దేశంలోనే తొలి మహిళా సైబర్‌ ల్యాబ్‌  | The First Female Cyber Lab In Hyderabad | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి మహిళా సైబర్‌ ల్యాబ్‌ 

Published Fri, Jul 16 2021 2:08 AM | Last Updated on Fri, Jul 16 2021 2:09 AM

The First Female Cyber Lab In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డితో సీఆర్‌సీఐడీఎఫ్‌ (సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌)తో డీజీపీ కార్యాలయంలో శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో విమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి కూడా పాల్గొంటారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ)తో పాటు, మహారాష్ట్ర పోలీసులతో పలు ప్రాజెక్టుల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. రాష్ట్ర విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో ఈ సైబర్‌ ల్యాబ్‌ నడుస్తుంది. ఇందుకోసం విమెన్‌సేఫ్టీ వింగ్‌ మూడో అంతస్తులో ల్యాబ్‌ నిర్మించారు. ఇందులో పనిచేసేందుకు డిజిటల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు, సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేటర్స్, కంటెంట్‌ రైటర్స్‌ను నియమించారు. ఈ నెలాఖరున కార్యకలాపాలు ప్రారంభించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement