
వినడానికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుందిగానీ.. యుటా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు శరీర కణజాలాన్ని త్రీడీ పద్ధతిలో ముద్రించేందుకు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ప్రమాదవశాత్తూ లేదా జబ్బుల కారణంగా దెబ్బతినే కణజాలం, లిగమెంట్, టెండాన్‌ల స్థానంలో త్రీడీ పద్ధతిలో ముద్రించిన భాగాలను వాడుకోవచ్చునని అంచనా. రోగి శరీరం నుంచి మూలకణాలను సేకరించడం.. వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన త్రీడీప్రింటర్ ద్వారా హైడ్రోజెల్‌పై టెండాన్ లేదా లిగమెంట్ ఆకారంలో పలుచటి పొరగా ఏర్పాటు చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. ఆ తరువాత కణాలు ఎదిగేందుకు తగిన పోషకాలను అందిస్తే చాలని.. సహజసిద్ధమైన శరీరభాగాలు రెడీ అవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్ ఏడ్.
వినేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తున్నా.. ఈ ప్రక్రియ సంక్లిష్టమైందని.. వేర్వేరు కణాలను సంక్లిష్టమైన ప్యాటర్న్‌లలో ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని అంటున్నారు డేవిడ్. నియాన్ బల్బుల మాదిరిగా వెలుగులు చిమ్మే జన్యుమార్పిడి కణాలను వాడటం ద్వారా తాము ఈ పద్ధతిని పరీక్షించి చూశామని తెలిపారు. ప్రస్తుతం ఎవరి కణజాలాన్ని అయినా మార్చాలంటే శరీరంలోని ఇతర భాగాల నుంచి సేకరించడం లేదంటే మత శరీరాల నుంచి సేకరించడం మాత్రమే మార్గం. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పద్ధతి ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment