భారీ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా పవర్... | INTEX AQUA heavy battery power | Sakshi
Sakshi News home page

భారీ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా పవర్...

Published Tue, Dec 2 2014 11:19 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

భారీ బ్యాటరీతో  ఇంటెక్స్ ఆక్వా పవర్... - Sakshi

భారీ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా పవర్...

కంప్యూటర్ పరికరాల తయారీ సంస్థ ఇంటెక్స్ తాజాగా తన ఇంటెక్స్ ఆక్వా శ్రేణిలో శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్ ఒకదాన్ని విడుదల చేసింది. ఏకంగా 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న ఈ ఆక్వా పవర్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ కూడా పవర్‌ఫుల్లే. దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్‌ను వాడారు. స్క్రీన్ సైజు 5 అంగుళాలు కాగా, ర్యామ్ ఒక గిగాబైట్ వరకూ ఉంది.

ప్రధాన కెమెరా ఆటోఫోకస్ సౌకర్యంతోపాటు 8 మెగాపిక్సెళ్ల సామర్థ్యంతో లభిస్తుంది. సెల్ఫీల కోసం ఉద్దేశించిన ఫ్రంట్ కెమెరా సామర్థ్యం రెండు మెగాపిక్సెళ్లు. ఫోన్ మెమరీ 8 గిగాబైట్లు ఉన్నప్పటికీ ఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ధర రూ.8499.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement