corporate confidence
-
భారత్‌లో అపార అవకాశాలు
వాషింగ్టన్: ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థలకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టాలని, కొత్త కంపెనీలు.. మదుపుదారులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావాలని ఆమె ఆహా్వనించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పలు బహుళ జాతి దిగ్గజాల సీఈవోలతో నిర్మలా సీతారామన్ వరుసగా భేటీ అవుతున్నారు. ఆమ్వే సీఈవో మిలింద్ పంత్‌తో సమావేశమైన సందర్భంగా తయారీ రంగంలో ఆటోమేషన్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు వంటి అంశాలపై ఆమె చర్చించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ బి మార్క్ అలెన్‌తో భేటీలో నవకల్పనలు, ఏరోస్పేస్ రంగంలో అవకాశాల గురించి ప్రస్తావించారు. -
దేశీయ కంపెనీలపై అది తగ్గిపోయింది!
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తున్న భారత్ లో వ్యాపార ఆశావాదం పడిపోతుంది. వ్యాపారా ఆశావాద విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో కెల్లా భారత్ కంపెనీలపైనే తక్కువ విశ్వసమున్నట్టు తెలిసింది. మార్కిట్ ఇండియా బిజినెస్ అవుట్ లుక్ నిర్వహించిన సర్వేలో గత నాలుగు నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశీయ ప్రైవేట్ కంపెనీల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు వెల్లడైంది. 2016 అక్టోబర్ లో బిజినెస్ అవుట్ పుట్ పరంగా 25 శాతం కంపెనీలు ఆశావాదంగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ శాతం 15గా ఉందని పేర్కొంది. గ్లోబల్ ట్రెండ్ లో విశ్వాసాన్ని పెంచుకోవడంలో కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి, కానీ బిజినెస్ సెంటిమెంట్ ఫిబ్రవరి నెలలో పడిపోయినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిస్ట్ పోలియన్న డి లిమా తెలిపారు. 12 దేశాల్లో భారత్ కంపెనీలే అతి తక్కువ స్థాయిలో నమోదైనట్టు పేర్కొన్నారు. తయారీరంగం, సర్వీసు సెక్టార్లలో రెండింటిలో వ్యాపార ఆశావాదం పడిపోతున్నట్టు సర్వే వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ విక్టరీ కంపెనీలపై విశ్వాసాన్ని పెంచుతాయని ఆశిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. అంతేకాక ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేయడం ఇన్వెస్టర్లలో, కంపెనీల్లో సంస్కరణల ఆశలకు ఊతమిస్తుందని తెలిసింది.