ముంబయి : బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా రనౌత్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువునష్టం దావా వేశారు. వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకుభంగం కలిగించేలా వ్యాఖ్యానించిందని కంగనా రనౌత్‌పై జావేద్ అక్తర్ క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు చేశారు. ముంబైలోని అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ఐపీసీ సెక్షన్ 499, 500 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చేసిన పలు వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: ఉద్ధవ్ ఠాక్రేకు ఫైర్ బ్రాండ్ కౌంటర్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కంగనా తన పేరును అనవసరంగా లాగిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నటుడు హృతిక్ రోషన్‌తో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడవద్దని అక్తర్ తనను బెదిరించారని ఆమె పేర్కొంది. కంగనా రనౌత్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూను లక్షల మంది చూశారని, ఇది తన ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అక్తర్ వాదించారు. దీంతో కంగనాపై క్రిమినల్ పరువు నష్టం దావాను విచారణకు స్వీకరించి తగు న్యాయం చేయాలని జావేద్ అక్తర్ కోర్టును కోరారు. విచారణకు స్వీకరించిన అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 3 తేదీకి వాయిదా వేసింది. కాగా కంగనా రనౌత్ ప్రస్తుతం తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు. తన కజిన్ వివాహంలో బిజీగా ఉన్నారు. చదవండి: కంగనాపై మరో కేసు నమోదు..
Comments
Please login to add a commentAdd a comment