defamation suite
-
బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వరంగల్ సీపీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, జరిగిన పరిణామాలతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పేపర్ లీక్ కేసులో సంజయ్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్.. వరంగల్ సీపీ రంగనాథ్‌పై పరువునష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు. టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని సంజయ్ కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను కూడా సంజయ్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. తన హక్కుల భంగంతోపాటు ఇతర విషయాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన చేసిన ఆరోపణలపై కూడా పోరాటం చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. నా ఫోన్ ఇవ్వడం లేదని అంటున్నారు. ముందు సీపీ ఫోన్‌కాల్ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈటల రాజేందర్ ఫోన్ అడిగే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. నా ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందని అన్నారు. మీ దగ్గరే నా ఫోన్ పెట్టుకుని నన్ను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. -
ఆమె వల్లే అన్ని కోల్పోయా.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కెరీర్ నాశనం చేసేందుకు యత్నించారని నోరా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలతో షోలు, ప్రముఖ బ్రాండ్ ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది. ఆ వార్తలు మీడియాలో రావడంతో తన పరువు పోయిందని ఆమె అన్నారు. జాక్వెలిన్ తన పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నోరా ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువునష్టం దావా వేసింది బాలీవుడ్ భామ. (ఇది చదవండి: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్) గతంలో జాక్వెలిన్ కోర్టు ముందు రాతపూర్వక వివరణ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ నన్ను తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి ప్రముఖులు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు కూడా పొందారని తెలిపింది. అయితే సుఖేష్ నుంచి తనకు ఎలాంటి బహుమతులు అందలేదని.. నేరుగా అతనితో ఎలాంటి సంబంధం లేదని నోరా పేర్కొంది. ఈ పిటిషన్లో అనేక మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె పేర్కొంది. మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేయడం సామూహిక దాడి చేయడంతో సమానమని నోరా ఫతేహీ ఆరోపించింది. తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలిపింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై చాలా గౌరవం ఉందని .. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు నటీమణులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు. -
‘యశోద’ సినిమాపై పరువు నష్టం దావా
బంజారాహిల్స్: యశోద సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని.. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు హరీష్ నారాయణ్, హరిశంకర్, నటి సమంతపై రూ.5 కోట్ల పరువు నష్టందావా వేసినట్లు ఇవ–ఐవీఎఫ్ ఎండీ మోహన్‌రావు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఇవ ఐవీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినిమాలో సరోగసీ స్కాంను వెలికి తీసే దృశ్యాల్లో తమ సంస్థ పేరును వాడుకుని తప్పుచేశారన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా సినిమాలో ఇవ ఐవీఎఫ్ పేరు ను పలుచోట్ల ప్రస్తావించడంతోపాటు దృశ్యాల్లోనూ తమ ఆస్పత్రిని చూపించారని ఆరోపించారు. ఇదీ చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం! -
ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని.. ఐపీఎస్ ఆఫీసర్ జి. సంపత్ కుమార్‌పై మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తి కలిగించింది. క్రికెట్ బెట్టింగ్ సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ధోనీ ఆరోపించాడు. ధోని పిటిషన్ ప్రకారం.. 2014లో హైకోర్టులో సంపత్ కుమార్ దావా వేశారని.. గతంలో ఆయన చేసిన ఆరోపణలు తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఐపీఎస్ సంపత్ కుమార్ సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు ధోని తెలిపాడు. చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం -
రూ.1400 కోట్ల స్కాం: ఆప్ నేతలపై ఎల్జీ పరువునష్టం దావా!
సాక్షి, న్యూఢిల్లీ: రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. తనపై తప్పుడు, గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్, సౌరభ్ భరద్వాజ్‌లతో పాటు పలువురు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది ఎల్జీ కార్యాలయం. 2016 నోట్ల రద్దు సమయంలో ఎల్జీ సక్సెనా సుమారు రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాదీ విభాగనికి ఛైర్మన్‌గా ఉండి ఆ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు సక్సేనా. ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ కమిషన్ ఛైర్మన్ జాస్మిన్ షాపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఒకరిపై ఆరోపణలు చేసేందుకు గంతులేస్తూ వచ్చే లక్షణం కేజ్రీవాల్ అండ్ కోది. ఆప్ నేతలు చేసిన తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలపై ఎల్జీ ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్ నేతలు తప్పించుకోలేరు.’ అని ఎల్జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
లిక్కర్ స్కాం కేసు: ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు బంజారాహిల్స్ సీఐ నరేందర్ తెలిపారు. కాగా, వారిలో 26 మంది అరస్ట్ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక, నిందితులపై ఐపీసీలో 341, 147, 148, 353, 332, 509, రెడ్ విత్ 149 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మేం తలుచుకుంటే మీరుంటారా.. మీ పార్టీ ఆఫీసులు ఉంటాయా: టీఆర్ఎస్ వార్నింగ్ -
తగ్గేదేలే.. బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణం తెలంగాణకు తాకింది. లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.. కాగా, బీజేపీ ఆరోపణలపై కవిత పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆమె చర్చలు జరిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కామ్: కేసీఆర్ కూతుర్ని కాబట్టే టార్గెట్ చేశారు.. కవిత ఫైర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని కవిత అన్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదు. బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆమె అన్నారు. -
మదురై దంపతులకు షాక్ ఇచ్చిన ధనుష్.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’
చెన్నై: మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. తమ జీవనాధారం కోసం నెలకు రూ.60 వేలు చొప్పున ఇవ్వాలంటూ ధనుష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో తమకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామంటూ కదిరేశన్ దంపతులకు నటుడు ధనుష్ తన లాయర్ ద్వారా నోటీసులు పంపారు. -
తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఏడు రోజుల్లో!
సాక్షి, ఖమ్మం లీగల్: ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పేరి వెంకటరమణ, పేరి ప్రభాకర్ ద్వారా ఆయన మల్లన్నకు నోటీసులు పంపించారు. ప్రజాసేవలో ఉన్న తమ క్లయింట్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారం పొందాలనే దురుద్దేశంతో తీన్మార్ మల్లన్న తన చానల్, పత్రికలో అబద్ధాలు ప్రసారం చేశారని నోటీసులో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని తెలిపారు. ఈమేరకు సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని, దీంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు బాధ్యులవుతారని పేర్కొన్నారు. కాగా, ఏడు రోజుల్లోగా తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు నోటీసులో సూచించారు. చదవండి: VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా -
జర్నలిస్ట్‌పై ఆరోపణలు.. సాహాకు దిమ్మతిరిగిపోయే కౌంటర్
ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తనను బెదిరించాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జర్నలిస్ట్ సాహాపై పరువు నష్టం దావా వేశాడు. ఇంటర్వ్యూ కోసం సాహాతో చాట్ చేసింది వాస్తవమేనని, కానీ తన మెసేజ్‌లను సాహా టాంపర్ చేశాడని జర్నలిస్ట్ బోరియా మజుందార్ ప్రత్యారోపణలు చేశాడు. There are always two sides to a story. @Wriddhipops has doctored, tampered screenshots of my WhatsApp chats which have damaged my reputation and credibility. I have requested the @BCCI for a fair hearing. My lawyers are serving @Wriddhipops a defamation notice. Let truth prevail. pic.twitter.com/XBsiFVpskl — Boria Majumdar (@BoriaMajumdar) March 5, 2022 భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసిన సాహా అభిమానుల సానుభూతి కోసమే తనపై ఆరోపణలు చేశాడని మజుందార్ పేర్కొన్నాడు. సాహా సోషల్ మీడియాలో షేర్ చేసిన చాట్స్ నకిలీవని, ఒరిజినల్ మెసేజ్‌లను కోర్టులో సమర్పిస్తానని తెలిపాడు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు మజుందార్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. కాగా, సాహా జర్నలిస్ట్‌పై చేసిన ఆరోపణలను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా చేపట్టింది. తొలుత జర్నలిస్ట్ పేరును వెల్లడించని సాహా విచారణలో భాగంగా సదరు జర్నలిస్ట్ పేరును కమిటీ ముందు వెల్లడించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో సాహా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ గంగూలీ తనకు భరోసా కల్పించినా, ద్రవిడ్ తనను రిటైర్మెంట్ గురించి ఆలోచించమన్నాడంటూ సాహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ -
అవి డిలీట్ చేయండి.. లేదంటే రూ.10 కోట్ల దావా: మంచు ఫ్యామిలీ వార్నింగ్
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల అనంతరం మంచు కుటుంబంపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ ట్రోల్స్ మరింత శృతి మించాయి. సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసిన విష్ణు మంచు, లక్ష్మి ప్రసన్నలపై ట్రోల్స్, మీమ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయి. చదవండి: భీమ్లా నాయక్‌కు ఓటీటీల పోటీ, భారీ డీల్‌కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు! నిన్న(ఫిబ్రవరి 18) విడుదలైన సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సినిమాలోని మోహన్ బాబు నటన, డైలాగ్స్‌పై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్నలతో పాటు మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా వదలడం లేదు. ఇప్పటికే మోహన్ బాబు ట్రోల్స్‌పై స్పందించి గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిన ట్రోల్స్ ఆగకపోవడం తాజాగా మంచు ఫ్యామిలీ స్పందించింది. చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్ ఇకనైన ట్రోల్స్ ఆపకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ మంచు ఫ్యామిలీ హెచ్చరించింది. ఈ మేరకు మంచు ఫ్యామిలీ టీం తరపున శేషు కుమార్ అనే వ్యక్తి లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. తక్షణమే టోల్స్‌కు సంబంధించిన వీడియోలు, మీమ్స్ పోస్ట్‌లు డిలిట్ చేయాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెట్టి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. -
సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా కొట్టివేత
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను ముంబై సిటీ సివిల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ ఫాంహౌజ్ పక్కనే ఉన్న ఓ స్థలాన్ని ఖేతన్ కక్కడ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. అయితే ఖేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనపైనా, తన ఫాంహౌస్‌పైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తన పరువుకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తనపై అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, ఇంటర్వ్యూ భాగం నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతూ ముంబై సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు తిరస్కరించింది. ఖేతన్ కక్కడ్‌పై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, దీనిపై తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ జడ్జి అనిల్ హెచ్ లద్దాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. -
తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైట్ చాలెంజ్ పేరిట రేవంత్ రెడ్డి.. కేటీఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలంటూ సవాలు విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. తాను పరీక్షలకు సిద్ధమే అని.. రాహుల్ గాంధీ రెడీనా అని ప్రతి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చట్టపరమైన చర్యలకు సిద్ధం అయ్యారు. (చదవండి: జైలుకు వెళ్లిన వ్యక్తి.. సీఎంను తిడతాడా?) తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘‘నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేశాను. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేరస్థులకు తగిన శిక్ష పడాలి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. (చదవండి: బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి ) Today I have invoked the legal process & filed a suit for defamation and injunction before the Hon’ble court I am confident that the Court process will clinchingly vindicate the falsity of the canards& lies spread against me and the culprits will be brought to book appropriately — KTR (@KTRTRS) September 20, 2021 చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి -
నాని ‘వీ’ చిత్రంపై కోర్టుకెక్కిన నటి..
బాలీవుడ్ ‘సోను కే టిటు కీ స్వీటీ’ చిత్రంలోని ‘బామ్ డిగ్గీ డిగ్గీ’ అనే పాటతో సాక్షి ప్రాచుర్యంలోకి వచ్చారు నటి, మోడల్ సాక్షి మాలిక్. ఇటీవల ఆమె టాలీవుడ్ హీరో నాని నటించిన వీ చిత్రంపై కోర్టుకెక్కారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిన ఈ చిత్రంలో అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని ఆరోపిస్తూ నిర్మాతపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన వీ చిత్రంలో.. మొబైల్ ఫోన్లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఉంది. అయితే ఆ ఫొటో తనదేనని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. దీనిపై స్పందించిన బాంబే కోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్ను ఉపయోగించడం చట్ట విరుద్ధమని, ఇలా వాడటం వల్ల తమ పరువుకు నష్టం కలింగించవచ్చని పేర్కొంది. సాక్షి మాలిక్ అభ్యంతరం తెలిపిన సినిమాలోని సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది, సీన్స్ డిలీట్ చేసిన తర్వాతనే సినిమాను తిరిగి అప్లోడ్ చేయాలని ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదేశించింది. అదే విధంగా తిరిగి అప్లోడ్ చేసేముందు సాక్షికి చూపించాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. కాగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంటర్ 5న ఓటీటీలో విడుదలైంది. చదవండి: నాని నో చెప్పాడు.. వైష్ణవ్ ఓకే చేశాడు -
అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కోర్టు శుక్రవారం అమిత్ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ‘‘ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరు కావాలి’’ అని బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాక అమిత్ షా మీద ఐపీసీ సెక్షన్ 500 కింద నమోదైన పరువు నష్టం కేసులో సమాధానం ఇవ్వాలని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. 2018 ఆగస్టు 11న కోల్‌కతాలో మాయో రోడ్లో బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్ సంజయ్ బసు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. చదవండి: దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్ -
ఆత్మవిశ్వాసమిచ్చే తీర్పు
మూడేళ్లక్రితం మన దేశంలో రగుల్కొన్న ‘మీ టూ’ ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో వేధింపులు, వివక్ష, అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా కుమిలిపోయే మహిళా లోకానికి ఆత్మసై్థర్యాన్నిచ్చే ఘట్టం. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తన పరువు దిగజారుస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా చెల్లుబాటు కాదని ఢిల్లీ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ఎంజే అక్బర్ పత్రికా సంపాదకుడిగా ఉన్న ప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని, అసభ్యంగా ప్రవర్తించేవారని పలువురు మహిళలు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలనీ, ఈ అసత్యారోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానని అప్పట్లో అక్బర్ హెచ్చరించారు. చివరకు ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత మన దేశంలో తొలిసారి బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సినీ రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు. ఆ తర్వాత ఫేస్బుక్ వేదికగా కొందరు మహిళలు తమకెదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. అందుకు కారకులెవరో వారి పేర్లతో సహా వెల్లడించారు. అయితే తమ వివ రాలేమిటో, ఆ వేధింపుల స్వభావం ఎటువంటిదో చెప్పకుండా, గోప్యంగా వుండి ఆరోపించే ధోరణి సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అది దాదాపు చల్లబడిపోతున్నదని అందరూ అనుకునే సమయంలో ప్రియా రమణి నేరుగా అక్బర్ పేరు వెల్లడించి, ఆయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేశారు. విచారణ సందర్భంగా అప్పట్లో తన వయసుకూ, ఆయన వయ సుకూ... ఆ సంస్థలో ఆయనకుండే పలుకుబడికీ... తన నిస్సహాయతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని వివరించారు. ఇవి బయటపెట్టడంలో తనకెలాంటి స్వప్రయోజనాలూ, దురుద్దేశాలూ లేవని చెప్పారు. ఈమధ్య ‘బ్రాస్ నోట్‌బుక్’ పేరుతో తన ఆత్మకథను వెలువరించిన ప్రముఖ ఆర్థికవేత్త దేవకీ జైన్ 1958లో పాతికేళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తనకెదురైన చేదు అనుభవాలనూ, అవి అనంతర కాలంలో తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనను ప్రతిఘటించినందుకు ఉద్యోగం కోల్పోవటంతోపాటు తన ఆత్మ విశ్వాసం ఎలా దెబ్బతిన్నదో తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే ప్రతి మహిళా ఇలాంటి దుస్థితిలోనే పడతారు. ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అన్నట్టు ఇలాంటి వేధింపులన్నీ మహిళ ఒంటరిగా వున్నప్పుడే జరుగుతాయి. వేధింపులకు పాల్పడే మాయగాళ్లు నలుగురిలో వున్నప్పుడు మర్యాదస్తుల్లా ప్రవ ర్తిస్తారు. మంచివారిలా మెలుగుతారు. అందువల్లే బాధిత మహిళ సహోద్యోగులకు చెప్పడానికి సంశయిస్తుంది. చెప్పినా తననే దోషిగా పరిగణిస్తారన్న భయం ఆమెను ఆవహిస్తుంది. చేస్తున్న ఉద్యోగం పోతుందేమోనని సందేహిస్తుంది. దీర్ఘకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని ‘మీ టూ’ ఉద్యమం బద్దలుకొట్టింది. దీనికి ముందు మన దేశంలో ఎవరూ ప్రశ్నిం చలేదని కాదు. రాజస్తాన్ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం 1997లోనే కీలకమైన తీర్పు వెలువరించింది. పనిచేసేచోట మహిళలకు వేధింపులు ఎదురుకాకుండా వుండటానికి తీసు కోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి చేష్టలు లైంగిక వేధింపులకిందికొస్తాయో ఆ మార్గదర్శకాలు వివరించాయి. ఆ తర్వాత పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు 2013లో ఒక చట్టం వచ్చింది. అయితే విషాదమేమంటే చట్టపరంగా ఎన్ని రక్షణలు కల్పించినా వేధింపులూ, వివక్ష సమసి పోలేదు. అటువంటి మహిళలకు ధైర్యాన్నిచ్చే విధంగా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు సైతం పట్టనట్టు వ్యవహరించటం అందుకు కారణం. రెండున్నర దశాబ్దాలక్రితం జరిగిందంటూ తనపై ప్రియా రమణి చేసిన ఆరోపణలవల్ల పాత్రికేయుడిగా, పత్రికా సంపాద కుడిగా జీవితపర్యంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ అక్బర్ చేసిన వాదనను మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అంగీకరించలేదు. మీ పరువు కోసం ఒక మహిళ జీవించే హక్కును పణంగా పెట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు. వేధింపులు ఎదుర్కొనటమేకాక, ముద్దాయిగా బోనులో నిలబడవలసివచ్చిన బాధితురాలి స్థితిగతుల్ని అవగాహన చేసుకుని ఎంతో పరిణతితో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గది. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కోసం ప్రియా రమణి 50 సార్లు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది. కేసులో ఓడిపోతే చెల్లించాల్సిన పరిహారం సంగతలావుంచి, క్రిమినల్ కేసు ఎదుర్కొనాల్సివచ్చేది. కానీ ఆమె నిబ్బరంగా పోరాడారు. ఆమె తరఫు న్యాయవాది రెబెకా జాన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పనిచేసే చోట నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న లక్షలాదిమంది బాధిత మహిళలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దోషులను బయటికీడ్చేందుకు దోహద పడుతుంది. -
మరో వివాదంలో కంగనా
ముంబయి : బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా రనౌత్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువునష్టం దావా వేశారు. వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకుభంగం కలిగించేలా వ్యాఖ్యానించిందని కంగనా రనౌత్‌పై జావేద్ అక్తర్ క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు చేశారు. ముంబైలోని అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ఐపీసీ సెక్షన్ 499, 500 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చేసిన పలు వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: ఉద్ధవ్ ఠాక్రేకు ఫైర్ బ్రాండ్ కౌంటర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కంగనా తన పేరును అనవసరంగా లాగిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నటుడు హృతిక్ రోషన్‌తో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడవద్దని అక్తర్ తనను బెదిరించారని ఆమె పేర్కొంది. కంగనా రనౌత్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూను లక్షల మంది చూశారని, ఇది తన ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అక్తర్ వాదించారు. దీంతో కంగనాపై క్రిమినల్ పరువు నష్టం దావాను విచారణకు స్వీకరించి తగు న్యాయం చేయాలని జావేద్ అక్తర్ కోర్టును కోరారు. విచారణకు స్వీకరించిన అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 3 తేదీకి వాయిదా వేసింది. కాగా కంగనా రనౌత్ ప్రస్తుతం తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు. తన కజిన్ వివాహంలో బిజీగా ఉన్నారు. చదవండి: కంగనాపై మరో కేసు నమోదు.. -
సీఎంపై రేప్ ఆరోపణలు; 100 కోట్ల దావా!
సాక్షి, రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం దావాలో సోరెన్ తెలిపారు. ఈ మేరకు రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ దావాలో బీజేపీ ఎంపీతో పాటు ట్విటర్ కమ్యూనికేషన్సు ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఫేస్ బుక్ ఇండియా ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లను రెస్పాండెంట్ 2, 3 లుగా పేర్కొంటూ పార్టీలుగా సీఎం చేర్చారు. సీఎం సోరెన్ పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ దూబే ట్విటర్లో ఆరోపించారు. తన పరువును దెబ్బ తీసేలా జులై 27న సోషల్ మీడియాలో దూబే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని.. అందువల్ల వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం చెప్పారు. ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది. పరువునష్టం దావా వేసిన తరువాత కూడా బీజేపీ ఎంపీ హేమంత్ సోరెన్‌పై ట్విటర్ వేదికగా బాణాలు కురిపిస్తునే ఉన్నారు. ‘మీపై ముంబైలో ఒక యువతి రేప్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్‌లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశారు. చదవండి: యువతిని కొట్టిన పోలీస్, సీఎం ఆగ్రహం -
చెప్పని సారీ విలువ లక్షా ఇరవై డాలర్లు!
జడ్జిగారు తీర్పు చెప్పేశారు. డేవిడ్ గారు శారా గారికి 1,20,000 డాలర్లు చెల్లించాలి! ఇంతమొత్తం అంటే మన కరెన్సీలో 58 లక్షల 38 వేల 723 రూపాయలు. పెద్ద మొత్తమే. కానీ శారా సంతోషించింది అంత పెద్ద మొత్తానికి కాదు. డేవిడ్‌ను తను కోర్టుకు ఈడ్చగలిగింది. తనకు జరిగిన అవమానం చిన్నది కాదు అని జడ్జిగారు కూడా భావించారు. వీటికన్నా ముఖ్యం.. మహిళల్ని చులకన చేసి మాట్లాడ్డానికి ఇకనుంచీ పురుషులు జంకుతారు. అది కావాలి తనకు. డేవిడ్ పెద్ద మనిషి. 67 ఏళ్ల మనిషి. ఇంకా పెద్ద విషయం.. ఆస్ట్రేలియా పార్లమెంటులో అధికార ‘లిబరల్ డెమోక్రాటిక్’ పార్టీ సెనెటర్. ఆయనపై ఇప్పుడు కేసు గెలిచిన శారా ఆయనతో పోలిస్తే చాలా చిన్న. వయసు 37 ఏళ్లు. ‘గ్రీన్’ పార్టీ సెనెటర్. 2018 జూన్‌లో ఆస్ట్రేలియా పార్లమెంటులో ఒక విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు అంత పెద్ద డేవిడ్‌గారు శారాను తటాలున అనకూడని మాట అనేశారు. తటాలున అనేశాడనీ అనుకున్నారు మిగతా సెనెటర్లు కూడా. కానీ ఆయన పదే పదే శారాను ఆ మాట అంటూ ఉండటంతో కావాలనే అంటున్నారని అర్థమైంది. సారీ చెప్పమన్నారు శారా. చెప్పను అన్నారు డేవిడ్‌గారు. శారా కోర్టుకు వెళ్లారు. ఏడాదికి పైగా కేసు నడిచి శారాకు అనుకూలం గా సోమవారం తీర్పు వచ్చింది. ఇంతకీ డేవిడ్ శారాను అన్న మాట ఏమిటి? ‘స్టాప్ షాగింగ్ మెన్’ అన్నారు! షాగింగ్ అనే మాటకు సాధారణ అర్థం ‘వెంటపడడం’. ‘ముగ్గులోకి దింపడం’ అని వేరే అర్థం కూడా ఉంది.. ‘స్టాప్ షాగింగ్ మెన్’ అంటే మగాళ్లను ముగ్గులోకి దింపడం మానెయ్’ మని అర్థం. పెప్పర్ స్ప్రే వాడకాన్ని నిషేధించాలా వద్దా అనే అంశం పై సభలో వేడిగా చర్చ జరుగుతున్నప్పుడు డేవిడ్ సహనం కోల్పోయి శారాను ఇలా అనేశారు పరువునష్ట పరిహారాన్ని చెల్లించబోతున్నారు. -
బీజేపీ ఎమ్మెల్యేపై రూ. 204 కోట్ల దావా
బెంగళూరు: తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ సీనియర్‌నేత డీకే శివకుమార్, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌పై రూ. 204 కోట్ల పరువునష్టం దావా వేశారు. శివకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జూన్ 23న పాటిల్ నాపై నిరాధార వ్యాఖ్యలు చేశారు. కేసులు నమోదు చేయవద్దంటూ నేను బీజేపీ నాయకులను, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చినట్లు మీడియాతో అన్నారు. ఒకవేళ నాపై కేసులు నమోదుచేయకపోతే సంకీర్ణ కూటమి పతనంలో నేను తటస్థ వైఖరి అనుసరిస్తాను అన్నట్లు చెప్పారు. వీటి వల్ల కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో నా విధేయత, చిత్తశుద్ధి దెబ్బతిన్నాయి. నా ప్రతిష్ట మంటగలిచింది’ అని చెప్పారు. రామానగర్ జ్యుడీషి యల్ మెజిస్ట్రేట్ కోర్టులో సెప్టెంబర్ 18న ఈ కేసు విచారణకు రానుంది. -
‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’
బాలీవుడ్ నటి ఈషా గుప్తా మీద పరువు నష్టం కేసు నమోదయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈషా గుప్తా సోషల్ మీడియాలో.. రోహిత్ విగ్ అనే వ్యక్తి ప్రవర్తించిన తీరు ఎంతో క్రూరంగా ఉందని, తనకెంతో అసౌకర్యంగా, అభద్రంగా అనిపించిందని ఆమె వెల్లడించారు. తన చుట్టు ఇద్దరు గార్డులు ఉన్నా.. అతను చూపులతో స్వైరవిహారం చేశాడని, అలాంటివాళ్లు నాశనమవ్వాలని, అతని ప్రవర్తన వల్ల తాను రేప్‌కు గురవుతున్నట్టు అనిపించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్త, ఈషా గుప్తా మీద పరువు నష్టం కేసు నమోదు చేశాడు. ఈషా చేసిన ఆరోపణల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు తలెత్తుకుని తిరగలేకపోతున్నామని.. ఎంతో మనో వేదన అనుభవించామని తెలిపాడు. తాను మౌనంగా ఉంటే ఈ ఆరోపణలను నిజమని నమ్ముతారని.. అందుకే ఆమె మీద పరువు నష్టం దావా వేసినట్లు తెలిపాడు. (చదవండి : రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది: నటి) ఈ సందర్భంగా రోహిత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఈషా ఆరోపణల వల్ల రోహిత్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదన అనుభవించారు. రోహిత్ స్నేహితులు, కొలీగ్స్.. అతడిని, అతని కుటుంబ సభ్యులను ప్రశ్నలతో వేధిస్తూ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చుట్టు పక్కల ఉండే వారు నా క్లయింట్ వ్యక్తిత్వం పట్ల, నైతికత పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈషా గుప్తా మీద పరువు నష్టం కేసు నమోదు చేశాం. ఆమె నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేస్తున్నాం’ అని తెలిపాడు. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్ వారెంట్
సాక్షి, కృష్ణా: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం సైదేశ్వరరావు ఓ భూమిని కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. అయితే దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథానాన్ని ప్రచురించారు. ఆ కథనం పూర్తిగా అసత్యమైనదని ఆరోపిస్తూ.. సైదేశ్వరరావు జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించారు. ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మాధవి, స్థానిక విలేకర్లు వెంకట రమేష్, నాగేశ్వరరావు, అదే విధంగా తప్పుడు ప్రకటన చేసిన నారాయణం, కృష్ణారావులపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారందరూ కోర్టుకు హాజరుకావాల్సింది న్యాయమూర్తి అనేక సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వారు వాయిదాలకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. వారెంట్‌ను రద్దు కోరుతూ.. రాధాకృష్ణ తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. -
పరువు నష్టం దావా: కోర్టుకు రాని పేర్వారం రాములు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డీజీపీ పేర్వారం రాములుపై మాజీ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాధవరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిన నేపథ్యంలో రాములుపై పరువునష్టం దావా వేశారు. బుధవారం రాములును విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో రాములును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, రాములు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా మాజీ డీజీపీ రాములును అరెస్ట్ చేయాలని పిటీషనర్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు 75 ఏళ్ల వయస్సుతో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేదని.. రాములు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఇరు వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఈ కేసుపై తుది తీర్పును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది. -
‘ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’
సాక్షి, వైఎస్సార్: చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఓ పత్రిక తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. తప్పుడు కథనాలను రాస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పరువుకు భంగం కలిగే విధంగా వార్తలను ప్రచురించిన పత్రికపై పరువునష్టం దావావేసి, పత్రికా యజమాన్యాన్ని కోర్టుకి లాగుతానని డీఎల్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. -
రిలయన్స్ ఇన్ఫ్రా మరో భారీ డిఫమేషన్
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూపు మరోసారి భారీ డిఫమేషన్ సూట్‌ను దాఖలు చేసింది. రాఫెల్ డీల్ పై అవాస్తవాలను, అబద్ధాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఇటీవల ఎన్డీటీవీ పై 20వేల కోట్ల రూపాయల దావా వేసిన అనిల్ రిలయన్స్ గ్రూపు ఇపుడు మరో మీడియా సంస్థను టార్గెట్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ది సిటిజెన్ వ్యవస్థాపకుడు-సంపాదకుడు సీమా ముస్తఫాకు వ్యతిరేకంగా 7వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. రాఫెల్ ఒప్పందంలో తమ కవరేజ్ నేపథ్యంలో తమపై ఈ దావా నమోదైనట్టు సిటిజెన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తమకు మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అంబానీ అరోపణలను తిరస్కరించిరన సిటిజన్ తాము వాస్తవాలకు కట్టుబడి నిజాలను నిర్భీతిగా ప్రజలకు అందించేందుకు, నిజాయితీ, జవాబుదారీతనం, సమగ్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. అలాగే రాజకీయ లేదా కార్పొరేట్ నిధులు లేని స్వతంత్ర మీడియా జర్నలిజం భవిష్యత్తు కీలకమైనదని విశ్వసిస్తున్నామని పేర్కొంది. -
తనుశ్రీకి పిచ్చి పట్టింది
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్లో ఇప్పటికీ వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది. కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నానాకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. నటి రాఖీ సావంత్ కూడా ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో నానాకి మద్దతుగా మాట్లాడారు. ‘‘నానా పటేకర్, గణేశ్ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నాకు మహిళలపై గౌరవం ఉంది. వారి గురించి తప్పుగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. పదేళ్లుగా కోమాలో ఉండి ఈ మధ్యే బయటికి వచ్చింది. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నానాని తప్పుపడుతోంది’’ అన్నారు. రాఖీ సావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీ ఫైర్ అయ్యారు. ఆమెపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి. -
రాఖీ సావంత్‌కి తనుశ్రీ కౌంటర్
సాక్షి, ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం రేపిన నటి తనుశ్రీ దత్తా మరో కీలక అడుగు వేశారు. తనుశ్రీ -నానా పటేకర్ వివాదంలో నానాకు మద్దతుగా నిలవడంతోపాటు తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాఖీ సావంత్‌ను చట్టపరంగా సవాల్ చేసింది. 10 కోట్ల రూపాయల విలువైన పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు తనుశ్రీ న్యాయవాది నితిన్ మీడియాకు తెలిపారు. దీనికి రాఖీ సమాధానం చెప్పకపోతే, ఆమెకు రెండు సంవత్సరాలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. తనుశ్రీ దత్తా ఆరోపణలపై పచ్చి అబద్ధాల కోరు అంటూ బాలీవుడ్ రాఖీ సావంత్ తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా హారన్ ఓకే ప్లీజ్ మూవీ షూటింగ్ రోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుండడంతోనే తనతో ఆ పాట పూర్తి చేశారంటూ తనుశ్రీపై ఎదురు దాడికి దిగింది. ‘నానా పటేకర్ లాంటి గొప్ప నటుణ్ని తనుశ్రీ అవమానిస్తోంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మహిళలతో చాలా గౌరవంగా ప్రవర్తిస్తార’ని రాఖీ తెలిపింది. అంతేకాదు తనుశ్రీ దత్తా రక్తం నిండా మత్తుమందులే ఉంటాయని తెలిపింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇన్నేళ్ల తర్వాత తనుశ్రీ ఇలా మాట్లాడుతోందని పేర్కొంది. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతోంది కాబట్టి తనుశ్రీ మాటలకు ప్రాధాన్యం లభిస్తోంది. రుజువులు చూపిస్తే తాను ఇండియా వదిలిపోతానని, ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే తన ముందుకు వచ్చి మాట్లాడాలంటూ రాఖీ సవాల్ చేసిన సంగతి విదితమే. దీంతో రాఖీపై రూ. 10 కోట్ల మేరకు తనుశ్రీ పరువునష్టం దావా వేసింది. -
#మీటూ: ఆయన పరువు నష్టం విలువ రూపాయే!
ముంబై : మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న బాధితులపై పరువునష్టం దావాల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై లైంగిక ఆరోపణలు చేసిన రచయిత, నిర్మాత వింటా నందాపై పరువు నష్టం దావా వేసారు. ఆమె ఆరోపణలను ‘నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. రేప్ జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు.’ అంటూ చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పిన అలోక్ నాథ్.. డిఫమేషన్ దావాలో కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం అడిగారు. తన పరువుకు భంగం కలిగిందని, దీనికి వింటా నందా రాతపూర్వక క్షమాపణలతో పాటు ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దావా వేశారు. దీంతో ఇదేం పరువు నష్టం దావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలోక్ తప్పతాగి గదిలోకి వచ్చాడు..) కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చిన విషయం తెలిసిందే.19 ఏళ్ల కిందట అలోక్ నాథ్ తనకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకుంది. (చదవండి: ‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’) #AlokNath has filed a civil defamation suit against writer producer Vinta Nanda seeking a written apology and Rs 1 as compensation. Nanda had accused Alok Nath of rape #MeToo pic.twitter.com/hSMwfsRdp1 — ANI (@ANI) October 15, 2018 -
నేషనల్ హెరాల్డ్‌పై 5,000 కోట్ల దావా
అహ్మదాబాద్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో నేషనల్ హెరాల్డ్‌లో ప్రచురితమైన ఓ కథనం తమ కంపెనీపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా, చైర్మన్ అనిల్ అంబానీ పరువుకు నష్టం కలిగించేలా ఉందని చెప్పింది. అలాగే రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలు చేశారంటూ గుజరాత్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్‌పై మరో రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను రిలయన్స్ గ్రూప్ వేసింది. ఈ సందర్భంగా కోర్టులో రిలయన్స్ న్యాయవాది మాట్లాడుతూ.. ‘రాఫెల్ ఒప్పందం ప్రకటించడానికి 10 రోజులకు ముందు అనిల్ కంపెనీ పెట్టారు’ అంటూ నేషనల్ హెరాల్డ్‌లో తప్పుడు, అసత్య కథనం రాశారని తెలిపారు. గోహిల్ కూడా పలుమార్లు తామేదో అక్రమంగా లాభపడినట్లు విమర్శలు చేశారన్నారు. -
కాలాకు మరో కష్టం
తమిళసినిమా (చెన్నై): విడుదలకు సిద్ధమైన ‘కాలా’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ముంబైలో నివసించిన తమిళుడు త్రివియం నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో తన తండ్రిని అవమానించేలా చూపారని త్రివియం కుమారుడు.. నటుడు రజనీకాంత్‌కు నోటీసులు పంపారు. 1957లో తూత్తుకుడిలో కరవు తాండవించడంతో త్రివియం ముంబై వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న తమిళులకు అండగా నిలిచారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై రజనీకాంత్, నిర్మాత ధనుష్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.102 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. -
జైట్లీ క్షమించేశారు...!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసంతృప్త నేత కుమార్ విశ్వాస్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన కుమార్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. జైట్లీకి, ఆయన కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి తనను క్షమించాలంటూ తన లాయర్ అమిత్ యాదవ్ ద్వారా కోర్టును కోరారు. కుమార్ క్షమాపణను స్వీకరిస్తున్నట్లు జైట్లీ తరపున కోర్టుకు హాజరైన ఆయన లాయర్లు రాజీవ్ నాయర్, మాణిక్ డోగ్రా తెలిపారు. దీంతో కుమార్ విశ్వాస్‌పై ఉన్న పరువు నష్టం దావా కేసును ఎత్తివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీవాల్‌తో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సహా, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పేయిలు కూడా క్షమాపణలు తెలిపారు. తాజాగా కుమార్ విశ్వాస్ కూడా క్షమాపణలు తెలపడంతో జైట్లీ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. -
అరుణ్ జైట్లీ క్షమిస్తారా..?
న్యూఢిల్లీ : పంజాబ్ నేత బిక్రం సింగ్‌తో మొదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేజ్రీవాల్‌పై ముప్పైకి పైగా పరువు నష్టం దావా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పలు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెబుతూ లేఖలు రాయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరికి కూడా క్షమాపణలు చెప్పారు. నేడో, రేపో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా కేజ్రీ లేఖ అందనుంది. కానీ ఈ విషయంపై అరుణ్ జైట్లీ ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పరువు నష్టం కేసు.. 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీతో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ క్షమాపణలు తెలిపారు. అంత తేలిగ్గా వదలరు.. ఈ విషయాన్ని జైట్లీ అంత తేలికగా వదిలిపెట్టరని, ఆప్ కన్వీనర్‌ను క్షమించే అవకాశం లేదని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీతో పాటు.. తనపై ఆరోపణలు చేసిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పేయిలు కూడా క్షమాపణలు చెబితే జైట్లీ ఈ విషయం గురించి పునరాలోచిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
గడ్కరీకి సారీ చెప్పిన కేజ్రీవాల్..!
-
అప్పుడు తిట్టాను.. సారీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అకాలీదళ్ నేత బిక్రం మజిథియాకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కేజ్రీవాల్ తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీకి కూడా సారీ చెప్పారు. దేశంలో అతిపెద్ద అవినీతిపరుడు నితిన్ గడ్కరీయేనంటూ గతంలో కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ధ్రువీకృతం కానీ, ఆధారాలు లేని ఆరోపణలు ఆయనపై చేసినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు కేజ్రీవాల్ ఒక లేఖలో తెలిపారు. ‘వ్యక్తిగతంగా మీపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. గతంలో జరిగిన దానిని మరిచిపోయి.. కోర్టు కేసును ముగించేద్దాం’ అని ఆయన గడ్కరీకి రాసిన లేఖలో సూచించారు. సోమవారం గడ్కరీ, కేజ్రీవాల్ ఢిల్లీ పటియాల కోర్టులో నడుస్తున్న పరువునష్టం దావా కేసును ముగించాలంటూ అభ్యర్థనలు దాఖలు చేశారు. తనపై ఆరోపణలు చేసినందుకు గడ్కరీ ఈ దావాను కేజ్రీవాల్‌పై వేశారు. కేజ్రీవాల్‌పై దాదాపు 33 పరువునష్టం దావాలు కోర్టులో దాఖలు అయ్యాయి. వాటిని కూడా ఇదేవిధంగా కోర్టుబయట పరిష్కరించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అకాలీ నేత మజిథియాకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పడం పంజాబ్ ఆప్‌లో చిచ్చురేపింది. ఆయన తీరుకు నిరసనగా పార్టీ పంజాబ్ అధ్యక్షుడు భగవంత్ మాన్, ఉపాధ్యక్షుడు అమన్ అరోరా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు, వారికి సంబంధం ఏంటి? ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, మంగళవారం నాటి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ రాధాకృష్ణ తదితరులను ఆదేశించింది. అయితే, మంగళవారం నాటి విచారణకు వారు హాజరు కాకుండా తమ న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాము కోర్టు ముందు హాజరు కాలేపోతున్నామని అందులో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు, వీరికి ఏం సంబంధం ఉందంటూ ఆశ్చర్యపోయింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ... ఫిర్యాదుదారు ఎమ్మెల్యే అని, ఆయనే న్యాయస్థానం ముందు హాజరు కాగా, అసెంబ్లీతో సంబంధం లేని వ్యక్తులు మాత్రం గైర్హాజరయ్యారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తదుపరి విచారణకు వ్యక్తితంగా హాజరై తీరాలని రాధాకృష్ణ, శ్రీనివాస్, శేషగిరిరావు తదితరులకు తేల్చి చెప్పింది. -
‘ఆధారాలుంటే కోర్టులో తేల్చుకోండి’
సాక్షి,అహ్మదాబాద్: తన కుమారుడు జే షా కంపెనీలో అవినీతి చోటుచేసుకోలేదని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జే షా కంపెనీ సంపద పెరిగిందన్న ఓ వెబ్సైట్ కథనాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ అంశం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తనను, ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి దిగుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పలుమార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా ఎప్పుడూ క్రిమినల్ దావా వేయలేదని, రూ 100 కోట్ల పరువు నష్టం దావా వేయలేదని ఎద్దేవా చేశారు. తన కుమారుడు జే షా పరువు నష్టం దావా వేశారని, న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తూ విచారణ చేపట్టాలని కోరారని చెప్పారు. తమపై బురద చల్లే వారు ఇప్పుడు ఆధారాలతో కోర్టును సంప్రదించవచ్చని అన్నారు. అమిత్ షా కుమారుడు జే షాకు చెందిన టెంపుల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ స్వల్పకాలంలోనే రూ 50,000 టర్నోవర్ నుంచి రూ 80 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కంపెనీ టర్నోవర్ 16,000 రెట్లు పెరిగిందని దివైర్ వెబ్సైట్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఈనెల 9న జే షా అహ్మదాబాద్ మెట్రపాలిటన్ కోర్టులో ఆ వెబ్‌సైట్‌పై రూ 100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తప్పుడు కథనంతో తమ ప్రతిష్టను దిగజార్చిన నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ జే షా కోర్టును ఆశ్రయించారు. -
సల్మాన్‌ఖాన్‌పై రూ. 250 కోట్లకు దావా
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఈ సంవత్సరం కలిసొచ్చినట్లు లేదు. సల్లూ భాయ్ మీద 'వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్లకు పరువునష్టం దావా వేశారు. సల్మాన్ వృత్తిపరమైన ప్రవర్తన బాగోలేదని, తనకు తీవ్ర మానసిక వేదన కలిగించాడని, పరువు మొత్తం పోగొట్టాడని గలానీ ఆరోపించారు. వీర్ సినిమా కోసం తాను సల్మాన్ ఖాన్‌కు రూ. 10 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయానికి యువరాజ్, వాంటెడ్, ఇతర సినిమాల్లో చేస్తున్న సల్మాన్‌ఖాన్‌కు అప్పటి మార్కెట్ ప్రకారం రూ. 7-8 కోట్లు మాత్రమే ఇచ్చేవారన్నారు. సినిమా మరీ బ్రహ్మాండమైన హిట్ అయ్యి, లాభాలు ఎక్కువ వస్తే సల్మాన్‌కు రూ. 15 కోట్లు ఇవ్వాలని కూడా అప్పట్లో అంగీకారం కుదిరిందన్నారు. అయితే, ఆ సినిమా వల్ల ఎలాంటి లాభాలు లేకపోయినా.. 15 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ సల్మాన్ కార్యాలయం నుంచి తనపై ఒత్తిడి చేశారని గలానీ చెప్పారు. ఈ వివాదాన్ని తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్తే.. సల్మాన్ తనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టు కూడా తన వద్ద ఉన్న ఒప్పందం పత్రాలు చూసి.. అసలు డబ్బు ఎందుకు అడుగుతున్నారని సల్మాన్ ప్రతినిధిని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే.. ఈ మూడేళ్లలో తనకు కలిగిన మానసిక వేదన అంతా ఇంతా కాదని గలానీ అన్నారు. న్యాయవివాదం కారణంగా లాయర్ల ఫీజుల పేరుతో తన డబ్బు మొత్తం ఖర్చయిపోయిందన్నారు. అందుకే సల్మాన్‌పై రూ. 250 కోట్ల పరువునష్టం దావా వేశానన్నారు.