
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 6ను ఎట్టకేలకు అందుబాటులోకి తేనుందనే అంచనాలు ఒకవైపు హల్‌చల్ చేస్తుండగానే.. మరో గుడ్‌న్యూస్ ఒకటి ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రారంభానికి ముందే, వన్ ప్లస్‌టీం తన అభిమానులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇందుకు అభ్యర్థులు తాము వాడుతున్న వస్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై నిష్పక్షపాతంగా, నిజాయితీగా రివ్యూ రాయాల్సి ఉంటుంది.
కంపెనీ ప్రకటించిన ల్యాబ్ ప్రోగ్రాంలో ఉత్తమ ఫీడ్ బ్యాక్ లేదా రివ్యూ అందించిన యూజర్లకు ఉచితంగా వన్‌ప్లస్ 6ను అందిస్తామని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. ఈ పోటీలో ఎంపికయితే..ప్రపంచంలో వన్‌ప్లస్ 6ను అందుకునే తొలి వ్యక్తి మీరే అవుతారంటూ ది ల్యాబ్ వన్‌ప్లస్ 6 ఎడిషన్ అనే బ్లాగ్‌లో వెల్లడించింది. గతంలో వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 5టీ నిర్వహించినట్టుగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్టు తలిపింది. ఎంట్రీలు పంపించేందుకు చివరి తేదీ మే 2. మే 12 న విజేతలను ప్రకటిస్తారు. రివ్యూలు ఇంగ్లీషులో మాత్రమే ఉండాలి. ఈ ల్యాబ్ ప్రోగ్రాం కోసం కేవలం 15మందిని ఎంపిక చేస్తారు. ఇతర నియమాలు, నిబంధనలు తదితర వివరాలు కోసం https://oneplus.typeform.com/to/W08XQ0 లింక్‌లో లభ్యం. అన్నట్టు ఏప్రిల్ 22నుంచే అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా 'నోటిఫై మీ' సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే లాంచింగ్ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment