సాక్షి, అనంతపురం క్రైం: పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. దీని ద్వారా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పరిధిలో 92 లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికందుతున్న సేవలపై ఆరా తీశారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారి కోసం సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేసిన పెయిన్ రిలీఫ్ క్లినిక్‌ను, రూ.3.46 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బరన్స్‌వార్డును మంత్రి ప్రారంభించారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ చరిత్రలోనే 49 వేల మంది సిబ్బందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పారు.
అందులో ప్రాధాన్యత క్రమంలో ఐదు వైద్య కళాశాలల్లో (విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి) ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. రాజమండ్రి మినహా అన్ని కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతులు వచ్చాయన్నారు. రాజమండ్రి కళాశాల తనిఖీ పూర్తయితే దానికీ అనుమతులు వస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం)
Comments
Please login to add a commentAdd a comment