‘కరెన్సీ’పై అంబేడ్కర్‌ ఉండాల్సిందే! | demand on ambdeker print in currency | Sakshi
Sakshi News home page

‘కరెన్సీ’పై అంబేడ్కర్‌ ఉండాల్సిందే!

Published Sat, Jul 30 2016 8:23 PM | Last Updated on Fri, Aug 17 2018 8:12 PM

demand on ambdeker print in currency

అరండల్‌పేట: ఇండియా కరెన్సీ నోటుపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి డిమాండ్‌ చేశారు. ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కార్యాలయంలో శనివారం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ ఇండియా కరెన్సీ నోటుపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బొమ్మను ముద్రించాలని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇండియా రూపాయి ఇలా ఉండాలని సృష్టించిన కర్త అంబేడ్కర్‌ అని అన్నారు.

అంబేడ్కర్‌ బొమ్మను ఇండియా కరెన్సీపై ముద్రించాలని ఆర్థిక శాఖ మంత్రికి ఫ్యాక్స్‌ రూపంలో వినతి పత్రం పంపించామన్నారు. అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన చలో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించడం, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి తీసుకెళతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement