permissions must
-
న్యూ ఇయర్ ఈవెంట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఆదివారం పేర్కొన్నారు. ఈ నెల 21 (బుధవారం) లోపు దరఖాస్తు చేసుకుని పొందాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం కచి్చతమని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్దం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. అసభ్య వస్త్రధారణ, అభ్యంతరకరమైన నృత్యాలకు తావుండకూడదు. మాదకద్రవ్యాల వినియోగానికి నిర్వాహకులూ బాధ్యులవుతారని ఆనంద్ స్పష్టం చేశారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్ సౌకర్యం కలి్పంచాలి. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే లా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయి. కార్యక్రమం జరిగే చోటకు ఎలాంటి ఆయుధాలు అనుమతించ వద్దని ఆనంద్ పేర్కొన్నారు. -
సెబీ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన ప్రమోటర్ల వాటా కొనుగోలుకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అంటూ వార్తా చానళ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా స్పష్టం చేసింది. చెల్లించని రుణాలస్థానే ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ లిమిటెడ్‌లో వాటాను చేజిక్కించుకునేందుకు వీసీపీఎల్.. సెబీ అనుమతి పొందవలసి ఉన్నట్లు పేర్కొంది. 2020 నవంబర్ 27న కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్‌లను సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. తద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోలు, విక్రయం లేదా సెక్యూరిటీల మార్కెట్లలో ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ నిషేధం 2022 నవంబర్ 26న ముగియనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎన్డీటీవీ వివరించింది. దీంతో గడువుకంటే ముందుగానే ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరిగా తెలియజేసింది. మంగళవారం వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించిన విషయం విదితమే. వారెంట్ల నిబంధనలు కీలకం ఎన్డీటీవీ బలవంతపు టేకోవర్‌కు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలలో వారెంట్ల జారీలో చోటుచేసుకున్న నిబంధనలు కీలకంగా నిలవనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్‌నకు చెందిన వీసీపీఎల్ నుంచి వారెంట్ల జారీ ద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ గతంలో దాదాపు రూ. 404 కోట్ల రుణాలు పొందింది. వీటిని ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.9 శాతం వాటాను పొందినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. వెరసి ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమోటర్లకు ఈ విషయం తెలియదంటూ ఎన్డీటీవీ పేర్కొంది. దీంతో వారెంట్ల జారీలో అంగీకరించిన నిబంధనలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. రేటింగ్‌పై ఎఫెక్ట్... బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా భారీగా విస్తరిస్తోంది. అయితే రుణాల ద్వారా చేపడుతున్న ఈ కొనుగోళ్లు కంపెనీ రేటింగ్‌పై ఒత్తిడిని పెంచుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. 1988లో కమోడిటీల ట్రేడర్‌గా ప్రారంభమైన గ్రూప్ మైనింగ్, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు తదితర పలు రంగాలలో భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇటీవలే సిమెంట్ రంగంలో 10.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లకు తెరతీసింది. -
మత ఘర్షణలు.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
మత హింసకు సంబంధించిన ఘటనలు పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అప్రమత్తం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం శాంతి భద్రతల మీద ఉన్నతాధికారుల సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం యోగి. ఈద్, అక్షయ తృతీయ ఒకేరోజు వస్తున్న నేపథ్యం, వరుస పెట్టి పండుగలు ఉన్న కారణంతోనే అనుమతులు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే లౌడ్‌స్పీకర్ల ఉపయోగం.. ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతీఒక్కరికీ వాళ్ల వాళ్ల మతవిశ్వాసాలకు తగ్గట్లు ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత పోలీసులకూ ఉంటుంది. కాబట్టి, మతపరమైన సంస్థలు.. శాంతి, భద్రతలను పరిరక్షణలో భాగంగా ప్రతిజ్ఞ చేస్తూ.. ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాల్సిందే. అలాగే మత సంప్రదాయాలను అనుసరించి పండుగలకు మాత్రమే ఈ అనుమతులు ఉంటాయి. కొత్త కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని సీఎం యోగి.. పోలీస్ శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి, హానుమాన్ జయంతి శోభాయాత్రల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మత ఘర్షణలపై కేంద్రం మౌనంగా ఉండడాన్ని తప్పుబడుతూ.. 13 పార్టీలు ఈ అల్లర్ల వెనుక ఉన్నవాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్ జాగ్రత్త పడుతోంది. చదవండి: ఇది యూపీ.. ఏం జరిగిందో చూశారుగా! -
ఆన్లైన్, చేపల చెరువులు, అనుమతులు
విజయవాడ (గుణదల): జిల్లాలో 505 మందికి చేపల చెరువులకు అనుమతులు ఇచ్చామని కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి మత్యశాఖ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఏ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా, మత్య్స రంగాలను ప్రోత్సహించే దిశగా చేపల చెరువుల అనుమతులను ఇస్తున్నామని చెప్పారు. చేపల చెరువుల దర ఖాస్తులను డివిజన్ స్థాయిలో అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అనుమతులు జారీ చేసిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని, ఇకపై నిర్వహించే ప్రక్రియలు మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను డివిజన్ స్థాయి అధికారులు సిఫార్సు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ కార్యదర్శికి లేఖ రాశామని తెలిపారు. ఫిషరీస్ డీడీ కోటేశ్వరరావు, ఏడీ జయరావు, రాఘవరెడ్డి పాల్గొన్నారు.