ఆన్‌లైన్, చేపల చెరువులు, అనుమతులు
ఆన్‌లైన్, చేపల చెరువులు, అనుమతులు
Published Fri, Sep 23 2016 10:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
విజయవాడ (గుణదల):
జిల్లాలో 505 మందికి చేపల చెరువులకు అనుమతులు ఇచ్చామని కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి మత్యశాఖ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఏ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా, మత్య్స రంగాలను ప్రోత్సహించే దిశగా చేపల చెరువుల అనుమతులను ఇస్తున్నామని చెప్పారు. చేపల చెరువుల దర ఖాస్తులను డివిజన్ స్థాయిలో అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అనుమతులు జారీ చేసిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, ఇకపై నిర్వహించే ప్రక్రియలు మొత్తం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను డివిజన్ స్థాయి అధికారులు సిఫార్సు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ కార్యదర్శికి లేఖ రాశామని తెలిపారు. ఫిషరీస్ డీడీ కోటేశ్వరరావు, ఏడీ జయరావు, రాఘవరెడ్డి పాల్గొన్నారు.
Advertisement