పుష్కర భక్తులకు సేవ చేయండి
విజయవాడ (ఆటోనగర్):
పుష్కర భక్తులకు అసౌకర్యం కలుగకుండా పుష్కర సేవక్‌లుగా(వాలంటీర్లు) ప్రైవేటు స్కూళ్ళ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తమ వంతు సేవలందించాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్ కోరారు. ఆదివారం ఎన్‌ఏసీ కళ్యాణ మండపంలో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని 350 స్కూళ్ల నుంచి 1500మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన సవాంగ్ ప్రసంగిస్తూ పుష్కరాలు చాలా కాలానికి వచ్చే ముఖ్యమైన పవిత్ర రోజులని, పోటెత్తే భక్తులకు సహకారం అందించటం మన ప్రధానమైన కార్యచరణ అని అన్నారు. క్లాక్ రూమ్స్, క్యూలైన్లు, సమాచార కేంద్రంలో స్వచ్ఛంద సేవలు అందించాలని సూచించారు. ఈ సేవకు గుర్తుగా వాలంటీర్లకు సర్టిఫికేట్లను జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ సాయికృష్ణ, మోహన్‌రెడ్డి, అధ్యక్షులు సరళ, కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడుతూ తాము పుష్కరాల 12 రోజుల్లో తాము 4 రోజులపాటు వాలంటీర్లుగా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. వాలంటీర్లకు క్యాప్, పుష్కర ఐడీ కార్డు, ఫ్లోర్‌సెంట్ జాకెట్ ఇస్తామని డీసీపీ ప్రవీణ్ కుమార్ అన్నారు.