
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు కరోనా నివారణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు అభద్రతాభావంతో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తులపై ధరలను నిర్ణయించిందన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లలో వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.
ప్రపంచవాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది
‘వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. రైతులు పండించిన పంటలు, ఆక్వా రంగం ఉత్పత్తులకు నష్టం రాకుండ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అమెరికా వంటి దేశాలు కరోనా వలన కుదేలైపోయాయి. కరోనా వైరస్ వలన గ్రామాలు కొన్ని కట్టుబాట్లు చేసుకోవడం వలన రైతులకు కొనుగోలుదారులు కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అటు వంటి గ్యాప్ లేకుండా, రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలపై ఎమ్పెడ్ కంపెనీ ప్రతినిధులు తో సీఎం సంప్రదింపులు జరిపారు’ అని మోపిదేవి తెలిపారు.
ఆ రంగానికి మంచి భవిష్యత్
ఎగుమతులుపై చైనా ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తుంది. 2830 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు నాలుగు రోజుల్లో ఎగుమతి చేశాము. సోమవారం నుంచి ఫీల్డ్ కు వెళ్లి ఎక్సపోర్ట్స్ మీద ఒత్తిడి తెచ్చి వాస్తవ ధరకే కొనుగోళ్లు జరిగేలా చూస్తాము. ఆక్వా ఉత్పత్తులు కు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది. ధరలు తగ్గిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తాము. మిడిల్ మ్యాన్ వ్యవస్థ చాలా ప్రమాదకరమైనది. దళారి వ్యవస్థ లేకుండా చేస్తున్నాము. ఆక్వా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. రైతుల్లో అభద్రతా భావం వద్దు. పాజిటివ్ కేసులు పెరగడం వలనే నిత్యావసర కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితే సమయంలో సడలింపు ఇస్తాము. గ్రామాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతుంది. పట్టణాల్లో కొంత మార్పు రావాల్సి ఉంది’ అంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ వివరించారు.
చదవండి:
నోట్లతో ముక్కు తుడుచుకున్న వ్యక్తి అరెస్టు
'కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలి'
Comments
Please login to add a commentAdd a comment