8న తెరపైకి ఆనబెల్‌ క్రియేషన్‌ | Annabel Creation will be released on August 18th in English, Hindi, Tamil and Telugu | Sakshi
Sakshi News home page

8న తెరపైకి ఆనబెల్‌ క్రియేషన్‌

Published Sun, Jul 30 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

8న తెరపైకి ఆనబెల్‌ క్రియేషన్‌

8న తెరపైకి ఆనబెల్‌ క్రియేషన్‌

తమిళసినిమా: హాలీవుడ్‌ చిత్రాలను ఆసక్తిగా చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి వస్తోంది ఆనబెల్‌ క్రియేషన్‌ చిత్రం. ఈ చిత్రానికి చాలా విశేషాలున్నాయి. 2014లో వచ్చిన ఆనబెల్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ల అమెరికన్‌ డాలర్ల వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల వరుసలో నిలిచింది. అదే విధంగా ది కంజూరింగ్‌ సిరీస్‌ చిత్రాలు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన విషయం తెలిసిందే.

ది కంజూరిగ్‌ చిత్రానికి నాలుగవ భాగంగా వస్తున్న చిత్రం ఆనబెల్‌ క్రియేషన్‌. 2014లో వచ్చిన ఆనబెల్‌ చిత్రం ఒక్క భారతదేశంలోనే రూ. 83.5 కోట్లను వసూలు చేసి రికార్డు సాధించింది. ఆ చిత్ర దర్శకుడు డేవిడ్‌ ఎఫ్‌.శాండ్‌బెర్గిన్‌నే తాజా చిత్రం ఆనబెల్‌ క్రియేషన్‌కు దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 18న ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు. ఆనబెల్‌ క్రియేషన్‌ చిత్రం ప్రేక్షకులను మూడు రకాల భావాలకు గురి చేస్తుందని దర్శకుడు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement