నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ | Bellamkonda Srinivas Engagement With Kavya Reddy, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Bellamkonda Srinivas: కావ్యతో ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

Apr 5 2026 8:32 PM | Updated on Apr 6 2026 4:52 PM

Bellamkonda Srinivas Engagement With Kavya Reddy Latest

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరిగింది. కాబోయే వధూవరులిద్దరూ కలర్‌ఫుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. అల్లుడు శ్రీను మొదటి మూవీ కాగా.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

శ్రీనివాస్‌కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోగా.. 29వ తేదీన తిరుపతిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి జరగనుంది.

(ఇదీ చదవండి: కాలి నడకనే తిరుమలకు ఎందుకు వెళ్తానంటే?: జాన్వీ కపూర్‌)

Advertisement
 
Advertisement
Advertisement