
హైదరాబాదీ నటి షబానా అజ్మీ 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ
సాక్షి, హైదరాబాద్: వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. ముందుతరం నటీ నటులకు ఆమె ఒక నిఘంటువు. ఒక చిన్న ముఖ కవళిక, అంతకుమించిన విషాదపు విరుపు, కంటినుంచి జారీ జారని నీటి చుక్క.. ఒకపంటి మెరుపు ఇవి చాలు నటనకు అని చాటిచెప్పిన గొప్ప నటి షబానా అజ్మీ. ఏకకాలంలో 12 చిత్రాలలో పని చేసిన ఘనత ఆమె సొంతం. మన హైదరాబాదీ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ
షూటింగ్ సమయంలో గంటల తరబడి వేచి చూడటం అంటే తనకు ఎపుడూ ఇబ్బంది కాలేదనీ ఎందుకంటే నిర్మాతలకు మనం ఒక ఎసెట్‌గా ఉండాలి తప్ప, భారంగా ఉండకూడదనేది తల్లి ఫౌకత్‌నుంచినేర్చుకున్న గొప్పపాఠం అంటారామె. తానొక గొప్పనటిగా చెప్పుకోను, సరైన సమయంలో సరైన అవకాశాలు దొరకడం తన అదృష్టం. ఈ ఘనత అంతా తనకు లభించిన చక్కటి శిక్షణ, స్క్రిప్ట్, గొప్ప దర్శకులకే దక్కుతుందన్నారు. సినిమా అనేది సంయుక్త కృషి అసలు సినిమా కథకు మించి ఏ యాక్టర్ ఎదగలేడంటూ స్క్రిప్ట్‌కు పెద్ద పీట వేశారామె.
అలాగే సద్విమర్శలను జాగ్రత్తగా గమనించడంతోపాటు తనన పనిని తాను నిజాయితీగా అంచనా వేసుకుంటానంటారు షబానా. సాధించినదానికి పొంగిపోకుండా ఉండాలని ఎప్పటికే భావిస్తున్నాను ఎందుకుంటే నటన అంటే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడమే అంటారు. యువతకు స్వేచ్ఛ నివ్వాలని, వారి అభిపప్రాయాలను గౌరవించాలంటారు. తమ తల్లిదండ్రులు తనకు, తనసోదరుడు బాబా (సినిమాటోగ్రాఫర్, బాబా అజ్మీ) అలాగే పెరిగామని, అడగకుండా ఎపుడూ ఎలాంటి సలహా ఇవ్వలేదని ఇపుడు తానూ అదేఆచరిస్తున్నానన్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని తానునమ్ముతానన్నారు. సైకాలజీని అవపోసన పట్టిన షబానా పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఈజీ అయింది. బార్‌బరా స్ట్రీసాండ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్‌లో చెప్పినట్లుగా నాకు పెద్దగా కోరికలు లేవు....కానీ ఇంకా చాలా కావాలి. పాడతా.. అన్నీ కావాలి..భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను సాగిస్తున్న షబానా అజ్మీ తొలి వెబ్ సిరీస్ ‘ది ఎంపైర్’ ఓటీటీలో సందడి చేస్తోంది.