
ఢిల్లీ : హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) ఇంట్లో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లోనే కాదు ఇంటి సమీపంలో చెత్త కుప్పలో కాలిన రూ.500 నోట్లు ప్రత్యక్షమవ్వడంతో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక మలుపు తిరిగినట్లైంది.
హోలీ పండుగ (మార్చి 14)న ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం,ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
#WATCH | A sanitation worker, Inderjeet says, "We work in this circle. We collect garbage from the roads. We were cleaning here 4-5 days back and collecting garbage when we found some small pieces of burnt Rs 500 notes. We found it that day. Now, we have found 1-2 pieces...We do… pic.twitter.com/qnLjnYvnfe
— ANI (@ANI) March 23, 2025
ఈ విచారణ నేపథ్యంలో,జస్టిస్ వర్మ నివాసానికి సమీపంలోని చెత్తను శుభ్రం చేస్తున్న సమయంలో కాలిన రూ.500 నోట్ల ముక్కలు కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కాలిన నోట్లు ఎవరివన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుడు ఇంద్రజిత్ మీడియాతో మాట్లాడుతూ.. మేం నాలుగైదు రోజుల క్రితం ఈ వీధిని శుభ్రం చేసే సమయంలో మాకు కాలిన నోట్ల కనిపించాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. శుభ్రం చేయడం మా పని. శుభ్రం చేసే సమయంలో ఇప్పటికీ కాలిన నోట్ల ముక్కలు కనిపిస్తున్నాయని అన్నారు.
మరోవైపు, తన ఇంట్లో డబ్బులు లభ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ స్పందించారు. ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. ఈ ఘటనలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment