సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో పది ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటిదాకా ఈ కరోనా వేరియెంట్ బారినపడ్డ వారి సంఖ్య 16కి చేరింది.
ఇటీవల విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తూర్పుగోదావరి లో ముగ్గురు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు లో ఒక్కొక్కరు వేరియెంట్ బారినపడ్డారు.
ఇక అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఇద్దరి చొప్పున ఒమిక్రాన్ బారినపడ్డారు. ఈ పది మందిని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
Comments
Please login to add a commentAdd a comment