Javed Akhtar
-
మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత
మందుకు బానిసగా మారి తన జీవితంలో పదేళ్లు వృథా చేసుకున్నానంటున్నాడు సినీరచయిత జావేద్ అక్తర్. ఒకప్పుడు తాగుడుకు బానిసైన ఈయన తర్వాత ఆల్కహాల్ మానేశాడు. తాజాగా అతడు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అదేంటో గానీ తాగితే నేను నేనులా ఉండను. ఈ మందు బాటిల్స్‌లో ఏం కలుపుతారో కానీ అది తాగగానే కోపంగా మారిపోతాను. నాలో మృగం బయటకు..అంత కోపంతో నేనెప్పుడూ ఊగిపోను. కానీ తాగినప్పుడు మాత్రం నాకు తెలీకుండానే ప్రమాదకరంగా మారిపోతాను. నాలోని ఓ రాక్షసుడు బయటకు వస్తాడు. మందు మానేయడం నేను చేసిన మంచిపనుల్లో ఒకటి. 1991 జూలై 31న చివరిసారిగా తాగాను. అప్పటినుంచి ఇప్పటివరకు దాని జోలికే వెళ్లలేదు. కానీ యుక్తవయసులో మందుకు బానిసవ్వకుండా ఉండాల్సింది. మద్యపానానికి అలవాటు పడి నా జీవితంలో దశాబ్దకాలం వృథా చేసుకున్నాను.సమయం వృథా చేసుకున్నాఫ్రెంచ్, పర్షియన్ వంటి భాష నేర్చుకోవడమో, సంగీతం నేర్చుకోవడమో.. ఇలా ఏవైనా కొత్తగా ప్రయత్నించాల్సింది. కానీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా గతేడాది వచ్చిన ద ఆర్చీస్, డుంకీ, కో గయే హమ్ కహాన్ వంటి చిత్రాలకు పాటరచయితగా పని చేశాడు.చదవండి: 70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్ -
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న జంట నిండు నూరేళ్లు కలిసి కాపురం చేయడం గగనమైపోయింది. చాలామంది రెండు మూడేళ్లకే మాకొద్దీ భాగస్వామి అని విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరేమో లేటు వయసులోనూ విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్లో 40 ఏళ్లుగా ఏ చీకూచింతా లేకుండా అన్యోన్యంగా కలిసి కొనసాగుతున్నారు అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ- గేయ రచయిత జావెద్ అక్తర్.సీక్రెట్ అదే!తాజాగా నటి షబానా తమ వైవాహిక బంధం ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది. 'మేమిద్దరం ఎవరి పనిలో వాళ్లం బిజీగా ఉంటాం. దీనివల్ల మేము తరచుగా కలుసుకోలేము. అందుకే మా వైవాహిక బంధం సక్సెస్ఫుల్ సాగుతుందని జావెద్ అంటుంటాడు. ఆయన తండ్రి, మా నాన్న ఇద్దరూ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కవులు, కమ్యూనిస్టులే! మా పేరెంట్స్ లాగే మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా విషయాల్లో ఒకే విధంగా ఉంటాయి.మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్సంతోషకరమైన విషయం ఏంటంటే.. మా బంధం అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా ధృడంగా తయారైంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు.. షబానా నా బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి వల్ల ఆ బంధమైతే మారలేదనేవాడు!' అని చెప్పుకొచ్చింది. కాగా జావెద్ అక్తర్ గతంలో హనీ ఇరానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జోయా, ఫర్హాన్ అని ఇద్దరు పిల్లలు సంతానం. హనీతో విడిపోయిన అనంతరం జావెద్ 1984లో షబానాను పెళ్లాడాడు.చదవండి: భయపెట్టేందుకు రెడీ అయిన సూపర్ హిట్ హారర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే? -
మందుకు బానిసయ్యా.. లేకుంటే కథ వేరేలా ఉండేది!
ప్రముఖ కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత జావెద్ అక్తర్.. తన మాజీ భార్య హనీ ఇరానీ ఇప్పటికీ మంచి స్నేహితులు. విడాకులు తీసుకున్నంతమాత్రాన తాము శత్రువులుగా మారిపోలేదని, తనంటే ఇప్పటికీ ఎంతో గౌరవం అంటున్నాడు జావెద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హుందాగా, తెలివిగా వ్యవహరించి ఉంటే మా కథ వేరేలా ఉండది. కానీ ఈ వ్యసనమే (మందు తాగే అలవాటు) మా రిలేషన్‌ను ముక్కలు చేసింది. కూతురు జోయా, కుమారుడు ఫర్హాన్ అక్తర్‌లతో హనీ పదేళ్లు భరించింది.. ఈ తాగుడు వల్లే ఆమె చాలా అద్భుతమైన మనిషి. ఎంతో మంచి వ్యక్తి. తనపై నాకు ఇప్పటికీ అంతే గౌరవం ఉంది.. అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే మేము ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాము. మేము పెళ్లి చేసుకున్నా మొదటి పదేళ్లు నన్ను ఎలాగోలా భరించింది. కానీ తనకూ అనిపిస్తుంది కదా.. ఇలాంటి తాగుబోతు భర్తగా దొరికాడేంటి? అని! ఒకానొక రోజు మందు మానేద్దామని డిసైడయ్యాను. అప్పటినుంచి మళ్లీ దాని జోలికే పోలేదు' అని చెప్పుకొచ్చాడు. రెండో పెళ్లి కాగా జావెద్- హనీ 1972లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ అని ఇద్దరు పిల్లలు సంతానం. 1985లో జావెద్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరవడానికి ముందే అతడు తన క్లోజ్ ఫ్రెండ్, నటి షబానా అజ్మీని పెళ్లాడాడు. ప్రస్తుతం ఇతడు లాహోర్ 1947 సినిమాకు పాటలు రాస్తున్నాడు. చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో! -
సిగ్గుండాలి అంటూ సందీప్ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్ రైటర్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్‌కు సందీప్ రెడ్డి వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు. యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్‌ను తాను ఏమీ అనలేదని జావేద్ అక్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్‌ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దానిని బట్టి యానిమల్ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్ అన్నారు. 'నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్‌లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. గతంలో జావేద్ అక్తర్‌పై సందీప్ చేసిన కామెంట్లు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్‌కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్‌లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్‌ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. -
బాలీవుడ్లో సందీప్ వంగా కాంట్రవర్సీ.. వాళ్లందరికీ ఒకేసారి కౌంటర్స్
రణ్‌బీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్లో వచ్చిన 'యానిమల్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 900 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రంపై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీంతో సందీప్ కూడా వారికి పలు ఇంటర్వ్యూలలో రివర్స్ ఎటాక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో సందీప్ వంగా పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మీ కుమారుడి 'మీర్జాపుర్' కోసం సలహాలు ఇవ్వండి యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరోక్షంగా విమర్శించారు. యానిమల్ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా ఆయన కుమారుడు జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్‌కు ఇవ్వాలి. ఆయన కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్‌లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్‌ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్ తెలిపాడు. నీకు సరిపోయే పాత్ర ఉంటే ఇస్తా.. కంగనాకు కౌంటర్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేసింది. 'మహిళలను శృంగార వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాలను చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆమె అన్నారు. దీంతో కంగనాపై కూడా సందీప్ రియాక్ట్ అయ్యాడు. 'కంగనా ఎలాంటి రివ్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. విమర్శించినా తప్పులేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా స్టోరీ చెబుతాను.' అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కూడా మళ్లీ ఘాటుగానే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. ముందుగా అది తెలుసుకోండి 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడ అర్థం అవుతుంది నాపై ఉన్న గౌరవం ఏంటో అని. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్‌లు అవుతారు జాగ్రత్త. అది మీకే డేంజర్ కావచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి, ఉండాలి' అంటూ కంగనా వ్యంగ్యంగానే సమాధానం ఇచ్చింది. నేను సందీప్ గురించి కామెంట్ చేయలేదు: ఆమిర్ ఖాన్ మాజీ భార్య యానిమల్ చిత్రంపై పరోక్షంగా బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అన్నారు. అందుకు సందీప్ కూడా ముందుగా తన భర్త నటించిన దిల్ సినిమా చూడాలని వ్యాఖ్యానించాడు. దీంతో ఆమె మళ్లీ ఇలా రియాక్ట్ అయింది. 'నేను ప్రత్యేకంగా సందీప్ వంగా సినిమాల గురించి కామెంట్ చేయలేదు. కొన్ని చిత్రాల్లో స్త్రీలను అగౌవపరిచేలా సీన్స్ షూట్ చేస్తున్నారని అన్నాను. ఇదే విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మరి ఆయన్నే నేను అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు.' అని ఆమె వ్యాఖ్యానించారు. -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్‌బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
యానిమల్‌లో ఆ సీన్‌ను తప్పుబట్టిన ప్రముఖ రచయిత
రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు. భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్‌తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
రచన ఏదైనా ప్రశ్నించడమే లక్ష్యం!
జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రక టిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. గ్వాలియర్‌లో పుట్టిన జావేద్ లక్నో అలీగఢ్, భోపాల్‌లలో ఎదిగారు. బాంబే చేరిన తర్వాత ఆయన పరిధి బాగా విస్తారమయింది. జావేద్ తన మిత్రుడు సలీం ఖాన్‌తో కలిసి రాసిన స్క్రీన్ ప్లేలు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. దాంతో వారికి మొట్ట మొదటి విజయ వంతమయిన సినిమా రాసే అవకాశం వచ్చింది. ‘హాథీ మేరె సాథీ’. అది సూపర్ హిట్ కావడంతో ఆ జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్‌గా మారింది. ‘సీతా ఔర్ గీతా’ చిత్రానికి పనిచేసే సమయంలో జావేద్‌కు ‘హనీ ఇరానీ’తో అయిన పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. వారిద్దరికీ జోయా, ఫర్హాన్‌లు జన్మించారు. 1979లో తన మొదటి కవిత రాశారు జావేద్. ఇంచుమించు అదే కాలంలో ‘షబానా ఆజ్మీ’తో పరిచయం సాన్నిహిత్యంగా మారింది. 1995లో ఆయన మొట్ట మొదటి కవితా సంకలనం ‘తర్కశ్’ వెలువడింది. మొదటి సంకలనమే కవిత్వాభిమా నుల నుంచీ, విమర్శకుల నుంచీ ప్రశంసను అందు కుంది. అంతేకాదు మన దేశంలో మొదటి ఆడియో బుక్‌గా కూడా ప్రాచుర్యం పొందింది. 1983లో హనీ ఇరానీ, జావేద్ విడిపోయారు. కానీ స్నేహంగానే ఉన్నారు. సలీం–జావేద్ జంటగా ‘అందాజ్’, ‘యాదోంకీ బారాత్’, ‘జంజీర్’, ‘దీవార్’, ‘షోలే’, ‘డాన్’, ‘త్రిశూల్’ లాంటి సూపర్ డూపర్ హిట్ సిని మాలకు స్క్రిప్టు రాశారు. వాళ్ళు రాసిన 24 సినిమా స్క్రిప్టుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆ జంట విడి పోయింది. 1981లో సలీం, జావేద్‌ల జంట విడి పోయాక జావేద్ అఖ్తర్ చాలా సినిమాలకు స్క్రిప్ట్ రచన చేశారు. వాటిల్లో ‘సాగర్’, ‘మిస్టర్ ఇండియా’, ‘బెతాబ్’, ‘లక్ష్య’ లాంటి విజయవంత మయిన సినిమాలు ఉన్నాయి. తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం గీతాలవైపు కదిలారు. అలాగే గొప్ప కవితలూ రాశారు. ఆయన రాసిన కవితలు, గజల్స్ సూటిగా మనసుకు హత్తు కుంటాయి. ‘లావా’ కవితా సంపుటి 2012లో వెలువడింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ‘ఇన్ ఆదర్ వర్డ్స్.’ అందులో ఆయన కాలాన్ని గురించి.. కాలమంటే ఏమిటి, /అలుపూ విరామమూ లేకుండా /సాగిపోతున్నది /అదట్లా ప్రయాణించ కుండా ఉండి వుంటే అదెక్కడుండేది / ఎక్కడో ఒక చోట ఉండేది కదా... అంటూ గొప్ప తాత్వికతతో రాశారు. ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మ నుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల నుండి పెల్లుబుకుతుంది. వర్తమాన అవ్యవస్థ గురించి తనకోపమూ, తన తాత్వికత, వేదన, దుఃఖం, ప్రశ్న–జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించారు. ఇందులో వర్తమాన మత ఛాందసవాదం గురించి ఖండిస్తూ రాశారు, మాట్లా డారు. ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి, కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించారు. ప్రశ్నించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించారు. వ్యాసకర్త సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత (జావేద్ అఖ్తర్‌కు నేడు సినారె పురస్కార ప్రదానం) -
Javed Akhtar: పాక్ గడ్డపై స్పీచ్‌తో సర్జికల్ స్ట్రైక్
ప్రముఖ సినీ గేయ రచయిత, ఉర్దూ కవి జావేద్ అక్తర్.. తాజాగా పాకిస్తాన్ గడ్డపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబై 26/11 దాడులకు కారకులైన ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ఈ పరిణామం భారతీయుల గుండెల్లో చేదు నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. దిగ్గజ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం కిందటి వారం లాహోర్(పాక్)లో ఓ కార్యక్రమం జరిగింది. దానికి జావేద్ అక్తర్ హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడున్న ఆడియొన్స్‌లో కొందరు ఆయనకు పలు ప్రశ్నలకు సంధించారు. మీరు పాకిస్తాన్‌కు ఎన్నోసార్లు వచ్చారు. మరి మీకు వెనక్కి వెళ్లాక.. మీ ప్రజలకు పాక్ వాళ్లు మంచోళ్లు అని, బాంబులు పేల్చే రకం మాత్రమే కాదు.. పూలమాలతో ప్రేమను కూడా కురిపిస్తారని అక్కడి ప్రజలకు మీరు ఎప్పుడైనా చెప్పారా? అని జావేద్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన.. ఇక్కడి ఎవరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు.ఇరు దేశాల ప్రజల ద్వేషం దేనిని పరిష్కరించదు. ఇక్కడ ఇరు దేశాల మధ్య వాతావరణం ఉత్కంఠభరితంగా మాత్రమే ఉంది. ముంబై ప్రజలమైన మేం.. ఉగ్రవాద దాడులను కళ్లారా చూశాం. దాడికి పాల్పడ్డవాళ్లు ఎక్కడో నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు. వాళ్లు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటప్పుడు భారతీయుల కోపానికి అర్థం ఉంది. దానిపై మీరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు అని కుండబద్ధలు కొట్టారాయన. वाह! शानदार @Javedakhtarjadu बहुत खूब... 👏🙌👏#JavedAkhtarInPakistan pic.twitter.com/snbXKCKmGf — Dr. Syed Rizwan Ahmed (@Dr_RizwanAhmed) February 21, 2023 అంతేకాదు.. పాక్ దిగ్గజాలకు భారతదేశం ఆతిథ్యమిచ్చిన రీతిలో భారతీయ కళాకారులకు పాకిస్తాన్లో స్వాగతం లభించలేదని ఆయన ఎత్తిచూపారు. ఉదాహరణకు.. ఫైజ్ సాబ్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన్ని ప్రముఖ సందర్శకుడిగా భావించింది భారత్. అదంతా అంతటా ప్రసారం అయ్యింది కూడా. అలాగే భారత్‌లో నుస్రత్ ఫతేహ్ అలీ ఖాన్, మెహ్దీ హాసన్‌లకు గౌరవ సూచికంగా పెద్ద ఎత్తున్న వేడుకలను అక్కడ(భారత్) నిర్వహించాం. మరి మీరు(పాక్) లతా మంగేష్కర్ కోసం ఏదైనా వేడుక నిర్వహించగలిగారా? అని నిలదీయడంతో.. అక్కడున్నవాళ్లంతా చప్పళ్లు చరిచారు. Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳 Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 జావేద్ అక్తర్ పాక్ ప్రసంగం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై చాలామంది అభినందనలు కురిపిస్తున్నారు. ఇక జావేద్ అక్తర్ వ్యాఖ్యలు మాటల తుటాలని.. పాక్ గడ్డపై ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక జావేద్‌పై ప్రశంసలు గుప్పించిన వాళ్లలో ప్రముఖ నటి కంగనా రౌత్ కూడా ఉన్నారు. -
కథలన్నీ సలీమ్వి... సంభాషణలు నావి
(జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి): బాలీవుడ్ స్టార్ రచయితలు సలీమ్ జావేద్ విడిపోయి ఇంతకాలం అయినా వారు ఇరువురూ ఏనాడూ తాము పని విభజన ఎలా చేసుకున్నారో చెప్పలేదు. ఎన్ని ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న వేసినా సమాధానం దాట వేసేవారు. కాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం తన పుస్తకం ‘టాకింగ్ లైఫ్’ విడుదల సందర్భంగా జావేద్ మాట్లాడుతూ ‘మేమిద్దరం (సలీం జావేద్) రాసిన సినిమాలన్నింటిలో ప్రతి కథా సలీం నుంచి వచ్చేది. సంభాషణలు నేను రాసేవాణ్ణి. స్క్రీన్ ప్లే ఇద్దరం సమకూర్చేవాళ్లం’ అని తేటతెల్లం చేశాడు. ఈ ఇద్దరి జంట రచనలో జంజీర్, యాదోంకి బారాత్, డాన్, షోలే, దీవార్, శక్తి వంటి సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రచయితలకు సినిమా రంగంలో స్టార్డమ్ తెచ్చిన జోడి వీరు. ‘మేమిద్దరం అనుకోకుండా కలిశాం. దర్శకుడు రమేష్ సిప్పి వాళ్ల నాన్న దగ్గర నెలకు 750 రూపాయల జీతానికి చేరాం. రాజేష్ ఖన్నా హీరోగా అందాజ్, హాతీ మేరి సాథి రాయడంతో స్థిరపడ్డాం’ అన్నాడాయన. బాలీవుడ్లో యాంగ్రీ యంగ్‌మేన్ ఇమేజ్ను హీరోకు సృష్టించిన ఈ జంట అనిల్ కపూర్ హీరోగా ‘మిస్టర్ ఇండియా’ (1987) రాశాక విడిపోయారు. (క్లిక్ చేయండి: అవకాశాలు ఇప్పిస్తాం, కోరికలు తీర్చమని అడిగారు) -
Kangana Ranaut: ముంబై కోర్టుకు కంగన
ముంబై: బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్(76) వేసిన పరువు నష్టం కేసులో నటి కంగనా రనౌత్ సోమవారం అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. కంగన నిర్దోషి అని ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు. మీడియా జోక్యం వద్దంటూ కంగన చేసిన వినతి మేరకు విచారణ సమయంలో లాయర్లు, మీడియా సిబ్బందిని బయటకు వెళ్లాలని మేజిస్ట్రేట్ ఆర్ఎన్ షేక్ విచారణ ఆదేశించారు. అనంతరం, ఇరు పక్షాల లాయర్ల సమక్షంలో కంగన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఓ టీవీ షోలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి జావెద్ అక్తర్ తదితరుల కోటరీయే కారణమంటూ కంగనా చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని కోర్టులో ఫిర్యాదు చేశారు. అనంతరం కంగన అదే కోర్టులో.. ఇంటికి పిలిపించుకుని తనపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరించారంటూ జావెద్ అక్తర్‌పై ఫిర్యాదు చేశారు. చదవండి: (బింబిసార.. అందమైన చందమామ కథ) -
'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు'
Kangana Ranaut Permanent Exemption Appeal Rejected In Javed Akhtar Case: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పలు విమర్శలపాలైంది. కంగనా మాట ధోరణి చూసి ఆమెకు అభిమానులు అయిన వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా కంగనాకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. బీటౌన్ ఫైర్బ్రాండ్పై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరు నుంచి 'శాశ్వత మినహాయింపు' కోసం దరఖాస్తు పెట్టుకుంది. కంగనా పెట్టుకున్న ఆ దరఖాస్తును ముంబై కోర్టు తిరస్కరించింది. చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే? బాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్లలో తాను ఒకరినని, వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కంగనా అభ్యర్థించింది. 'కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు.. కానీ, ఆమె ఒక కేసులో నిందితురాలు. ఆ విషయాన్ని ఆమె మర్చిపోవద్దు.' అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ స్పష్టం చేశారు. కేసు విచారణకు కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్దతిలో కంగనా వ్యవహరిస్తోందని కోర్టు తెలిపింది. చదవండి: మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా ఆమె సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఒక నిందితురాలిగా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని వెల్లడించింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు సూచించింది. బెయిల్ బాండ్ కోసం చట్టపరంగా ఉన్న నియమనిబంధనలను పాటించాలని ఆదేశించింది. నవంబర్ 2020లో ఓ ఇంటర్వ్యూలో కంగనా తనపై అనుచితి వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేశారు. చదవండి: కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా -
కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్
ముంబై: బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని, లేదంటే వారెంట్లు పంపుతానంటూ కోర్టు పరోక్షంగా బెదిరిస్తోందని, కోర్టుపై నమ్మకం పోయిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది’ అని కంగన అన్నారు. దీంతో కంగనపై జావెద్ అక్తర్ గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. దీంతో ఎట్టకేలకు సోమవారం కంగన కోర్టుకొచ్చారు. బెయిల్ వచ్చే అవకాశమున్న కేసుల్లోనూ ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే, లేదంటే వారెంట్ జారీచేస్తామని కోర్టు రెండుసార్లు పరోక్షంగా బెదిరించిందని ఆమె వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు తమకు వ్యతిరేకంగా సాగుతోందని, వేరే కోర్టుకు కేసును బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆమె సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు అక్టోబర్ ఒకటిన విచారించనుంది. -
Shabana Azmi Birthday: పెద్దగా కోరికలేవీ లేవు..కానీ ఇంకా కావాలి!!
-
Shabana Azmi birthday special: వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్
సాక్షి, హైదరాబాద్: వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. ముందుతరం నటీ నటులకు ఆమె ఒక నిఘంటువు. ఒక చిన్న ముఖ కవళిక, అంతకుమించిన విషాదపు విరుపు, కంటినుంచి జారీ జారని నీటి చుక్క.. ఒకపంటి మెరుపు ఇవి చాలు నటనకు అని చాటిచెప్పిన గొప్ప నటి షబానా అజ్మీ. ఏకకాలంలో 12 చిత్రాలలో పని చేసిన ఘనత ఆమె సొంతం. మన హైదరాబాదీ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ షూటింగ్ సమయంలో గంటల తరబడి వేచి చూడటం అంటే తనకు ఎపుడూ ఇబ్బంది కాలేదనీ ఎందుకంటే నిర్మాతలకు మనం ఒక ఎసెట్‌గా ఉండాలి తప్ప, భారంగా ఉండకూడదనేది తల్లి ఫౌకత్నుంచినేర్చుకున్న గొప్పపాఠం అంటారామె. తానొక గొప్పనటిగా చెప్పుకోను, సరైన సమయంలో సరైన అవకాశాలు దొరకడం తన అదృష్టం. ఈ ఘనత అంతా తనకు లభించిన చక్కటి శిక్షణ, స్క్రిప్ట్, గొప్ప దర్శకులకే దక్కుతుందన్నారు. సినిమా అనేది సంయుక్త కృషి అసలు సినిమా కథకు మించి ఏ యాక్టర్ ఎదగలేడంటూ స్క్రిప్ట్‌కు పెద్ద పీట వేశారామె. అలాగే సద్విమర్శలను జాగ్రత్తగా గమనించడంతోపాటు తనన పనిని తాను నిజాయితీగా అంచనా వేసుకుంటానంటారు షబానా. సాధించినదానికి పొంగిపోకుండా ఉండాలని ఎప్పటికే భావిస్తున్నాను ఎందుకుంటే నటన అంటే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడమే అంటారు. యువతకు స్వేచ్ఛ నివ్వాలని, వారి అభిపప్రాయాలను గౌరవించాలంటారు. తమ తల్లిదండ్రులు తనకు, తనసోదరుడు బాబా (సినిమాటోగ్రాఫర్, బాబా అజ్మీ) అలాగే పెరిగామని, అడగకుండా ఎపుడూ ఎలాంటి సలహా ఇవ్వలేదని ఇపుడు తానూ అదేఆచరిస్తున్నానన్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని తానునమ్ముతానన్నారు. సైకాలజీని అవపోసన పట్టిన షబానా పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఈజీ అయింది. బార్బరా స్ట్రీసాండ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్లో చెప్పినట్లుగా నాకు పెద్దగా కోరికలు లేవు....కానీ ఇంకా చాలా కావాలి. పాడతా.. అన్నీ కావాలి..భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను సాగిస్తున్న షబానా అజ్మీ తొలి వెబ్ సిరీస్ ‘ది ఎంపైర్’ ఓటీటీలో సందడి చేస్తోంది. -
కంగనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కోర్టు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన డిఫమేషన్ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు. చదవండి : Terrific Road Accidents: తీరని విషాదాలు జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా సినిమా యాక్టింగ్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు, కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
‘జావేద్ అక్తర్ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్ అక్తర్‌పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్‌పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక) జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం -
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
-
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తాలిబన్ల పేరు భారతదేశంలో మార్మోగుతోంది. తాలిబన్లకు ముడిపెట్టి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్ననే పెట్రోల్ ధరల పెరుగుదలకు తాలిబన్లే కారణమని ఓ బీజేపీ ఎమ్మెల్యే తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే బాలీవుడ్ ప్రముఖ రచయిత స్కీన్ రైటర్ జావేద్ అక్తర్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దేశంలో కూడా తాలిబన్ల మాదిరి ఆర్ఎస్ఎస్ తయారైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జావేద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే జావేద్ అక్తర్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన సినిమాలు దేశంలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ శనివారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని ఘట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదాం స్పందించారు. ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చదవండి: తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం ‘జావేద్ అక్తర్ వ్యాఖ్యలు సిగ్గు చేటు. అంతేకాకుండా బాధాకరం. సంఘ్, విశ్వ హిందూ పరిషత్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వసిస్తున్న కోట్లాదిమందికి ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయి. సంఘ్‌కు చెందిన వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పేంత వరకు మేం అతడి సినిమాలను భరత గడ్డపై విడుదల చేయనీయం’ అని రామ్ కదాం తెలిపారు. ట్విటర్లో ఈ వీడియోను విడుదల చేశారు. జావేద్ అక్తర్ మాజీ ఎంపీ. ప్రముఖ నటి షబానా అజ్మీ భర్త. ఆయన పిల్లలు ఫర్మాన్ అక్తర్ ప్రముఖ నటుడు కాగా, కుమార్తె ప్రముఖ నిర్మాత జోయ అక్తర్. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. -
కంగనాకు ఊరట: జావేద్ అక్తర్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కోర్టులో ఊరట లభించింది. ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కంగనాపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణకు బొంబాయి హైకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడో పక్షం మధ్యంతర దరఖాస్తులను అనుమతించలేమనీ, ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు, లేదా న్యాయవాదిని అడుగుతామని తెలిపింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యానికి కోర్టు అనుమతిస్తే సంబంధిత పిటిషన్లు వరదలా వచ్చి పడతాయని కోర్టు వ్యాఖ్యానించింది. కంగనాపై క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టు రెన్యువల్ నిలిపివేయాలంటూ జూలై 1న అక్తర్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. అలాగే జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సింగిల్‌బెంచ్‌ను ఆశ్రయించాలని కంగనాకు కోర్టు సూచించింది. కంగనాపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం కేసులేవీ లేవని తప్పుడు ప్రకటన చేశారని జావేద్ అక్తర్ ఆరోపించారు. ఇందుకు కంగన తరపు కౌన్సిల్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అథారిటీకి తప్పుడు పత్రాలు అందించిందంటూ ఆయన మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు. కోర్టులో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని రనౌత్ చేసిన ప్రకటన అబద్ధమని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించేదని జావేద్ అక్తర్ న్యాయవాది బృందా గ్రోవర్ వాదించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఇలాంటి పిటీషన్లను స్వీకరించలేమని జస్టిస్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తామని జావేద్ అక్తర్ న్యాయవాది భరద్వాజ్ తెలిపారు. "కంగనాకు పాస్‌పోర్టు జారీ చేయబడినప్పటికీ, అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదనే అంశాన్ని పాస్‌పోర్టు కార్యాలయ దృష్టికి తీసుకెడతామని భరద్వాజ్ చెప్పారు. రెండు ఎఫ్ఐఆర్లలో పేరున్నప్పటికీ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్‌లో లేదని కంగనా న్యాయవాది వాదించారు. సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉన్న కారణంగా తన పాస్ట్ పోర్టును రెన్యువల్ చేయాలని కోరుతూ జూన్ 28 న ప్రత్యేక డివిజన్ బెంచ్‌ముందు కంగన పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మునావర్ అలీ సయ్యద్ కంగనా, ఆమె సోదరి రంగోలిపై నమోదు చేసిన దేశద్రోహం కేసును రద్దు చేయాలని కోరుతూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 11 వ తేదీకి వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి అనంతరం(జూలై, 2020లో) వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ కంగనాపై పరువు నష్టం దావా వేశారు జావేద్ అక్తర్. దీంతో ఫిబ్రవరి 2021లో కోర్టు కంగనాకు నోటీసులు ఇచ్చింది. కానీ కంగన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆమెకు మార్చిలో బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
మరో వివాదంలో కంగనా
ముంబయి : బాలీవుడ్ వివాదస్పద నటి కంగనా రనౌత్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువునష్టం దావా వేశారు. వివిధ న్యూస్ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకుభంగం కలిగించేలా వ్యాఖ్యానించిందని కంగనా రనౌత్‌పై జావేద్ అక్తర్ క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు చేశారు. ముంబైలోని అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ఐపీసీ సెక్షన్ 499, 500 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చేసిన పలు వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: ఉద్ధవ్ ఠాక్రేకు ఫైర్ బ్రాండ్ కౌంటర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కంగనా తన పేరును అనవసరంగా లాగిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నటుడు హృతిక్ రోషన్‌తో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడవద్దని అక్తర్ తనను బెదిరించారని ఆమె పేర్కొంది. కంగనా రనౌత్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూను లక్షల మంది చూశారని, ఇది తన ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని అక్తర్ వాదించారు. దీంతో కంగనాపై క్రిమినల్ పరువు నష్టం దావాను విచారణకు స్వీకరించి తగు న్యాయం చేయాలని జావేద్ అక్తర్ కోర్టును కోరారు. విచారణకు స్వీకరించిన అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 3 తేదీకి వాయిదా వేసింది. కాగా కంగనా రనౌత్ ప్రస్తుతం తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు. తన కజిన్ వివాహంలో బిజీగా ఉన్నారు. చదవండి: కంగనాపై మరో కేసు నమోదు.. -
మీడియాపై ఆగ్రహం.. కరణ్‌కు మద్దతు
బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంతో బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే దీపికా పదుకోనె, రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారు కూడా విచారణ కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీవీ చానెళ్లల్లో ఓ వీడియో తెగ ప్రసారం అవుతుంది. గత సంవత్సరం కరణ్ జోహార్ నిర్వహించిన హౌస్ పార్టీని హైలైట్ చేస్తున్న ఈ వీడియోపై మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ శుక్రవారం స్పందించారు. మీడియా పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వివాదాస్పద వ్యవసాయ బిల్లుల గురించి మాట్లాడటానికి బదులు గత సంవత్సరం కరణ్ జోహార్ ఇంట్లో నిర్వహించిన పార్టీ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను) If Karan johar had invited some farmers too for his party life would have been easier for our TV channels.They would not have had to choose between farmers protest and Karan’s party!. it seems that Karan’s do is the second most favourite PARTY of our channels — Javed Akhtar (@Javedakhtarjadu) September 25, 2020 ‘కరణ్ జోహార్ తన పార్టీ కోసం కొంతమంది రైతులను కూడా ఆహ్వానించినట్లయితే, మన టీవీ చానెళ్ల పని సులభం అయ్యేది. అలా జరిగి ఉంటే ప్రస్తుతం వారు రైతుల నిరసన, కరణ్ పార్టీల మధ్య దేన్నో ఒక దాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఉండేది కాదు! కరణ్ తన రెండో పార్టీని మన చానెళ్లతో చేయాల్సి ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అక్తర్ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోలో కనిపించే ప్రముఖులలో, బాలీవుడ్ తారలు దీపికా పదుకోనె, రణబీర్ కపూర్, విక్కీ కౌషల్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్లతో పాటు చిత్ర నిర్మాతలు జోయా అక్తర్, అయాన్ ముఖర్జీ ఉన్నారు. దీనిలో కనిపించే సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి -
స్వయంవరానికి అర్హులు.. కానీ
(వెబ్ స్పెషల్): హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాల రాణులు.. అభిమానుల కలల దేవతలు.. వారితో స్నేహం కోసం ఎందరో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక వివాహం విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మలకు స్వయంవరం పెడితే రాకుమారులు సైతం క్యూ కడతారు. అయితే విచిత్రంగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రెండో భార్యగా వెళ్లి అభిమానులకు షాక్ ఇచ్చారు. స్మితా పాటిల్ మొదలు కరీనా వరకు చాలా మంది హీరోయిన్లు విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఓ సారి ఆ జాబితా చూడండి.. 1. స్మితా పాటిల్ 1970 దశకంలో తన అందం, అభినయంతో సినీ లోకాన్ని ఏలిన స్మితా పాటిల్ వివాహం విషయంలో మాత్రం ప్రేక్షకులను ఒకింత షాక్‌కు గురి చేశారు. అడిగితే ప్రాణాలర్పించే అభిమానులున్న స్మిత అనూహ్యంగా అలనాటి హీరో రాజ్ బబ్బర్‌ని వివాహం చేసుకున్నారు. ఆయనకు అప్పటికే నాదిరా అనే మహిళతో వివాహం అయ్యింది. కానీ స్మిత పరిచయం తర్వాత రాజ్ బబ్బర్ ఆమెకు విడాకులు ఇచ్చి.. స్మితను వివాహం చేసుకున్నారు. 2. షబానా అజ్మీ హీరోయిన్ అంటే కేవలం ఓ అందాల బొమ్మ అనుకునే ఇండస్ట్రీలో తన అభినయంతో టాప్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు షబానా అజ్మీ. ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్టు గెలుచుకున్నారు. నటిగానే కాక సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. అయితే షబానా అజ్మీ కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ కవి జావేద్ అఖ్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే ఆయన హనీ ఇరానీ అనే ఆమెను వివాహం చేసుకోవడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (చదవండి: భలే ఉన్నావు బాబు) 3. శ్రీదేవి ఇక అందాల తార, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి అంతర్జాతీయంగా క్రేజ్. బాల్యం నుంచి సినిమాల్లోనే ఉన్న శ్రీదేవి.. ఎందరికో కలల రాకుమారి. చాలా మంది హీరల ఫస్ట్ క్రష్ కూడా అతిలోక సుందరి మీదనే. స్వయం వరం ప్రకటిస్తే.. దేశవిదేశాల బడా బాబులు.. వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు శ్రీదేవి కోసం క్యూ కట్టేవారు అంటే ఆశ్చర్యం లేదు. అంతటి క్రేజ్ ఉన్న ఈ నటి.. నిర్మాత బోని కపూర్‌ని వివాహం చేసుకుని ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చారు. అది కూడా రెండో భార్యగా వెళ్లారు. వర్మ లాంటి చాలా మంది నేటికి ఈ నిజాన్ని జీర్ణించుకోలకపోతున్నారు. శ్రీదేవి కంటే ముందే బోని కపూర్‌కి మోనా కపూర్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకి విడాకులు ఇచ్చి.. శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి జాహ్నవి, ఖుషి అని ఇద్దరు సంతానం. (చదవండి: నా కథ చెబుతాను) 4. సారిక సారిక కూడా విడాకుల తీసుకున్నవ్యక్తినే పెళ్లాడారు. లోక నాయకుడు కమల్ హాసన్ జీవితంలో రెండో భార్యగా ప్రవేశించారు. కమల్ తన మొదటి భార్య వాణి గణపతికి విడాకులు ఇచ్చి.. సారికను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్. ఆ తర్వాత సారిక కమల్ నుంచి విడిపోయింది. అది వేరే కథ. 5. మన్యాత దత్ మన్యాత దత్ ఏకంగా మూడో భార్యగా మున్నాభాయ్ సంజయ్‌దత్ జీవితంలో ప్రవేశించారు. మన్యాత కన్నా ముందు సంజయ్ రిచా శర్మ, రియా పిల్లయ్ అనే ఇద్దరిని వివాహం చేసుకున్నారు. 6. కరిష్మ, కరీనా అక్కాచెళ్లల్లు ఇద్దరు విడాకులు తీసుకున్న వ్యక్తులనే వివాహం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, కరిష్మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత కరిష్మా సంజీవ్ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే అతడు నందిత మహతానీని వివాహం చేసుకున్నాడు. ఇక కరీనా.. చోటా నవాబ్ సైఫ్ అలీఖాన్ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే సైఫ్‌కు అమృతా సింగ్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు సారా, ఇబ్రహీం ఉన్నారు. అమృతతో విడాకుల అనంతరం సైఫ్, కరీనాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి తైమూర్ అనే బాబు ఉండగా.. రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: తగ్గాలమ్మాయ్ అన్నారు!) 7. విద్యా బాలన్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ యాక్టర్ విద్యా బాలన్. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఇక వివాహం విషయానికి వస్తే.. విద్యాబాలన్ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తినే వివాహం చేసుకున్నారు. యూటీవీ హెడ్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లాడారు. అయితే అతనికి ఇది మూడవ వివాహం కావడం గమనార్హం. 8. శిల్పా శెట్టి ఇక పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా కంటే ముందే రాజ్ కుంద్రాకు కవిత అనే మహిళతో వివాహం అయ్యింది. ఆమెకు విడాకులు ఇచ్చి.. శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికో కుమారుడు ఉండగా.. తాజగా సరోగసి ద్వారా మరో ఆడబిడ్డ వీరి కుటుంబంలో ప్రవేశించింది. ఇక వీరే కాక లారా దత్త(మహేభట్), కిరణ్ రావ్(అమీర్ ఖాన్), కల్కి కోచ్లిన్ (అనురాగ్ కశ్యప్), అమృత అరోరా (షకీల్ లడఖ్) విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఇక మన టాలీవుడ్లో అయితే విజయ నిర్మల, అమల, రాధిక వంటి వారు వివాహం అయిన వ్యక్తులను పెళ్లాడారు. మన హీరోల విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, శరత్‌బాబు, పవన్ కళ్యాణ్, శరత్ కుమార్, హరికృష్ణ, ప్రకాశ్ రాజ్ వంటి వారు కూడా రెండో వివాహం చేసుకున్నారు. -
‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది’
దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్, గేయ రచయిత జావేద్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్లో పాన్ సెంటర్లు, గుట్కా, మద్యం షాపులు, తెరుచుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) లాక్డౌన్లో మద్యం ప్రజలపై త్వరగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జావేద్ అక్తర్ అన్నారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మద్యం కారణంగా గృహహింస కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తెరవడం వినాశకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అన్ని సర్వేల ప్రకారం ఈ కాలంలో గృహ హింస కేసులు చాలా వరకు పెరిగాయి. ఈ సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే అది మహిళలు, పిల్లలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది’’. అని ట్వీట్ చేశారు. అయితే జావిద్ మద్యం సేవించడం మానేసినట్లు కనిపిస్తోందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 1991 జూలై 30 మద్యం స్వీకరించిన చివరి రోజు అని జావేద్ బదులిచ్చారు. (18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం ) కాగా భారత్‌లో మే 3 వరకు ముగియనున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రటకించిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్లో దేశంలోని అన్ని రాష్ట్రల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించి.. మే 4 నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం శుక్రవారం ఆదేశించింది. మద్యం షాపులలో ఒకేసారి అయిదుగురికి మించి ఉండకూదనే నిబంధనలు పెట్టింది. (మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! )