ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందన్న విమర్శకులను వూహాన్ ల్యాబ్ డైరక్టర్ వాంగ్ యాన్‌యూ కొట్టిపారేశారు. ప్రస్తుతం వూహాన్ ల్యాబ్‌లో 3 రకాల వైరస్‌లు ఉన్నాయని.. కానీ ల్యాబ్‌లో ఉన్నవేవి కరోనా వైరస్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ ఆయిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. యాన్‌యూ స్పందిస్తూ.. ఊహాన్ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలన్ని ఊహాజనితమేనని పేర్కొన్నారు.
అసలు వూహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ లేనప్పుడు ఎలా లీక్ అవుతుందని కౌంటర్ ఎటాక్ చేశారు. కాకపోతే మూడు వైరస్‌లు మాత్రం ల్యాబ్‌లో పరిశీలనలో ఉన్నాయన్నాయన్నారు. ఇవేవీ కోవిడ్-19కు మ్యాచ్ కావడం లేదని విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. అవి కేవలం సార్స్, కోవిడ్-2 లక్షణాలు మాత్రమే కల్గి ఉన్నాయన్నారు. గతంలో ప్రపంచాన్ని పీడించిన సార్స్ వైరస్‌తో ఈ వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ రెండు వైరస్‌లు ఒకటి కాదడానికి తగిన ఆధారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించామని తెలిపారు. కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 40వేల మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment