జడ్జిగారు తీర్పు చెప్పేశారు. డేవిడ్ గారు శారా గారికి 1,20,000 డాలర్లు చెల్లించాలి! ఇంతమొత్తం అంటే మన కరెన్సీలో 58 లక్షల 38 వేల 723 రూపాయలు. పెద్ద మొత్తమే. కానీ శారా సంతోషించింది అంత పెద్ద మొత్తానికి కాదు. డేవిడ్‌ను తను కోర్టుకు ఈడ్చగలిగింది. తనకు జరిగిన అవమానం చిన్నది కాదు అని జడ్జిగారు కూడా భావించారు. వీటికన్నా ముఖ్యం.. మహిళల్ని చులకన చేసి మాట్లాడ్డానికి ఇకనుంచీ పురుషులు జంకుతారు. అది కావాలి తనకు. డేవిడ్ పెద్ద మనిషి. 67 ఏళ్ల మనిషి. ఇంకా పెద్ద విషయం.. ఆస్ట్రేలియా పార్లమెంటులో అధికార ‘లిబరల్ డెమోక్రాటిక్’ పార్టీ సెనెటర్. ఆయనపై ఇప్పుడు కేసు గెలిచిన శారా ఆయనతో పోలిస్తే చాలా చిన్న. వయసు 37 ఏళ్లు. ‘గ్రీన్’ పార్టీ సెనెటర్. 2018 జూన్‌లో ఆస్ట్రేలియా పార్లమెంటులో ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు అంత పెద్ద డేవిడ్‌గారు శారాను తటాలున అనకూడని మాట అనేశారు.
తటాలున అనేశాడనీ అనుకున్నారు మిగతా సెనెటర్‌లు కూడా. కానీ ఆయన పదే పదే శారాను ఆ మాట అంటూ ఉండటంతో కావాలనే అంటున్నారని అర్థమైంది. సారీ చెప్పమన్నారు శారా. చెప్పను అన్నారు డేవిడ్‌గారు. శారా కోర్టుకు వెళ్లారు. ఏడాదికి పైగా కేసు నడిచి శారాకు అనుకూలం గా సోమవారం తీర్పు వచ్చింది. ఇంతకీ డేవిడ్ శారాను అన్న మాట ఏమిటి? ‘స్టాప్ షాగింగ్ మెన్’ అన్నారు! షాగింగ్ అనే మాటకు సాధారణ అర్థం ‘వెంటపడడం’. ‘ముగ్గులోకి దింపడం’ అని వేరే అర్థం కూడా ఉంది.. ‘స్టాప్ షాగింగ్ మెన్’ అంటే మగాళ్లను ముగ్గులోకి దింపడం మానెయ్’ మని అర్థం. పెప్పర్ స్ప్రే వాడకాన్ని నిషేధించాలా వద్దా అనే అంశం పై సభలో వేడిగా చర్చ జరుగుతున్నప్పుడు డేవిడ్ సహనం కోల్పోయి శారాను ఇలా అనేశారు పరువునష్ట పరిహారాన్ని చెల్లించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment