ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లలోకి వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా వన్‌ప్లస్ 10 ప్రో ఈ ఏడాది జనవరిలోనే చైనా మార్కెట్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్2 నెక్‌బ్యాండ్‌ను కూడా రిలీజ్ అయింది. క్వాల్‌కామ్ ఫాస్టెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ రానుంది. ఇది వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను మద్దతు పలకునుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఐఫోన్ 13 వంటి స్మార్ట్‌ఫోన్లతో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ పోటీ పడనుంది.
ధర ఏంతంటే..?
వన్‌ప్లస్ 10 ప్రో రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. భారత్‌లో వన్‌ప్లస్ 10 ప్రో 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 కాగా, 12GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 71,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎమరాల్డ్ ఫారెస్ట్, వాల్కానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌తో రానుంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్
- 6.7-అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 12 సపోర్ట్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్
- 50 ఎంపీ+ 48 ఎంపీ+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
- 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 5జీ సపోర్ట్
- ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 80W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్
- 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
- 5,000mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ
- యూఎస్‌బీ టైప్-సీ సపోర్ట్
చదవండి: దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్‌లో మరోలా.. విచిత్రమైన పరిస్థితి..!
Comments
Please login to add a commentAdd a comment