దేశీయ కంపెనీలపై అది తగ్గిపోయింది!
దేశీయ కంపెనీలపై అది తగ్గిపోయింది!
Published Tue, Mar 14 2017 11:57 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్న భారత్ లో వ్యాపార ఆశావాదం పడిపోతుంది. వ్యాపారా ఆశావాద విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో కెల్లా భారత్ కంపెనీలపైనే తక్కువ విశ్వసమున్నట్టు తెలిసింది. మార్కిట్ ఇండియా బిజినెస్ అవుట్ లుక్ నిర్వహించిన సర్వేలో గత నాలుగు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశీయ ప్రైవేట్ కంపెనీల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు వెల్లడైంది. 2016 అక్టోబర్ లో బిజినెస్ అవుట్ పుట్ పరంగా 25 శాతం కంపెనీలు ఆశావాదంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ శాతం 15గా ఉందని పేర్కొంది.
గ్లోబల్ ట్రెండ్ లో విశ్వాసాన్ని పెంచుకోవడంలో కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి, కానీ బిజినెస్ సెంటిమెంట్ ఫిబ్రవరి నెలలో పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిస్ట్ పోలియన్న డి లిమా తెలిపారు. 12 దేశాల్లో భారత్ కంపెనీలే అతి తక్కువ స్థాయిలో నమోదైనట్టు పేర్కొన్నారు. తయారీరంగం, సర్వీసు సెక్టార్లలో రెండింటిలో వ్యాపార ఆశావాదం పడిపోతున్నట్టు సర్వే వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ విక్టరీ కంపెనీలపై విశ్వాసాన్ని పెంచుతాయని ఆశిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అంతేకాక ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేయడం ఇన్వెస్టర్లలో, కంపెనీల్లో సంస్కరణల ఆశలకు ఊతమిస్తుందని తెలిసింది.
Advertisement