![Omicron Tensions Genome Sequencing Lab Set Up In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/3/Genome-Sequencing-Lab.jpg.webp?itok=m2AyM7rj)
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఒమిక్రాన్ నిర్ధారణ కోసం రెండు కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో కేరళ తర్వాత ఏపిలోనే ఈ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్థారణకి శాంపిల్స్‌ని పూణే, హైదరాబాద్ సీసీఎంబికి వైద్య ఆరోగ్యశాఖ పంపించేది. ఇప్పుడు విజయవాడలోనే సాంకేతిక ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది.
చదవండి: ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి.. ప్రధానితో సీఎం జగన్
సోమవారం నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. గత వారం రోజులుగా అధికారులు ట్రైయిల్ రన్ నిర్వహించారు. డెల్టా, ఓమిక్రాన్ మొదలైన కోవిడ్-19ల ఉత్పరివర్తనలు, రూపాంతరాలను ఇక్కడ ల్యాబ్‌లో గుర్తించే సదుపాయం ఉంటుంది. ల్యాబ్ పనితీరులో సీఎస్‌ఐఆర్, సీసీఎంబీ హైదరాబాద్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని వైద్య అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment