David
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి
బనశంకరి: భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనకశ్రీ లేఔట్ ఎస్ఎల్వీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడటంతో తీవ్ర గాయాలై మరణించారు. గురువారం ఉదయం గం. 11:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. 1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్‌లో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో జాన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించాడు. -
ఉద్యమ వాస్తవ చరిత్ర..
ప్రపంచీకరణ అనంతరం వ్యక్తివాదం పెరిగి పోయి ఉద్యమాలు ఉండవు అనే ప్రచారం బలంగా నడుస్తున్న కాలంలో ప్రాంతీయ అస్తిత్వ వేదనలోంచి ఎగిసిన విముక్తి పోరాటం తెలంగాణ ఉద్యమం. పల్లెల నుండి పట్టణాల దాకా తెలంగాణ అనని మనిషి లేడు. కులాలు, మతాలకతీతంగా అందరూ ఒక్క గొంతుకగా నినదించిన నినాదం ‘జై తెలంగాణ’. అందులో ముఖ్య భూమిక విద్యార్థులది. మంటలై మండింది, రైళ్ళకు ఎదురెళ్లి ముక్కలైంది, ఉరిపోసుకున్నది, పురుగుల మందు తాగింది. ఏది చేసినా తెలంగాణ అనే ఉద్యమ కాగడను ఆరిపోకుండా చమురు పోసి మండించేందుకే. పాలకులు, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులే.విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వెనుక స్వాతంత్య్ర ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటాల స్పూర్తి, ప్రభా వాలు ఉన్నాయి. ఆ చైతన్యమే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అట్లా ఎగిసిన విద్యార్థి ఉద్యమం రాజకీయ పార్టీల కనుసన్నల్లోకి ఎలా పోయింది? దానికి పని చేసిన శక్తులేవి? తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కి తగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర ఇది. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే (నలమాస కృష్ణ) పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.ఇది అకడమిక్ పరిశోధన కాబట్టి దీనికి పరిమితులు ఉన్నా... ఇది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా నమోదు చేసిందని మాత్రం చెప్పవచ్చు. అలా భవిష్యత్తు పరిశోధనకు దారులు వేసిందన్నమాట. ఉద్యమం నడుస్తుండగానే తీరికలేని కార్యాచరణలో దాని తీరూ తెన్నులపై చేసిన ఓ విశ్లేషణ ఇది. ఆ పరిమితుల్లో దీన్ని అర్థం చేసుకుంటూ అధ్యయం చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరుగనున్న ఈ పుస్తకావిష్కరణకు అందరూ ఆహ్వానితులే. – అరుణాంక్, డేవిడ్ (నేడు హైదరాబాద్‌లో ‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’ పుస్తకావిష్కరణ) -
వుయ్‌వర్క్ దివాలా!
న్యూయార్క్: ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్‌ఫోలియోను మరింత క్రమబద్దికరించుకోనున్నట్లు పేర్కొంది. రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించేలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడా వెలుపలి దేశాల్లోని తమ కార్యకలాపాలపై ఈ పరిణామ ప్రభావం ఉండబోదని వుయ్‌వర్క్ వివరించింది. సమస్యలను పరిష్కరించుకుని, వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో డేవిడ్ టోలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఈ ఏడాది ప్రథమార్ధంలో 696 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. జూన్ 30 నాటికి వుయ్‌వర్క్‌కు 39 దేశాల్లో 777 చోట్ల కార్యకలాపాలు ఉన్నాయి. అప్పట్లో 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ .. గతంలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో వెలుగొందిన వుయ్‌వర్క్ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి దూకుడుగా విస్తరించడం, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి ఇందుకు దారితీశాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచే దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో ఐపీవోకి వచ్చినా వేల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి 9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకన్నా ముందే కంపెనీ, వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. న్యూమాన్ ఉద్వాసనకు గురయ్యారు. సంస్థలో మెజారిటీ వాటాలు తీసుకున్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. కంపెనీని నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహ ణ వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ వుయ్‌వర్క్ ఆగస్టులోనే వెల్లడించింది. ఆ తర్వాత లీజులన్నింటినీ పునఃసమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించింది. నష్టాల్లో ఉన్న లొకేషన్ల నుంచి వైదొలగనున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రభావం ఉండదు.. వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి స్పష్టం చేశారు. దివాలా ప్రక్రియలో భారత వ్యాపారం భాగంగా లేదని తెలిపారు. వుయ్‌వర్క్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌నకు 73 శాతం, వుయ్‌వర్క్ గ్లోబల్‌కు 27 శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌లో ఏడు నగరాల్లో వుయ్‌వర్క్ ఇండియాకు 50 కేంద్రాలు ఉన్నాయి. 2021 జూన్‌లో వుయ్‌వర్క్ ఇండియాలో వుయ్‌వర్క్ గ్లోబల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
‘దొంగ’ పిల్లి.. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు..
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగర శివార్లలో నివపించే గిన్నీ, డేవిడ్ దంపతులు పెంచుకుంటున్న ఐదేళ్ల నల్లపిల్లి ఇది. పేరు.. కీత్. దీని ‘దొంగ’బుద్ధితో ఇరుగుపొరుగు వారికి భలే చిక్కొచ్చిపడింది. అర్ధరాత్రులు నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలోకి జొరబడటం... కంటపడ్డ వస్తువులను పట్టుకొచ్చేయడం దీనికి అలవాటు. బూట్లు, స్విమ్ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, ఓ పోలీసు అధికారి షర్టు, ఈల్ చేపలు... ఇలా చాలానే యజమానుల ఇంటికి తెచ్చేస్తోంది. మూడేళ్లుగా దీనికి ఈ అలవాటున్నా... ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు వస్తువులను కొట్టుకొస్తోంది. ఇటీవల గంజాయి పీల్చే హుక్కా లాంటి ఓ గాజు పరికరం, తెల్లటి పొడితో నిండిన చిన్న బ్యాగును పట్టుకొచ్చేసింది. దాంతో దీని ఘనకార్యాలు పోలీసులకూ తెలిశాయి. అవి ఎక్కుడునుంచి తెచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసోళ్లు. ఎంతైనా ఐదేళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కాబట్టి గిన్నీ, డేవిడ్‌లు దీన్ని కట్టడి చేయలేక... ఇరుగుపొరుగుతో ఇబ్బందులు రాకూడదని ఓ ఆలోచన చేశారు. తమ ఇంటి ఆవరణలో ఓ ప్లాస్టిక్ బుట్ట పెట్టి... కీత్ ఎత్తుకొచ్చేస్తున్న వస్తువులను అందులో ఉంచుతున్నారు. ఇరుగుపొరుగు తమ ఇంట్లో బూట్లు, ఇతర ఏదైనా వస్తువులు కనపడకపోతే ఇక్కడికొచ్చి... బుట్టలో వెతికి పట్టుకుపోతున్నారు. ఇదీ ఈ దొంగపిల్లి కథ. -
టీ20 వరల్డ్‌కప్: తొలిసారి నమీబియా.. జట్టులో అతడు కూడా..
Namibia T20 World Cup 2021 squad: యూఏఈ వేదికగా వచ్చే నెల 17న ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు సదరన్ ఆఫ్రికా దేశం నమీబియా తమ జట్టును ప్రకటించింది. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌కు ఇందులో చోటు కల్పించడం విశేషం. 2016లో దక్షిణాఫ్రికా తరఫున టీ20 వరల్డ్‌కప్ ఆడిన డేవిడ్.. తన తండ్రి స్వదేశమైన నమీబియా నుంచి ఈసారి ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఇక హెడ్ కోచ్ పియరీ డీ బ్రున్ శిక్షణలో రాటుదేలిన తమ ఆటగాళ్లతో తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో తలపడేందుకు నమీబియా సిద్ధమవుతోంది. మేనేజ్మెంట్లో ప్రొటిస్ మాజీ ఆటగాడు మోర్నే మోర్కెల్ కూడా ఉండటం మరో విశేషం. కాగా 2019లో దుబాయ్‌లో జరిగిన క్వాలిఫైయర్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం ద్వారా వరల్డ్‌కప్‌నకు నమీబియా అర్హత సాధించింది. ఇక అక్టోబరు 18న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నమీబియా టీ20 జట్టు ఇదే.. గెర్హాడ్ ఎరాస్మస్(కెప్టెన్), స్టీఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, మిచావు డు ప్రీజ్, జాన్ ఫ్రిలింక్, జానే గ్రీన్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, బెర్నార్డ్ షోల్ట్, బెన్ షికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్మాన్, మైకేల్‌వాన్ లింగన్, డేవిడ్ వీజ్, క్రెయిగ్ విలియమ్స్, పిక్కీ యా ఫ్రాన్స్. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు -
నూతన చట్టం.. ఎవరికీ కాదు చుట్టం!
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్, పంచాయతీ, మున్సిపల్, ఎస్సీ కార్పోరేషన్, మత్చ్యశాఖ, వ్యవసాయం, మార్కెటింగ్‌తో పాటు ఇతర శాఖలు కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చేవే. వీటన్నింటిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్యవేక్షణ జరుగుతుంది. ప్రభుత్వం ‘స్థానిక అభివృద్ధి’ వైపు దృష్టి సారించినందున స్థానిక సంస్థల ద్వారా జరిగే పనులన్నీ ఒక ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఉండాలని భావించి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్ట్ క్రియేట్ చేసింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పని చేస్తారు. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టడం, అవినీతి, అక్రమాలు జరగకుండా చూస్తారు. స్థానిక సంస్థల్లో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి రాబడి పెంచడం.. వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేయించడం వంటివి ఉంటాయని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం.డేవిడ్ అన్నారు. నూతన చట్టం ఎవరికీ చుట్టం కాదని, అక్రమాలకు పాల్పడితే చైర్మన్లనూ సస్పెండ్ చేసే అధికారం అధికారులకు ఉందని అంటున్న ఆయన.. సోమవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రధాన లక్ష్యం ఏమిటి.? అదనపు కలెక్టర్: స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా నియామకమైన కలెక్టర్ ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థలను బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపించడం. స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సక్రమంగా వినియోగించేలా కృషి చేయడం. వృథా ఖర్చులను తగ్గించడం.. ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు, చట్టాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయించడం.. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ స్థానిక సంస్థల ద్వారా విజయవంతం చేయడం వంటివి ఉన్నాయి. సాక్షి:స్థానిక సంస్థల్లో ఆదాయ మార్గాలపై ఎలా దృష్టి పెడతారు.? అదనపు కలెక్టర్: గ్రామ పంచాయతీలకు చాలా రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇంటి పన్ను వసూళ్లు నుంచి ఇసుక పెనాల్టీ వరకు అన్ని రాబడిని పెంచేవే. అయితే ఆ నిధులను దేనికి వినియోగిస్తున్నారనేది క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పంచాయతీలో ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సృష్టించి వచ్చిన నిధులు పంచాయతీకే వినియోగించేలా చూస్తాం. ఇక మున్సిపాలిటీల్లో కూడా ఆస్తి పన్ను వసూళ్ల నుంచి భవన నిర్మాణాల అనుమతుల వరకు చాలా మార్గాలు ఉన్నాయి. పట్టణాల్లో కూడా కొత్త ఆదాయ మార్గాల ద్వారా రాబడిని పెంచేలా కృషి చేస్తాం. సాక్షి:అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అధికారాలు ఎలా ఉండనున్నాయి.? అదనపు కలెక్టర్: స్థానిక సంస్థల్లో అవినీతి అక్రమాలు జరగకుండా చట్టాల ప్రకారం అభివృద్ధి పనులు చేయించడం. అవినీతికి పాల్పడితే విచారణ చేపట్టడం. అవినీతికి పాల్పడ్డారని తేలితే చిన్నస్థాయి అధికారి నుంచి మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. ఇదంతా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం పంచాయతీరాజ్, మున్సిపల్ నూతన చట్టాల్లో స్పష్టంగా ఉంది. అందుకే లోకల్ బాడీస్‌పై అదనపు కలెక్టర్ పూర్తిగా దృష్టి సారించనున్నారు. సాక్షి:పచ్చదనానికి, పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుంది. ఇందులో మీరేలా ముందుకెళ్తారు.? అదనపు కలెక్టర్: నూతన చట్టం ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం నిధులు గ్రీనరీకి కేటాయించాలి. ఈ నిధులతో గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం తీసుకొస్తాం. నర్సరీల ద్వారా పెంచిన మొక్కలను ఖాళీ స్థలాల్లో నాటి వాటిని సంరక్షిస్తాం. పట్టణాల్లో ప్రస్తుతమున్న పార్కులను అభివృద్ధి చేస్తాం. లేని చోట కొత్తగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పచ్చదనంతోపాటు పరిశుభ్రతకు ప్రధాన్యతనిస్తాం. డ్రెయినేజీలోని మురుగునీరు రోడ్లపై రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తాం. ఈ పనులన్నీ గతంలో పల్లె ప్రగతిలో చేశాం. ఇప్పుడు పట్టణ ప్రగతిలో కూడా చేస్తాం. ఇవి గ్రామాల్లో, పట్టణాల్లో నిరంతరంగా కొనసాగే పనులు. సాక్షి:మున్సిపల్, పంచాయతీరాజ్ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం.? అదనపు కలెక్టర్: పంచాయతీరాజ్, మున్సిపల్ సమ్మేళనాలకు స్థానిక సంస్థల సభ్యులను ఆహ్వానించి వారికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. చట్టాల గురించి వారికి అవగాహన లేకుంటే అదనపు కలెక్టర్‌కు ఉండే హక్కులను హరించే ఆస్కారం ఉంటుంది. అందుకే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, ఇతర స్థానిక సంస్థల సభ్యులకు అవగాహన కల్పించి స్థానిక సంస్థలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు సమ్మేళనాలు చేపడుతుంటారు. దీంతో స్థానిక సంస్థలకు చట్టాలపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. సాక్షి:పల్లెల్లో, పట్టణాల్లో మీ పర్యవేక్షణ ఎలా ఉండనుంది.? అదనపు కలెక్టర్: గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పూర్తి చేయించడం. పల్లెలు ప్రతి రోజు పరిశుభ్రత పాటించే విధంగా చూడడం. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం, నర్సరీల్లో మొక్కలు పెంచడం, నాటిన మొక్కలు సంరక్షించడంపై దృష్టి సారిస్తాం. ప్రభుత్వం టాప్ ప్రయార్టీగా తీసుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేయించడం, ట్యాక్స్ వసూలు, అభివృద్ధి పనులు, ప్రజలందరికీ మంచినీరు సరఫరా, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ఖర్చు, మిగులు వంటి వివరాలను ప్రభుత్వానికి నివేదించడం లాంటివి జరుగుతాయి. పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలు, తాగునీరు, రోడ్లు, మురికి కాలువల శుభ్రం, వీధి దీపాలు, భవన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులివ్వడం, ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని కాపాడడం, అక్రమ లే అవుట్లపై నిఘా సారించి చర్యలు తీసుకోవడ, పచ్చదనం, పరిశుభ్రత లాంటి తదితర వాటిపై పర్యవేక్షణ ఉంటుంది. -
చెప్పని సారీ విలువ లక్షా ఇరవై డాలర్లు!
జడ్జిగారు తీర్పు చెప్పేశారు. డేవిడ్ గారు శారా గారికి 1,20,000 డాలర్లు చెల్లించాలి! ఇంతమొత్తం అంటే మన కరెన్సీలో 58 లక్షల 38 వేల 723 రూపాయలు. పెద్ద మొత్తమే. కానీ శారా సంతోషించింది అంత పెద్ద మొత్తానికి కాదు. డేవిడ్‌ను తను కోర్టుకు ఈడ్చగలిగింది. తనకు జరిగిన అవమానం చిన్నది కాదు అని జడ్జిగారు కూడా భావించారు. వీటికన్నా ముఖ్యం.. మహిళల్ని చులకన చేసి మాట్లాడ్డానికి ఇకనుంచీ పురుషులు జంకుతారు. అది కావాలి తనకు. డేవిడ్ పెద్ద మనిషి. 67 ఏళ్ల మనిషి. ఇంకా పెద్ద విషయం.. ఆస్ట్రేలియా పార్లమెంటులో అధికార ‘లిబరల్ డెమోక్రాటిక్’ పార్టీ సెనెటర్. ఆయనపై ఇప్పుడు కేసు గెలిచిన శారా ఆయనతో పోలిస్తే చాలా చిన్న. వయసు 37 ఏళ్లు. ‘గ్రీన్’ పార్టీ సెనెటర్. 2018 జూన్‌లో ఆస్ట్రేలియా పార్లమెంటులో ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు అంత పెద్ద డేవిడ్‌గారు శారాను తటాలున అనకూడని మాట అనేశారు. తటాలున అనేశాడనీ అనుకున్నారు మిగతా సెనెటర్లు కూడా. కానీ ఆయన పదే పదే శారాను ఆ మాట అంటూ ఉండటంతో కావాలనే అంటున్నారని అర్థమైంది. సారీ చెప్పమన్నారు శారా. చెప్పను అన్నారు డేవిడ్‌గారు. శారా కోర్టుకు వెళ్లారు. ఏడాదికి పైగా కేసు నడిచి శారాకు అనుకూలం గా సోమవారం తీర్పు వచ్చింది. ఇంతకీ డేవిడ్ శారాను అన్న మాట ఏమిటి? ‘స్టాప్ షాగింగ్ మెన్’ అన్నారు! షాగింగ్ అనే మాటకు సాధారణ అర్థం ‘వెంటపడడం’. ‘ముగ్గులోకి దింపడం’ అని వేరే అర్థం కూడా ఉంది.. ‘స్టాప్ షాగింగ్ మెన్’ అంటే మగాళ్లను ముగ్గులోకి దింపడం మానెయ్’ మని అర్థం. పెప్పర్ స్ప్రే వాడకాన్ని నిషేధించాలా వద్దా అనే అంశం పై సభలో వేడిగా చర్చ జరుగుతున్నప్పుడు డేవిడ్ సహనం కోల్పోయి శారాను ఇలా అనేశారు పరువునష్ట పరిహారాన్ని చెల్లించబోతున్నారు. -
కణజాలాల ముద్రణకు మార్గం సుగమం...
వినడానికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుందిగానీ.. యుటా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు శరీర కణజాలాన్ని త్రీడీ పద్ధతిలో ముద్రించేందుకు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో ప్రమాదవశాత్తూ లేదా జబ్బుల కారణంగా దెబ్బతినే కణజాలం, లిగమెంట్, టెండాన్ల స్థానంలో త్రీడీ పద్ధతిలో ముద్రించిన భాగాలను వాడుకోవచ్చునని అంచనా. రోగి శరీరం నుంచి మూలకణాలను సేకరించడం.. వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన త్రీడీప్రింటర్ ద్వారా హైడ్రోజెల్పై టెండాన్ లేదా లిగమెంట్ ఆకారంలో పలుచటి పొరగా ఏర్పాటు చేయడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు. ఆ తరువాత కణాలు ఎదిగేందుకు తగిన పోషకాలను అందిస్తే చాలని.. సహజసిద్ధమైన శరీరభాగాలు రెడీ అవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేవిడ్ ఏడ్. వినేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తున్నా.. ఈ ప్రక్రియ సంక్లిష్టమైందని.. వేర్వేరు కణాలను సంక్లిష్టమైన ప్యాటర్న్లలో ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని అంటున్నారు డేవిడ్. నియాన్ బల్బుల మాదిరిగా వెలుగులు చిమ్మే జన్యుమార్పిడి కణాలను వాడటం ద్వారా తాము ఈ పద్ధతిని పరీక్షించి చూశామని తెలిపారు. ప్రస్తుతం ఎవరి కణజాలాన్ని అయినా మార్చాలంటే శరీరంలోని ఇతర భాగాల నుంచి సేకరించడం లేదంటే మత శరీరాల నుంచి సేకరించడం మాత్రమే మార్గం. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పద్ధతి ప్రాధాన్యం సంతరించుకుంది. -
టీఆర్ఎస్ నేత ఆత్మహత్య
అమీర్‌పేట: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోరబండ రామారావు నగర్‌కు చెందిన డేవిడ్(40) టీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్నాడు. ఓ ప్రైవేటు కంపనీలో పనిచేస్తున్న అతను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్థాపానికి లోనైన డేవిడ్ సోమవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరళించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
8న తెరపైకి ఆనబెల్ క్రియేషన్
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాలను ఆసక్తిగా చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి వస్తోంది ఆనబెల్ క్రియేషన్ చిత్రం. ఈ చిత్రానికి చాలా విశేషాలున్నాయి. 2014లో వచ్చిన ఆనబెల్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ల అమెరికన్ డాలర్ల వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల వరుసలో నిలిచింది. అదే విధంగా ది కంజూరింగ్ సిరీస్ చిత్రాలు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ది కంజూరిగ్ చిత్రానికి నాలుగవ భాగంగా వస్తున్న చిత్రం ఆనబెల్ క్రియేషన్. 2014లో వచ్చిన ఆనబెల్ చిత్రం ఒక్క భారతదేశంలోనే రూ. 83.5 కోట్లను వసూలు చేసి రికార్డు సాధించింది. ఆ చిత్ర దర్శకుడు డేవిడ్ ఎఫ్.శాండ్బెర్గిన్నే తాజా చిత్రం ఆనబెల్ క్రియేషన్‌కు దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 18న ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఆనబెల్ క్రియేషన్ చిత్రం ప్రేక్షకులను మూడు రకాల భావాలకు గురి చేస్తుందని దర్శకుడు అంటున్నారు. -
వాడే వీడా?
పట్టుకోండి చూద్దాం ఎప్పుడూ హుషారుగా ఉంటూ అందరినీ నవ్వించే డేవిడ్ ఆరోజు కంటికి మింటిగా ధారగా ఏడుస్తున్నాడు. చుట్టు పక్కల వాళ్లు రకరకాలుగా ఓదారుస్తున్నారు. ‘‘భార్యను ఎంత బాగా చూసుకునే వాడో...’’ అని ఒకరంటే... ‘‘భార్యా భర్తలిద్దరూ ఎప్పుడూ చిన్న గొడవ పడలేదు’’ అని మరొకరు అన్నారు. ఇది ఒక్క రోజు దృశ్యం కాదు. గత వారం రోజులుగా కనిపిస్తున్న దృశ్యం. అందరినీ కదలిస్తున్న దృశ్యం. వేసవి సెలవుల్లో భార్య రమ్యతో కలిసి డేవిడ్ బెంగళూరు వెళ్లాడు. బెంగళూరు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు డేవిడ్. అది ఇప్పుడు నెరవేరింది. లాల్బాగ్, జె.పి బయోడైవర్సిటీ పార్క్, బెంగళూరు ఫోర్ట్, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, విధాన సౌధ, గవర్నమెంట్ మ్యూజియం... ఇలా ఎన్నో చూశారు శరత్, రమ్యాలు. ఇద్దరికీ బెంగళూరు తెగనచ్చేసింది. ‘‘సర్... నా పేరు డేవిడ్... నా భార్య కనిపించడం లేదు...’’ అని ఇన్స్పెక్టర్తో చెబుతున్నాడు డేవిడ్. అతని నుదిటికి చెమట పట్టింది. చేతులు ఒణుకుతున్నాయి. ‘‘అసలేం జరిగింది?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ మంజప్ప. ‘‘మేము హైదరాబాద్‌లో ఉంటామండీ... బెంగళూరు చూడడానికి వచ్చాం. గాంధీ బజార్లో ఉన్నప్పుడు... ఐస్‌క్రీం కావాలని అడిగింది నా భార్య రమ్య. నువ్వు ఇక్కడే నిల్చొని ఉండు... నేను పట్టుకొస్తానని ఐస్‌క్రీం పార్లర్‌ను వెదుకుతూ బయలుదేరాను. తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లను అడిగాను. తలా ఒక్క సమాధానం చెప్పారు. ‘ఆమె దగ్గరికి ఒక వైట్ కలర్ వ్యాన్ వచ్చి ఆగింది, ఆ వ్యాన్‌లో ఉన్నవాళ్లు ఆమెతో ఏదో మాట్లాడారు, ఆ తరువాత ఆమె వ్యాన్‌లో కూర్చొని వెళ్లింది’ అని ఒకరు చెప్పారు. ‘ఇక్కడే ఏదో ఆటోలో వెళ్లింది’ అని మరోవ్యక్తి చెప్పాడు. ‘ఎవరో కుర్రాడు ఆ అమ్మాయితో చాలాసేపు మాట్లాడాడు... ఆ తరువాత వాళ్లిద్దరూ కనిపించలేదు’ అని ఇంకో వ్యక్తి చెప్పాడు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మీరే నన్ను కాపాడాలి సార్’’ అని ఇన్స్పెక్టర్ మంజప్పను వేడుకున్నాడు డేవిడ్. ‘‘ముగ్గురూ మూడు రకాలుగా చెప్పి ఉండొచ్చుగాక... వీటిలో ఎవరు చెప్పినదాన్ని నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు?’’ అడిగాడు మంజప్ప. ‘‘అక్కడ టీ కొట్టులో పని చేసే నల్ల కుర్రాడు చెప్పిన విషయాన్ని ఎక్కువగా నమ్ముతున్నాను’’ అన్నాడు డేవిడ్. ‘‘ఎందుకని?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ మంజప్ప. ‘‘ఆటోలో వెళ్లాల్సిన అవసరం రమ్యకు ఏముంది? ఇక్కడ ఆమెకు బంధువులు ఎవరూ లేరు. అలాగే... ఎవరో కుర్రాడితో మాట్లాడింది అనే విషయాన్ని కూడా నేను నమ్మడం లేదు. ఆమెకు ఇక్కడ పరిచయస్తులు ఎవరూ లేరనే విషయం నాకు తెలుసు. ఆ వ్యాన్‌లో వచ్చిన వాళ్లు రమ్యకు ఏవో మాయమాటలు చెప్పి, వ్యాన్‌లో తీసుకొని వెళ్లి ఉండొచ్చు’’ అని వివరించాడు డేవిడ్. ‘‘మీరు ధైర్యంగా ఉండాలి. మీ భార్యకు ఏమీ కాదు....’’ ధైర్యం చెప్పి రంగంలోకి దిగాడు ఇన్స్పెక్టర్ మంజప్ప. ఒకటో రోజు... రెండో రోజు... మూడో రోజు.... ఇన్స్పెక్టర్ శ్రమ ఫలించలేదు. రమ్య కేసు మిస్టరీగా మారింది. హైదరాబాద్‌లో... డేవిడ్‌ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్లను కూడా ఎంక్వైరీ చేశాడు. అప్పుడు పూర్తిగా స్పష్టత వచ్చింది. ‘‘నీ భార్య కనిపించకపోవడానికి కారణం నువ్వే... నిజం చెప్పు’’ అని గట్టిగా గద్దించడంతో డేవిడ్ వణికిపోయాడు. ఇక తన పప్పులు ఉడకవని నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి.... డేవిడ్ హంతకుడు అని ఇన్స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు? బెంగళూరుకు వెళ్లడానికి, తిరిగి రావడానికి తనకు రెండు బస్సు టికెట్లు తీసుకున్న డేవిడ్... రమ్యకు మాత్రం ఒకే టికెట్ తీసుకున్నాడు. వచ్చేటప్పుడు తాను ఒక్కడినే వస్తాననే నమ్మకానికి కారణం ఏమిటి? రమ్య ఎలాగూ తిరిగిరాదని ముందస్తు ప్లాన్ ప్రకారమే... ఆమెకు ఒకే టికెట్ తీసుకున్నాడు. ఇదే అతన్ని పట్టించింది. -
'బిజీగా ఉన్నా.. కాదనలేకపోయా..!'
ఇప్పటికే చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో రానా మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం తొలి సబ్ మెరైన్ వార్ ఫిలింగా తెరకెక్కుతున్న ఘాజీలో నటిస్తున్న రానా, ఈ సినిమాతో పాటు బాహుబలి 2 షూటింగ్‌కు కూడా రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే లీడర్ సినిమాకు సీక్వల్‌ను కూడా లైన్లో పెట్టాడు. ఇవి కాకుండా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బెంగళూర్ డేస్' రీమేక్ రిలీజ్‌కు రెడీగా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు మరో సినిమాకు ఓకె చెప్పాడు. తమిళ రచయిత డేవిడ్ చెప్పిన కథ విపరీతంగా నచ్చటంతో, ఇంత బిజీ షెడ్యూల్ లోనూ డేవిడ్‌తో బైలింగ్యువల్ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నారు. డేవిడ్ చెప్పిన లైన్ చాలా నచ్చింది అందుకే ఇంత బిజీలోనూ ఆ సినిమాను కాదనలేకపోయానన్నాడు రానా. -
'మా ఆయన చాలా రోమాంటిక్'
లండన్: తన భర్త డేవిడ్ బెక్కామ్ చాలా రోమాంటిక్ ఫెలో అని ప్రముఖ గాయని, ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా చెప్పింది. ఒకప్పటి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆయన చెప్పలేనంత రోమాంటికల్ పర్సన్ అయినా కుటుంబ విషయంలో అతడికి ఉన్న కమిట్ మెంట్‌కే ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పుకొచ్చింది. 'డేవిడ్ చాలా రోమాంటిక్. మేము ప్రతి రోజు ఒకరినొకరం ఆశ్యర్యపరుచుకునేందుకు ఏదో ఒకటి చేస్తుంటాం. తొలిసారి నేను డేవిడ్‌ను 20 ఏళ్ల కిందట కలిశాను. ఆ సమయంలో ఫుట్ బాల్ మ్యాచ్ లో ఉన్నాము. మ్యాచ్ ముగిశాక అందరూ తమ స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్తుంటే ఒక్క డేవిడ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో ఉన్నాడు. అతడి అమ్మ నాన్న, సోదరితో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది.. అతడు తన కుటుంబానికి ఎంత విలువ ఇస్తాడో అని. నన్ను పెళ్లి చేసుకునేందుకు నా తండ్రి అనుమతి కోరిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. ఓ మోకాలిపై కూర్చుని మరీ మీ కూతురుని నాకు ఇవ్వరా అంకుల్ అంటూ అడిగి ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడి గౌరవం చూసి అబ్బుర పోయాం' అంటూ విక్టోరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విక్టోరియా, డేవిడ్ దంపతులకు నలుగురు పిల్లలు. -
సూసైడ్ బాంబర్ ను బతికించాలనుకున్నా...
పారిస్ : ఫ్రెంచ్ కు చెందిన ఓ నర్స్ కాంప్తోయిర్ వోల్టైర్ వోల్టైర్ కేఫేలో కాల్పులు సందర్భంగా తనను తనను తాను పేల్చుకున్న ఉగ్రవాదిని కాపాడబోయాడట. పారిస్ లో వరస ఉగ్రదాడుల్లో భాగంగా కెఫే లో కూడా కాల్పుల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారిస్ లో ఒక హాస్పిటల్ లో పనిచేసే డేవిడ్ (46) అతని స్నేహితునితో కలిసి కెఫేకి డిన్నర్ కి వచ్చాడు. ఇంతలో పెద్ద పేలుడు సంభవించింది. డేవిడ్ వెంటనే అప్రమత్తమయ్యాడు. హెటోల్ లో ఉన్న గ్యాస్ ఆఫ్ చేయమంటూ గట్టిగా అరుస్తూ గాయపడిని వారిని ఆదుకునే పనిలో పడ్డాడు. ఇంతలో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉన్న వ్యక్తిని గమనించాడు. అతని నడుముకు రకరకాల రంగుల్లో ఉన్న వైర్లను చూసి షాకయ్యాడు. వెంటనే అతనికి పరిస్థితి అర్థమై ప్రాణాలను దక్కించుకున్నాడు. 'భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ హడావుడిగా పరుగెత్తుతున్నారు. నెత్తురోడుతున్న ఓ మహిళను, ఓ యువకుడిని కాపాడాను. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పృహలేనట్టుగా పడి ఉన్నాడు. అతను మామూలు కస్టమర్ అనుకున్నా. అతడిని సేవ్ చేయాలనుకున్నా... కృత్రిమ శ్వాస (సీపీఆర్) అందించే క్రమంలో అతని చొక్కాను తొలగించా. పెద్ద గాయమైంది. దాదాపు 30 సెం.మీ మేర లోతైన గాయంతో పాటు తెలుపు,ఎరువు, నలుపు, ఆరెంజ్ రంగుల్లో వైర్లు అవీ చూస్తే దిమ్మతిరిగింది. ఏదో పేలుడు పదార్థం అని, అతను సూసైడ్ బాంబర్ అని అర్థమైంది. వెంటనే సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేస్తున్న పైర్ సిబ్బందిని అలర్ట్ చేసి.. డైనింగ్ రూం వదిలి టెర్రస్ మీదికి పరుగెత్తా..లేదంటే నా ప్రాణాలు కూడా గాల్లోకి కలిసేవే అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే కెఫే లో ఉగ్రవాదిని ఇద్దరు వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసిన ఘటన వీడియోలో రికార్డయింది. ఒకరు డేవిడ్ కాగా మరొకరు ఎవరో ఇంకా తెలియలేదు. ఈ ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాది అబ్దె సలాం హతమయ్యాడు. -
సింఫనీ సరిగమలు
బాల్యంలో చర్చ్‌లో పాటలు వింటూ తనదైన లోకంలోకి వెళ్లిపోయేవాడు డేవిడ్ చేస్. అప్పుడే అనిపించింది తనకి లైఫ్ ఈజ్ మ్యూజిక్ అని! అందుకే ప్యాషన్‌తో నేర్చుకున్న మ్యూజిక్‌ను ప్రొఫెషన్‌గా మార్చుకున్నాడు! నగరంలో పాశ్చాత్య సంగీతం పరిచయం లేని సమయంలోనే... ‘సింఫనీ అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ ఏర్పాటు చేశాడు. 22 ఏళ్లుగా నగరానికి సంగీత సేవలందిస్తున్న డేవిడ్, ఆయన అకాడమీ ‘సింఫనీ’ పరిచయం.. భక్త రామదాసు మ్యూజిక్ కాలేజీలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్న డేవిడ్.. లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో వెస్ట్రన్ మ్యూజిక్‌ను ఒంటబట్టించుకున్నాడు. శాస్త్రీయ సంగీతంతోపాటు, పాశ్చాత్య సంగీత పరిమళాలను సిటీవాసులకు పంచాలనుకున్నాడు. 1992లో ఎస్.ఆర్.నగర్లో ‘సింఫనీ అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ ఏర్పాటు చేశాడు. నాటి నుంచి అప్రతిహతంగా సాగిపోతున్నదీ అకాడమీ. కార్ఖానా, తార్నాక, నేరేడ్మెట్లలో ఉన్న ఈ అకాడమీల్లో పియానో, కీబోర్డ్, గిటార్, జాజ్డ్రమ్స్, ప్యడ్స్, కాంగో డ్రమ్స్, వయోలిన్, వెస్ట్రన్ మ్యూజిక్‌తోపాటు.. ఫ్లూట్, తబల, హార్మోనియం, వీణ, వయోలిన్, హిందూస్థానీ, కర్ణాటకవంటి శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణనిచ్చి, సర్టిఫికెట్స్ అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్తో విదేశాల్లో ఎడ్యుకేషన్‌కి మార్గం సుగమమవుతుండటంతో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. ఇక్కడి విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా లభిస్తున్నాయి. నేర్చుకోవాలనుకుంటే... సాధారణంగా ఏదైనా వాయిద్యం నేర్చుకోవాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్ ఎవరికివారే తీసుకెళ్లాల్సి ఉంటుంది. విలువైన ఆ పరికరాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి సింఫనీ అకాడమీనే ఇన్స్ట్రుమెంట్స్ అరే ంజ్ చేస్తుంది. వయసుతో నిమిత్తం లే కుండా ఎవరైనా ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చు. సింఫనీ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకున్నవారెందరో సొంతగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేశారు. మరికొందరు బ్యాండ్స్ ఏర్పాటు చేసుకున్నారు. సంగీతమే జీవితమనుకునే పేద విద్యార్థులకు తన అకాడమీలోనే ఉద్యోగావకాశం కూడా కల్పిస్తున్నాడు డేవిడ్. అనాథలతో స్వరాలు.. సింఫనీ, సంపాదన అదే జీవితం కాదనుకున్నాడు డేవిడ్. అంధులను, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌ను, అనాథ బాలబాలికల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు.. రెండున్నర నెలల్లో 300 హోమ్స్ తిరిగాడు. మూడు వేల మంది పిల్లలను తీసుకొచ్చి ప్రతి శనివారం శిక్షణ ఇచ్చాడు. 2013లో అకాడమీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... హరిహరకళాభవన్ వేదికగా వాళ్లందరితో ప్రదర్శన ఇప్పించాడు. వీలున్నప్పడుల్లా... హోమ్స్‌కి వెళ్తుంటాడు. ‘20 ఏళ్లలో సంపాదించిన దానికంటే.. ఆ పిల్లలతో గడిపిన సమయమే తనకు ఎక్కువగా సంతృప్తినిచ్చింది’ అని చెబుతాడు డేవిడ్! వాళ్లలో కొందరినైనా ప్రొఫెషనల్ మ్యుజీషియన్స్ చేయాలన్నది తన లక్ష్యమంటాడు డేవిడ్! -
నమ్మకమే జీవితం..
ద వాల్ట్.. అమెరికాలోని వ్యాలీసిటీ అనే చిన్న పట్టణంలో ఉన్న ఓ కాఫీ షాప్.. అన్ని షాపుల్లాగే.. ఇక్కడ మనకు కాఫీ, టీ, బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ దాన్ని మీకు అందివ్వడానికి మాత్రం ఎవరూ ఉండరు.. సెల్ఫ్ సర్వీసే.. అంతేకాదు.. కనీసం మీ బిల్లు ఎంతయింది అన్నది చెప్పడానికీ ఎవరూ ఉండరు. అదే సమయంలో మనం తిన్నదానికి డబ్బులు తీసుకోవడానికి కూడా.. అంటే.. ఎవరూ మిమ్మల్ని డబ్బులు అడగరన్నమాట. మరెలా నడుస్తుంది ఈ కాఫీ షాప్.. నమ్మకం మీద.. నిజాయితీ మీద.. ఈ కాలంలోనూ వీటిని నమ్ముకుని బిజినెస్ చేస్తారా అని అనుకోవద్దు. డేవిడ్ వీటిని నమ్ముకునే ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. తన కాఫీ షాపులోకి వచ్చే వారి నిజాయితీ మీద తనకు పరిపూర్ణ నమ్మకముందని.. అందుకే వేరే సిబ్బంది ఎవరినీ నియమించలేదని డే విడ్ చెప్పారు. ఇంతకీ ‘ద వాల్ట్’ ఎలా పనిచేస్తుందంటే.. మనం కాఫీ షాపులోకి వెళ్లాం.. కాఫీ లేదా టీ తాగాలనుకున్నాం.. కొన్ని బిస్కెట్స్, ప్రేస్ట్రీ తినాలనుకున్నాం. లోపలికి వెళ్లగానే.. అక్కడ కాఫీ, టీ తయారుచేసే యంత్రాలు ఉంటాయి. దాన్నుంచి.. మనకు కావాల్సినది మనం తయారుచేసేసుకోవడమే.. తర్వాత అక్కడే రెడీగా ఉండే బిస్కెట్స్, ప్రేస్ట్రీ తీసుకుని.. లాగించేయడమే.. తర్వాత మనం తిన్నదానికి బిల్లు ఎంత అయివుంటుందో లెక్కేసుకుని.. మనం మటుకు మనమే డబ్బులు కట్టేయాలి. చెక్కులకు వేరేగా.. నగదుకు వేరేగా బాక్సుల్లాంటివి ఉంటాయి. వాటిలో వేసేయడమే.. క్రెడిట్ కార్డు అయితే.. మెషీన్ వద్ద మనమే గీకాల్సి ఉంటుంది. ఈ కాలంలో అడిగితేనే సరిగా ఇవ్వడం లేదు.. అడక్కుండా ఎవరంత నిజాయితీగా డబ్బులు తమకు తామే కట్టేస్తారు అని అనుకోవచ్చు. అయితే.. అందరి అంచనాలు తప్పయ్యాయి. తన కస్టమర్ల నిజాయితీ మీద డేవిడ్‌కు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు. కొన్ని రోజుల తర్వాత తాము ఉంచిన సామాన్లకు అయిన ఖర్చు.. వచ్చిన డబ్బు లెక్కేస్తే.. లాభం పోగా.. మరో 15 శాతం ఎక్కువే వచ్చిందట. నిజాయితీ, నమ్మకం అనే పునాదులపై గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఈ కాఫీ షాప్ బ్రహ్మాండంగా నడుస్తోంది. -
వ్యాపార సేవకులు
ఆ న లుగురు కాలేజీలో కలిశారు... వాళ్లతో పాటు అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కూడా కలిశాయి. ఒకే బెంచ్‌లో కూర్చోసాగారు, ఒకే బ్యాచ్‌గా మారారు. చదువు అయిపోగానే నలుగురు కలిసి మొదట ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకొన్నారు. ఈ ప్రయాణంలో జీవిత సత్యాన్ని న్వేషిద్దామనుకొన్నారు. అయితే దాని వల్ల తమకు ప్రపంచంతో పరిచయం ఏర్పడుతుందేమో కానీ, ప్రపంచానికి తాము పరిచయం కామన్న విషయాన్ని అర్థం చేసుకొన్నారు. ఈ ప్రపంచంలో తాము ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకొన్నారు. అలా ఆలోచించిన ఆ మిత్రబృందం మొదలు పెట్టినదే ‘వార్బీ పార్కర్’. దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతూ అందరి కళ్లకూ కనిపిస్తున్న కళ్ల జోడు కంపెనీ ఇది. దీని వ్యవస్థాపకులైన నలుగురు స్నేహితులే నీల్, ఆండ్రూ, జెఫ్రీ, డేవిడ్. ఒక కళ్ల జోడు సెట్‌ను అమ్మితే... మరో కళ్ల జోడు సెట్‌ను అవసరార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఈ కంపెనీ సిద్ధాంతం! ఇదే సిద్ధాంతంతో నాలుగేళ్లలోనే దృష్టిలోపంతో బాధపడుతున్న అవసరార్థులకు ఏకంగా 50 లక్షల కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది ఈ సంస్థ. మెదడు, మనసు ఉన్న నలుగురు యువకుల ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన కంపెనీ ఇది. ఒకవైపు నాణ్యతతోనూ, నవ్యతతోనూ వినియోగదారులను ఆకట్టుకొంటూనే.. స్వచ్ఛంద సేవలోనూ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. సేవకు వ్యాపారమే ఊతం!: దృష్టి దోషం ఉన్న వాళ్లకు అవసరమయ్యే కళ్ల జోళ్లను, సన్ గ్లాసెస్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్తన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డేవిడ్ గిల్ బో, నీల్ మెంథ్నల్, ఆండ్రూ హంట్, జెఫ్రీ రైడర్ లు తమకు తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చిన 2,500 డాలర్ల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే తద్వారా వచ్చిన లాభంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది ఆ నలుగురు యువకుల ప్రణాళిక. మరి వీళ్ల లక్ష్యం మంచిది, వీళ్ల శ్రమ చిత్తశుద్ధితో కూడుకొన్నది.. దీంతో కళ్ల జోళ్లవాడకంపై మంచి క్రేజ్ ఉన్న అమెరికా దేశంలో ఆ కంపెనీకి కూడా మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి తక్కువ కావడంతో.. తాము ఉత్పత్తి చేసిన కళ్లజోళ్లను ఎలా అమ్మాలో కూడా ఈ యువకులకు మొదట అర్థం కాలేదు. ఆ సమయంలో వీళ్లకు వోగ్డాట్కామ్ సహాయకారిగా నిలిచింది. ఈ నలుగురు యువకుల ప్రణాళికను, తపనను అందరికీ తెలియజెప్పింది. వీళ్ల వెబ్సైట్ అడ్రస్‌ను ఇచ్చి అమ్మకాలకు ఊపుతెచ్చింది. మీరు ఒక కళ్ల జోడును కొంటే, మేము అవసరార్థులకు ఉచితంగా ఒక కళ్ల జోడును పంపిణీ చేస్తాం(బయ్ వన్, గివ్ వన్) అనే విధానం నచ్చి చాలా మంది వీళ్ల ద గ్గరే కళ్ల జోళ్లను కొనసాగారు. ఇండియాపైన దృష్టి...: దృష్టి లోపాలతో బాధపడుతూ కూడా కళ్లజోడును కొనుక్కోలేనంత పేదరికం ఉండేది పేద ఆఫ్రికా, ఆసియాదేశాల ప్రజల్లోనే. ఈ విషయం గ్రహించి వీళ్లు ముందుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లపై దృష్టి సారించారు ఈ స్నేహితులు. విజన్ స్ప్రింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచే సరికి ఐదు మిలియన్ల కళ్ల జోళ్లను పంపిణీ చేయించి ఈ కంపెనీ బాసులుగా ఉన్న ఆ నలుగురు యువకులు తమ సత్తాను రెండు విధాలుగా చాటుకొన్నారు. సాధారణ నేపథ్యం...: వీళ్ల ఆలోచన తీరు వైవిధ్యమైనది కానీ ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేకమంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్న దుకాణాల సంఖ్య తక్కువే. ప్రధానంగా వెబ్సైట్ ఆధారంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ‘బయ్ వన్ -గివ్ వన్’అనే నినాదాన్ని అమలు పెట్టడం అనేది మాటల్లో చెప్పినంతటి సులభమైన వ్యవహారం కాదు. దానకర్ణులుగా పేరు పొందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విరాళం విషయంలో ఇలాంటి విధానాన్ని అమల్లో పెట్టే సాహసం చేయలేదు. కానీ తాము అనుకొన్న విధానాన్ని అమలులో పెట్టి ఈ నలుగురు యువకులు తమ శక్తి యుక్తులు ఏ స్థాయివో నిరూపించారు. ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేక మంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. -
ఆ హాస్యం చిరస్మరణీయం
చెరుకు గడలా పొడవైన ఆకారం... దానికి తోడు మూతిపై ఫ్రెంచ్ మీసం... తెలుగుదనం ఉట్టిపడేట్టు లాల్చీ, పంచెకట్టు... భుజాలను ఎగరేస్తూ విచిత్రమైన నడక... ఠపీమని ఆగి... అలాగే వెనక్కు తిరిగి... నెల్లూరు యాసలో నోరెళ్లపెట్టి.. ‘యట్టా...’ అన్నాడంతే... థియేటర్లో నవ్వులే నవ్వులు. ఆ నవ్వులు అలాగే ఇరవై ఏళ్ల పైచిలుకు నిరాటంకంగా థియేటర్లలో వినిపించాయి. ఆ మాటకొస్తే ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి రమణారెడ్డా మజాకా! ఎన్ని హిట్ సినిమాల్లో నటించినా... రెండేళ్లు తెరపై కనిపించకపోతే... ఆ నటుడ్ని ఈజీగా మరిచిపోతున్న రోజులివి. అలాంటి ఓ నటుడు భౌతికంగా దూరమై 39 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఆ జ్ఞాపకాలు, ఆ పాత్రలు, ఆ మేనరిజాలు జనాల హృదయాల్లో పచ్చబొట్టులా నిలిచిపోయాయంటే.. ఆ వ్యక్తి ఎంత సాధించి ఉండాలి? అందుకే రమణారెడ్డి చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. నేడు ఆ మహానటుని వర్థంతి. అందుకే కాసేపు స్మరించుకుందాం. రమణారెడ్డి నెల్లూరు ప్రాంత వాసి. ఉద్యోగం శానిటరీ ఇన్స్పెక్టర్. సద్యోగం నాటకాలు వేయడం, మోనో యాక్టింగ్. సెలవు దొరికితే చాలు... చలో చెన్నపట్నం అనేవారు. అవకాశాల కోసం నిర్మాతల్నీ దర్శకుల్ని కలుస్తూ ఉండేవారు. నిర్మాత శంకరరావు... ఆయన నిర్మించిన ‘మాయ పిల్ల’(1951) సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. పాత్ర మంచిదే. సినిమానే సరిగ్గా ఆడలా. దాంతో రెడ్డిగారు జనాల్లో రిజిస్టరవ్వలా. కానీ మొక్కవోని ధైర్యంగా ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేసి, అవకాశాలకోసం ప్రయత్నాలు సాగించారు రమణారెడ్డి. ఈ క్రమంలో ఆయన నటించిన చిత్రాలు దీక్ష, మానవతి, కన్నతల్లి. ఇవి కూడా ఆయనకు పెద్దగా పేరు తేలా. అప్పుడొచ్చింది ‘మిస్సమ్మ’. అందులో చేసిన ‘డేవిడ్’ పాత్ర రమణారెడ్డిని స్టార్‌ని చేసేసింది. ‘మేరీ... ప్లీజ్’ అని రమణారెడ్డి..., ‘ధర్మ... ప్లీజ్’ అని రేలంగి... ఆ సినిమాలో చేసిన అల్లరి అంతాఇంతానా. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి కామెడీ పంట పండించిన సినిమాలు ఎన్నో. ‘హాలీవుడ్‌కి లారెల్-హార్డీ... తెలుగు తెరకు రేలంగి-రమణారెడ్డి అంతే...’ అన్నారంతా. రమణారెడ్డి అనగానే చటుక్కున గుర్తొచ్చే పాత్ర ‘చినమయ’. ‘మాయాబజార్’లోని ఈ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చింది. ‘ఓరి నీ తెలివీ... అస్మదీయులకు విరుగుడు తస్మతీయులని వీడు కొత్త పదం కనిపెట్టాడు ప్రభూ...’ అంటూ చినమయగా... నెల్లూరు యాసలో రమణారెడ్డి చెప్పిన డైలాగ్ మరిచిపోగలమా. ‘అం అహా... ఇం ఇహీ... ఉం ఉహూ...’ అంటూ ప్రేక్షకులను నిజంగానే మంత్రముగ్ధుల్ని చేశారాయన. ‘పౌరాణిక పాత్ర చేస్తూ ఆ నెల్లూరు యాసేంటి?’ అని అడిగితే.. ‘నా భాష అది, ఎట్టా వదులుద్ది’ అనేవారు రమణారెడ్డి. ‘గుండమ్మకథ’ చిత్రంలోని ‘గంటన్న’ పాత్ర రమణారెడ్డి పోషించిన పాత్రల్లో మరపురానిది. ‘ఏమవుతాను... ఎత్తికుదేస్తే రెండు చక్కలవుతాను. వరసకు అన్ననూ... జీతంబెత్తం లేని గుమస్తాను. నన్ను గంటన్న అంటార్లేండీ...’ అంటూ ఆయన ధాటిగా చెప్పిన డైలాగులు ఇంకా జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. రమణారెడ్డి అనగానే... ఇల్లరికం, కులగోత్రాలు, దీపావళి, హరిశ్చంద్ర, కార్తవరాయుని కథ, భార్యాభర్తలు... ఇలా లెక్కకు మించిన ఆణిముత్యాలు గుర్తొస్తాయి. రమణారెడ్డికి మేజిక్ చేయడం సరదా. ఆయన మంచి మెజీషియన్ కూడా. స్వచ్ఛంద సంస్థల కోసం ఆయన పలు మేజిక్ షోలు చేసేవారు. ‘కుటుంబ సేవకు సినిమాలు ఎలాగూ ఉన్నాయి. ఈ మేజిక్షోలు సమాజ సేవ కోసం’ అనేవారాయన. కె.ఎస్.ప్రకాశరావుగారు ఓ చిత్రంలో రమణారెడ్డితో నారద పాత్ర వేయించారు. ఆయన వద్దని వారించినా ప్రకాశరావుగారు వినలేదట. దాంతో తప్పక నారదునిగా నటించారు రమణారెడ్డి. అస్తిపంజరం లాంటి ఆ ఆకారం కనిపించకుండా... ఆయనకు ఒక జుబ్బా కూడా తొడిగారు. షూటింగ్ అయిపోగానే... ‘మరి నాతో హనుమంతుడి పాత్ర ఎప్పుడు వేయిస్తున్నారు’ అని ప్రకాశరావుతో చమత్కరించారట రమణారెడ్డి. రమణారెడ్డి మృదుభాషి. జోకు పేల్చి సెలైంట్‌గా ఉండటం ఆయన స్టైల్. రెండు దశాబ్దాల పాటు అందరినీ నవ్వించిన ఆయన... 54 నాలుగేళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రమణారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఆయన పాత్రలు మాత్రం జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.