sevices
-
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా 92 లక్షల మందికి సేవలు
సాక్షి, అనంతపురం క్రైం: పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. దీని ద్వారా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పరిధిలో 92 లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికందుతున్న సేవలపై ఆరా తీశారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారి కోసం సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేసిన పెయిన్ రిలీఫ్ క్లినిక్‌ను, రూ.3.46 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బరన్స్వార్డును మంత్రి ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్మోహన్రెడ్డి వైద్య రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ చరిత్రలోనే 49 వేల మంది సిబ్బందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పారు. అందులో ప్రాధాన్యత క్రమంలో ఐదు వైద్య కళాశాలల్లో (విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి) ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. రాజమండ్రి మినహా అన్ని కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతులు వచ్చాయన్నారు. రాజమండ్రి కళాశాల తనిఖీ పూర్తయితే దానికీ అనుమతులు వస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం) -
రంగంలోకి ‘ప్రాణదాతలు’
సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపర సంజీవనులుగా కీర్తి ప్రతిష్టలు పొందిన 108, 104 అంబులెన్సులను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది బుధవారం ప్రారంభించారు. మొత్తం 1,088 వాహనాలు ఒకే రోజు తమ తమ గమ్యస్థానాలకు ‘కుయ్...కుయ్’మంటూ వెళ్లాయి. ఈ రెండు అంబులెన్సులూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు. వీటికి విశిష్ట చరిత్ర వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జన సంక్షేమానికి వైఎస్ రూపొందించిన పథకాల పరంపరలో ఇవి కూడా భాగం. వైద్యుడిగా పేద రోగులకు నామమాత్రపు ఫీజుతో చికిత్సనందించిన అను భవంతో ఈ అత్యవసర సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో 70 అంబు లెన్సులతో, 50 పట్టణాల్లో ప్రారంభించిన ఈ సేవలు అచిరకాలంలోనే రాష్ట్రమంతటా విస్తరించి ఆపత్సమయాల్లో లక్షలాదిమందికి ప్రాణదానం చేశాయి. ఈ సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం కోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా వైఎస్ ఏర్పాటు చేశారు. అప్పట్లో జాతీయ ఆరోగ్య మిషన్ 108 సిబ్బంది అందించిన సేవలను అధ్యయనం చేసి ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలనుంచి ప్రతినిధి బృందాలు తరలివచ్చాయి. ఈ నమూనానే స్వీకరించి తమ తమ రాష్ట్రాల్లో అంబులెన్సు సర్వీసులు ప్రారంభించాయి. దురదృష్టమేమంటే ఆయన కనుమరు గయ్యాక అధికారంలోకొచ్చినవారు ఈ సేవలను నిర్వీర్యం చేశారు. నామమాత్రంగా మిగిల్చారు. సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించక, ఆ వాహనలకు అవసరమైన మరమ్మతులు చేయించక, కనీసం డీజిల్ కూడా ఇవ్వక భ్రష్టుపట్టించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొచ్చిన చంద్రబాబు అన్నిటితోపాటు ఈ సర్వీసులను కూడా విస్మరించారు. ఇందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కీలకమైన ఈ అంబులెన్సు సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారు. వాటి రూపురేఖల్ని సమూలంగా మార్చి అవి మరింత మెరుగైన సేవలం దించేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ వాటిల్లో పొందుపరిచేలా చేశారు. అన్నివిధాలా ఆరోగ్యవంతంగా వుండే పౌరులే ఏ దేశానికైనా నిజమైన సంపద అని బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో అన్నారు. కీలకమైన ఈ అంశాన్ని ప్రభు త్వాలన్నీ విస్మరిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో వుండే పౌరులు ఉత్పాదకతలో పాలుపంచు కుంటారు. అక్కడ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అవి రెండూ అంతిమంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. అలాంటి పౌరులుండే సమాజం సుఖసంతోషాలతో వుంటుంది. కానీ ఎవరికీ ఇది పట్టలేదు. చంద్రబాబు తొలిసారి తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులు అందించే నాసిరకం సేవలకు సైతం యూజర్ చార్జీలు పెట్టి జనాన్ని వేధించుకుతిన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత కూడా ప్రజారోగ్యాన్ని అటకెక్కించారు. ప్రభుత్వాసుపత్రులను చికిత్సాలయాలుగా కాక... రోగిష్టి కేంద్రాలుగా దిగజార్చారు. అంబులెన్సు సర్వీసుల గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు వాటిని నామమాత్రం చేశారు. ఆ వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన జీతాలుండేవి కాదు. అవి కూడా సకాలంలో వచ్చేవి కాదు. అంబులెన్సుల్లో అధిక భాగం ఎప్పుడూ షెడ్లలో పడివుండేవి. కను కనే నిరుపేద వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఆయన పాలనలో విలవిలలాడాయి. ఆంధ్ర ప్రదేశ్ పౌరులకు ఇక ఆ చింత లేదు. ఇప్పుడు రూపొందించిన సర్వీసుల్లో అమరివున్న అత్యాధునిక సదుపాయాలు ఆపదలో చిక్కుకున్నవారికి అన్నివిధాలా తోడ్పాటునందిస్తాయి. ఇంతక్రితం జనా భాలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్సు వుంటే, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్సు అందుబాటులో వుండబోతోంది. అలాగే లోగడ ఏటా 6,33,600 మందికి సేవలందించే అంబులెన్సులు ఇకపై ఆ సేవల్ని ఏటా 12 లక్షలమందికి అందిస్తాయి. అనారోగ్యానికో, అనుకోని ప్రమాదానికో లోనయినవారిని ఆసుపత్రు లకు చేర్చేలోగానే మెరుగైన సేవలందించి ప్రాణాపాయస్థితినుంచి కాపాడటానికి కావలసిన అత్యా ధునిక ఉపకరణాలు అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమి షాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో అంబు లెన్సులు చేరతాయి. కనుక మారుమూల ప్రాంతాల్లో వున్నవారికి సైతం సకాలంలో వైద్య సేవలు అందుతాయి. ఇప్పుడున్న 108 అంబులెన్సులు 336తోపాటు కొత్తగా మరో 412 రంగంలోకి దిగబోతున్నాయి. 108, 104 సర్వీసులు ప్రతి మండలానికీ ఒక్కొక్కటి చొప్పున వుండేలా చూడటం, చిన్నారుల కోసం ప్రత్యేకించి 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులో వుంచడం జగన్ మోహన్‌రెడ్డికి పేద ప్రజల ఆరోగ్యంపై వున్న శ్రద్ధాసక్తులను తెలియజేస్తుంది. మృత్యుముఖంలో వున్న మార్కండేయుడు స్మరించిన మరుక్షణమే అతడిని కాపాడిన ముక్కంటి వైనం పురాణాల్లో చదివాం. ఇప్పుడు జగన్ చేతుల్లో పునరుజ్జీవం పొందిన ఈ అంబులెన్సులు కూడా అటువంటి పాత్రే నిర్వహించబోతున్నాయి. సాధారణ సమయాల్లో అందరూ నాయకుల్లానే చలా మణి అవుతారు. సంక్షోభాలే అలాంటివారిలో సమర్థులెవరో, కానివారెవరో నిగ్గుదేలుస్తాయి. కరోనా వైరస్ సంక్షోభం చుట్టుముట్టాక దేశంలో ఏ రాష్ట్రమూ చేయనివిధంగా లక్షల్లో వైద్య పరీక్షలు నిర్వ హించడం, అవసరమైన వారిని చికిత్సకు తరలించడం, వారు త్వరగా కోలుకొనేలా పౌష్టికాహారాన్ని అందించడంవంటి చర్యలు అమల్లోపెట్టి జగన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపారు. ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. బుధవారం సరికొత్తగా మొదలైన ఈ అంబులెన్సు సర్వీసులు వాటికి కొనసాగింపే. ఇవి మళ్లీ ప్రాణదాతలుగా, ఆపద్బాంధవుల్లా అందరి ప్రశంసలూ పొందుతాయని ఆశించాలి. -
దేశీయ కంపెనీలపై అది తగ్గిపోయింది!
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్న భారత్ లో వ్యాపార ఆశావాదం పడిపోతుంది. వ్యాపారా ఆశావాద విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో కెల్లా భారత్ కంపెనీలపైనే తక్కువ విశ్వసమున్నట్టు తెలిసింది. మార్కిట్ ఇండియా బిజినెస్ అవుట్ లుక్ నిర్వహించిన సర్వేలో గత నాలుగు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశీయ ప్రైవేట్ కంపెనీల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు వెల్లడైంది. 2016 అక్టోబర్ లో బిజినెస్ అవుట్ పుట్ పరంగా 25 శాతం కంపెనీలు ఆశావాదంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ శాతం 15గా ఉందని పేర్కొంది. గ్లోబల్ ట్రెండ్ లో విశ్వాసాన్ని పెంచుకోవడంలో కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి, కానీ బిజినెస్ సెంటిమెంట్ ఫిబ్రవరి నెలలో పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిస్ట్ పోలియన్న డి లిమా తెలిపారు. 12 దేశాల్లో భారత్ కంపెనీలే అతి తక్కువ స్థాయిలో నమోదైనట్టు పేర్కొన్నారు. తయారీరంగం, సర్వీసు సెక్టార్లలో రెండింటిలో వ్యాపార ఆశావాదం పడిపోతున్నట్టు సర్వే వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ విక్టరీ కంపెనీలపై విశ్వాసాన్ని పెంచుతాయని ఆశిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అంతేకాక ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేయడం ఇన్వెస్టర్లలో, కంపెనీల్లో సంస్కరణల ఆశలకు ఊతమిస్తుందని తెలిసింది. -
మొబైల్ ఆక్వా ల్యాబ్ సేవల్ని వినియోగించుకోవాలి
‘సిఫ్ట్’ ఎఫ్డీఓ డాక్టర్ విజయభారతి నేడు కాట్రేనికోన మండలంలో పరీక్షలు కాట్రేనికోన : మత్స్య పరిశ్రమ అ«భివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ ఆక్వా సేవలను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఎఫ్డీఓ డాక్టర్ టి. విజయభారతి సూచించారు. ఆక్వా చెరువుల వద్దే మొబైల్ ఆక్వా ల్యాబ్‌లో నామమాత్రపు రుసుంతో మట్టి, నీటి నాణ్యత, బాక్టీరియా పరీక్షలు చేసి నివేదికలను రైతులకు అందిస్తామన్నారు. విజయభారతి బృందం గురువారం కాట్రేనికోన మండల కేంద్రంలో నడవపల్లి, కందికుప్ప, కాట్రేనికోన తదితర గ్రామాలలో మొబైల్ ఆక్వా సేవలు అందిస్తారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులు చెరువు నీటిని మొబైల్ లాబ్‌కు తీసుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. -
పుష్కర భక్తులకు సేవ చేయండి
విజయవాడ (ఆటోనగర్): పుష్కర భక్తులకు అసౌకర్యం కలుగకుండా పుష్కర సేవక్‌లుగా(వాలంటీర్లు) ప్రైవేటు స్కూళ్ళ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తమ వంతు సేవలందించాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్ కోరారు. ఆదివారం ఎన్ఏసీ కళ్యాణ మండపంలో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని 350 స్కూళ్ల నుంచి 1500మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన సవాంగ్ ప్రసంగిస్తూ పుష్కరాలు చాలా కాలానికి వచ్చే ముఖ్యమైన పవిత్ర రోజులని, పోటెత్తే భక్తులకు సహకారం అందించటం మన ప్రధానమైన కార్యచరణ అని అన్నారు. క్లాక్ రూమ్స్, క్యూలైన్లు, సమాచార కేంద్రంలో స్వచ్ఛంద సేవలు అందించాలని సూచించారు. ఈ సేవకు గుర్తుగా వాలంటీర్లకు సర్టిఫికేట్లను జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ సాయికృష్ణ, మోహన్‌రెడ్డి, అధ్యక్షులు సరళ, కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడుతూ తాము పుష్కరాల 12 రోజుల్లో తాము 4 రోజులపాటు వాలంటీర్లుగా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. వాలంటీర్లకు క్యాప్, పుష్కర ఐడీ కార్డు, ఫ్లోర్‌సెంట్ జాకెట్ ఇస్తామని డీసీపీ ప్రవీణ్ కుమార్ అన్నారు.