తెరపై తండ్రి కూతురు.. నిజజీవితంలో ఆమెపై వేధింపులు | Millie Bobby Brown Sensational Allegations On Co-Star David Harbour During Stranger Things 5 Shoot | Sakshi
Sakshi News home page

మరికొద్ది రోజుల్లో సిరీస్ రిలీజ్.. ఇంతలోపే నటుడిపై నటి ఫిర్యాదు

Nov 2 2025 8:42 PM | Updated on Nov 3 2025 3:55 PM

Starnger Things Bobby Brown Complaint On Co Star David harbour

ఓటీటీలో 'స్ట్రేంజర్ థ్రింగ్స్' అనే వెబ్ సిరీస్ మన దగ్గర కూడా బాగానే ఫేమస్. సూపర్ హీరో అడ్వెంచరస్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే నాలుగు సీజన్లు వచ్చాయి. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ నెలలో చివరిదైన ఐదో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇంతలోనే ఇందులో లీడ్ రోల్ చేసిన నటి.. సహనటుడిగా చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.

ఈ సిరీస్‌లో మిల్లీ బాబీ బ్రౌన్, ఎలెవన్ అనే పాత్ర చేయగా.. డేవిడ్ హార్బర్, జిమ్ హాపర్ అనే పోలీస్ రోల్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ తండ్రి కూతురిగా నటించారు. కానీ నిజజీవితంలో మాత్రం మిల్లీని డేవిడ్ వేధించడంతో పాటు ఏడిపించాడట కూడా. ఇదంతా కూడా ఐదో సీజన్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగిందని మిల్లీ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయమై నెట్‌ఫ్లిక్స్ సంస్థ దర్యాప్తు చేస్తోంది.

(ఇదీ చదవండి: అప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు డీజే)

షూటింగ్ టైంలో ఈ వేధింపులు జరగడంతో చాన్నాళ్ల క్రితమే మిల్లీ, డేవిడ్‌పై ఫిర్యాదు చేసిందని.. తర్వాత నెలల పాటు విచారణ సాగుతూనే ఉందట. తాజాగా ఈ విషయం బయటపడింది. సిరీస్ చివరి సీజన్ రిలీజ్ మరికొద్ది రోజులు ఉందనగా ఇదంతా బయటకు రావడం నటి అభిమానులకు షాకింగ్ అనిపించింది.

చివరిదైన ఐదో సీజన్ విషయానికొస్తే.. రీసెంట్‌గానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31న ఫైనల్ సీజన్‌కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ విడతలవారీగా రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: రూ.200 కోట్ల వివాదం.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement