. మిషన్లు, గ్రిడ్ల గురించి జనానికి అర్థం కావడంలేదు.. ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ప్రజలకు అర్థం కావడంలేదని వాటి పేర్లు మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త పేర్లు సూచించాలని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌కు సూచించి ఇది ఆయనకు అగ్ని పరీక్ష అని చమత్కరించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నీరున్నా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ముంపును తట్టుకునే 1121 రకం వరి వంగడాన్ని ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఎరువులు, పురుగుమందుల అమ్మకాలను క్రమబద్ధీకరించేందుకు ఆ షాపుల్లో ఈ-పాస్ అమలు చేయాలని సదస్సులో నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ టక్కర్ మిషన్ లక్ష్యాల గురించి వివరించగా, ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్పీ వాణి లక్ష్యాలు వాటి అమలు తీరుతెన్నుల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పలువురు మంత్రులు పాల్గొన్నారు. -
‘ఆక్వా’ అభివృద్ధికి ప్రత్యేక ఫిషరీస్ పాలసీ
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి సాక్షి, విజయవాడ: ఆక్వాతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఫిషరీస్ పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన ‘భారత్‌లో ఆక్వా హబ్‌గా ఆంధ్రప్రదేశ్’ సదస్సులో మంత్రి మాట్లాడారు. మత్స్యశాఖ ఉత్పత్తులను రూ.23 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెంచేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. మత్స్యశాఖ అభివృద్ధికి రూ.187 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. భీమవరం సమీపంలోని తుందుర్రులో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని వివరించారు. -
భారీ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా పవర్...
కంప్యూటర్ పరికరాల తయారీ సంస్థ ఇంటెక్స్ తాజాగా తన ఇంటెక్స్ ఆక్వా శ్రేణిలో శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్ ఒకదాన్ని విడుదల చేసింది. ఏకంగా 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న ఈ ఆక్వా పవర్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ కూడా పవర్‌ఫుల్లే. దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్‌ను వాడారు. స్క్రీన్ సైజు 5 అంగుళాలు కాగా, ర్యామ్ ఒక గిగాబైట్ వరకూ ఉంది. ప్రధాన కెమెరా ఆటోఫోకస్ సౌకర్యంతోపాటు 8 మెగాపిక్సెళ్ల సామర్థ్యంతో లభిస్తుంది. సెల్ఫీల కోసం ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా సామర్థ్యం రెండు మెగాపిక్సెళ్లు. ఫోన్ మెమరీ 8 గిగాబైట్లు ఉన్నప్పటికీ ఎస్డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ధర రూ.8499. -
ఆక్వా వ్యవసాయ హోదా : పుల్లారావు
కైకలూరు : ఆక్వా రంగానికి వ్యవసాయరంగంతో సమానంగా హోదా కల్పించడానికి కృషిచేస్తామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. స్థానిక సీఎన్నార్ గార్డెన్లో రాష్ట్ర చేపల రైతుల సంఘం ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మంత్రి పుల్లారావు, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 20 వేల మందికిపైగా ఆక్వారైతులు ఉన్నారని, ఈ రంగం నుంచి ప్రభుత్వానికి రూ.20 కోట్ల ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. చేపల ముడిసరుకులకు విధిస్తున్న 4 శాతం పన్ను తగ్గించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జూలై 13, 14 తేదీల్లో అటవి, పర్యావరణశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కొల్లేరు తీసుకొచ్చి సమస్యలను వివరిస్తానని ప్రకటించారు. ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆక్వా రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఫిషరీస్ కమిషనర్ జె.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం 8 మంది ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలుగా రూ.25 లక్షల చెక్కులను మంత్రులు అందించారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, రైతాంగ సమైఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, జిల్లా చేపల రైతు సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, డెల్టా ఫిష్పార్మర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రామచంద్రరాజు, జిల్లా మత్స్యశాఖ డీడీ కల్యాణం, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు. తెలుగు దేశం పార్టీ నాయకులు పలువురుపాల్గొన్నారు.