మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు | Shabana Azmi Reveals Secret Behind Her Successful Marriage With Javed Akhtar | Sakshi
Sakshi News home page

40 ఏళ్లుగా కాపురం.. మా బంధం సక్సెస్‌ అవడానికి అదే కారణం!

Published Sun, May 19 2024 12:27 PM | Last Updated on Sun, May 19 2024 12:59 PM

Shabana Azmi Reveals Secret Behind Her Successful Marriage With Javed Akhtar

ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న జంట నిండు నూరేళ్లు కలిసి కాపురం చేయడం గగనమైపోయింది. చాలామంది రెండు మూడేళ్లకే మాకొద్దీ భాగస్వామి అని విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరేమో లేటు వయసులోనూ విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్‌లో 40 ఏళ్లుగా ఏ చీకూచింతా లేకుండా అన్యోన్యంగా కలిసి కొనసాగుతున్నారు అలనాటి హీరోయిన్‌ షబానా అజ్మీ- గేయ రచయిత జావెద్‌ అక్తర్‌.

సీక్రెట్‌ అదే!
తాజాగా నటి షబానా తమ వైవాహిక బంధం ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది. 'మేమిద్దరం ఎవరి పనిలో వాళ్లం బిజీగా ఉంటాం. దీనివల్ల మేము తరచుగా కలుసుకోలేము. అందుకే మా వైవాహిక బంధం సక్సెస్‌ఫుల్‌ సాగుతుందని జావెద్‌ అంటుంటాడు. ఆయన తండ్రి, మా నాన్న ఇద్దరూ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కవులు, కమ్యూనిస్టులే! మా పేరెంట్స్‌ లాగే మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా విషయాల్లో ఒకే విధంగా ఉంటాయి.

మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌
సంతోషకరమైన విషయం ఏంటంటే.. మా బంధం అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా ధృడంగా తయారైంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు.. షబానా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. పెళ్లి వల్ల ఆ బంధమైతే మారలేదనేవాడు!' అని చెప్పుకొచ్చింది. కాగా జావెద్‌ అక్తర్‌ గతంలో హనీ ఇరానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జోయా, ఫర్హాన్‌ అని ఇద్దరు పిల్లలు సంతానం. హనీతో విడిపోయిన అనంతరం జావెద్‌ 1984లో షబానాను పెళ్లాడాడు.

చదవండి: భయపెట్టేందుకు రెడీ అయిన సూపర్‌ హిట్‌ హారర్‌ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement