మీ సేవలకు సలామ్‌ | DGP Mahender Reddy Launches Corona Warriors Song | Sakshi
Sakshi News home page

మీ సేవలకు సలామ్‌

Published Sat, May 23 2020 6:11 AM | Last Updated on Sat, May 23 2020 6:11 AM

DGP Mahender Reddy Launches Corona Warriors Song - Sakshi

కరోనా మీద ప్రస్తుతం ప్రపంచం పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. వాళ్ల సేవలకు సలామ్‌ చేస్తూ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్‌ ఓ పాటను రూపొందించారు. రచయిత బాలాజీ రచించిన ఈ పాటను సుమారు పది మంది (మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతా మాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, బేబి) గాయనీ గాయకులు ఆలపించారు.  ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేసి, ‘‘మనకోసం పోరాడుతున్న వాళ్ల సేవలను గుర్తిస్తూ ఓ పాటను చేయడం మంచి విషయం. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘కరోనా నుంచి మనల్ని కాపాడుతున్న అందరికీ చేతులెత్తి మొక్కాలి. నాకు సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సంగీత దర్శకుడు మహిత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement